30 కేజీల డిజిటల్‌ పుత్తడి విక్రయించిన పేటీఎం | Paytm sells over 30 kgs of 'Digital Gold' | Sakshi
Sakshi News home page

30 కేజీల డిజిటల్‌ పుత్తడి విక్రయించిన పేటీఎం

Published Wed, May 3 2017 2:23 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

30 కేజీల డిజిటల్‌ పుత్తడి విక్రయించిన పేటీఎం - Sakshi

30 కేజీల డిజిటల్‌ పుత్తడి విక్రయించిన పేటీఎం

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎం 30 కేజీల ‘డిజిటల్‌’ పుత్తడిని విక్రయించింది. ‘డిజిటల్‌ గోల్డ్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహించే ఒక సర్వీస్‌ను ఇటీవలనే పేటీఎం సంస్థ, ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో నెలకొల్పిన విషయం తెలిసిందే.  

ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వీలును ఈ సర్వీస్‌ కల్పించింది. పేటీఎం మొబైల్‌ వాలెట్ల ద్వారా వినియోగదారులు 24 క్యారట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని ఎంఎంటీసీ–పీఏఎంపీ వాల్ట్స్‌లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండా భద్రంగా దాచుకోవచ్చు. లేదా నాణేల రూపంలో ఇంటివ ద్దకే డెలివరీ తీసుకోవచ్చు. లేదా ఎంఎంటీసీ–పీఏఎంపీకే తిరిగి విక్రయించవచ్చు.   

ఆరు రోజుల్లో...
ఈ డిజిటల్‌ గోల్డ్‌ సర్వీస్‌ను ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 30 కేజీల డిజిటల్‌ పుత్తడిని విక్రయించామని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ హెగ్డే చెప్పారు. చిన్న నగరాల నుంచి అధికంగా కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement