Digital sector
-
రెండొంతుల డిజిటల్ స్టార్లు.. ఉల్లంఘనులే
ముంబై: ‘డిజిటల్ స్టార్లు’గా వెలుగొందుతున్న చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అడ్వరై్టజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ ఆందోళన వ్యక్తం చేసింది. మూడింట రెండొంతుల మంది (69 శాతం) యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించింది. ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ 2024’ జాబితాలో పేర్కొన్న ఇన్ఫ్లుయెన్సర్ల తీరుతెన్నులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఏఎస్సీఐ ఈ విషయాలు వెల్లడించింది. ఇందుకోసం 2024 సెప్టెంబర్–నవంబర్ మధ్యకాలంలో వారు ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్‌లో ప్రమోట్ చేసిన పోస్టులను విశ్లేషించింది. దీని ప్రకారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నిర్దేశించిన డిస్క్లోజర్ (కీలక వివరాలను ఫాలోయర్లకు వెల్లడించడం) మార్గదర్శకాలను పాటించడంలో 69 శాతం మంది విఫలమైనట్లు ఏఎస్సీఐ పేర్కొంది. పరిశీలించిన 100 పోస్టుల్లో 29 పోస్టుల్లో మాత్రమే తగినన్ని డిస్క్లోజర్స్ ఉన్నాయని, 69 కేసుల్లో ఉల్లంఘనలు రుజువయ్యాయని వివరించింది. ఫ్యాషన్–లైఫ్‌స్టయిల్, టెలికం ఉత్పత్తులు, పర్సనల్ కేర్ విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది. నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లు తాము ప్రమోట్ చేసే కంపెనీలు లేదా ఉత్పత్తులతో తమకున్న సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో వారి ఫాలోయర్లు పూర్తి సమాచారం ఆధారంగా సముచిత నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రకటనల్లో పారదర్శకత లోపించడం, నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తుండటం ఆందోళనకరమైన విషయమని నివేదిక పేర్కొంది. నియంత్రణ సంస్థపరమైన చర్యలకు గురికాకుండా ప్రకటనకర్తలు, ఏజెన్సీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సమష్టిగా నిబంధనలకు అనుగుణంగా పని చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. -
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
Karishma Mehta: కథలు మార్చగలవు
రచయిత్రి, ఫొటోగ్రాఫర్ అయిన కరిష్మా మెహతా హ్యూమన్స్ ఆఫ్ బాంబే వెబ్సైట్ వ్యవస్థాపకురాలు, నిర్వాహకురాలు. హృదయాలను కదిలించే ప్రత్యేకమైన కథా విధానం ద్వారా ప్రజాదరణ పొందిన రచయిత్రి. ముంబై వాసి కరిష్మా మెహతా కాలక్షేపంగా కాకుండా సామాజిక బాధ్యతనూ తన కథనాల ద్వారా పంచుకుంటూ నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై డిజిటల్ రంగంలో తనను తాను ఆవిష్కరించుకోవడం, లక్షలమందికి చేరువైన తీరుతో సహా తన కథనంతటినీ పంచుకున్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించిన ఫేస్ బుక్ పేజీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ కరిష్మా మెహతాకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇప్పుడు విస్తృతమైన ప్లాట్‌ఫారమ్‌గా పరిణామం చెందింది. సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు ముంబై నివాసితుల కథనాలను వెలుగులోకి తెచ్చింది. అందుకోసం ఆమె పడిన కష్టం సామాన్యమైనది కాదు. సంపన్న వర్గంలో పుట్టినా తనకున్న ఆసక్తితో సామాన్యులలో తిరిగి, ఫొటోలతో వారి కథనాలను ప్రజలకు అందిస్తూ వచ్చింది. మొదట్లో ఇద్దరు టెక్నికల్ వ్యక్తులతో కలిసి ప్రారంభించిన ఈ పని మెహతాను నేడు మిలియన్ల మందికి చేరువ చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పలువురు ఆమె వెబ్‌సైట్‌కి ఫ్రీలాన్సర్లుగా ఉండేలా చేసింది. కిందటేడాది ‘హౌ ది హెల్ డిడ్ డూ ఇట్’ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్ ద్వారా వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఇతర నిష్ణాతులైన వ్యక్తుల ఇంటర్వ్యూల ద్వారా తనలో ఉన్న మరో ప్రతిభను పరిచయం చేసింది. రైటర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న కరిష్మా మాట్లాడుతూ – చేయూతగా మారడం సంతోషం ‘‘కష్టంలో ఉన్న వ్యక్తులను గుర్తించడం, కలుసుకోవడం, మాట్లాడటం ప్రతిరోజూ జరుగుతుంటుంది. వారి కథను ఐదు వందల పదాల్లో మా పోర్టల్ ద్వారా తెలియజేయడం మాత్రమే కాదు ఏళ్లుగా జరుగుతోంది... అవసరమైన వారికి డబ్బు సేకరించి వారు తమ కష్టమైన పరిస్థితి నుండి బయట పడటానికి సహాయం చేయడం సంతోషంగా ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్లో ఒక గర్భిణిని చూశాను. ఆమెకు అప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మగపిల్లవాడు కావాలనే ఆశతో పిల్లలను కంటూనే ఉంది. మద్యానికి బానిసైన భర్త ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె ఆసుపత్రి పాలు, భర్త జైలు పాలూ అయ్యారు. ఆమె కథనాన్ని జనం ముందుకు తీసుకువచ్చాను. ఆమెకు, ఆమె ఐదుగురు కూతుళ్లకు సమాజం నుంచి ఆర్థిక భద్రత లభించింది. ఆసరాగా అందిన రూ. 25 లక్షల రూపాయలు వారి జీవనం సాఫీగా గడపడానికి ఉపయోగపడ్డాయి. మరొక కథ జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అలీ భాయ్‌ది. చేయని నేరానికి ఏళ్లుగా జైలు జీవితం గడుపుతుండేవాడు. అతని కథ బయటకు రావడంతో ఆ జీవితం నుంచి విముక్తి లభించింది. అలాగే, యాసిడ్ బాధితులకు, సెక్స్‌వర్కర్ల పిల్లలకు, ఎముక గుజ్జు మార్పిడి అవసరమయ్యే పిల్లల కోసం క్రౌడ్ ఫండింగ్ చేసి ఐదుకోట్ల నిధులను సేకరించి, అందించాం. వెబ్‌సైట్‌కు నిధులు సమకూర్చడానికి చేసిన మొదటి ప్రయత్నంలో ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పుస్తకం పబ్లిష్ అయ్యింది. అంటే, మా కథలు ప్రజలలో పెద్ద మార్పును తీసుకువచ్చాయి. ఎన్నోచోట్ల నుంచి మాకు కథనాలు అందుతుంటాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని, సేవను అందించగలుగుతున్నాం’’అని వివరిస్తారు ఆమె. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే! ‘ఏ కలా సాధించలేనంత పెద్దది కాదు’ అని చెప్పే కరిష్మా జీవితంలో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని భావించే వ్యక్తి. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ నుండి బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందిన కరిష్మా ఎప్పుడూ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తూ ఉండేది. కెనడాలో డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ నుంచి స్ఫూర్తి పొంది ముంబైలోని వ్యక్తుల కథలు, వారి జీవితాలను పరిచయం చేయడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసింది. ఎటువంటి గుర్తింపు లేని వ్యక్తుల గురించి కథలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ వెబ్సైట్ ద్వారా ఆరువేలకు పైగా కథనాలను అందించింది. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమైన వారని, స్ఫూర్తిదాయకంగా ఉంటారని చూపించింది. నాలుగు లక్షలకు పైగా ఉండే సమూహాన్ని విజయవంతంగా నడిపిస్తోంది. ఫేస్బుక్లో మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రెండింతలకు పైగా ఉన్నారు. ఫ్రీలాన్స్ రైటర్‌గా టెడెక్స్ ప్రెజెంటర్‌గానూ రాణిస్తున్న కరిష్మాకు సామాన్యుల కథనాలను పరిచయం చేయడం పట్ల ఆమెకున్న అభిరుచి, వ్యవస్థాపక స్ఫూర్తి అత్యంత ప్రభావంతమైన వేదికగా రూపొందించడానికి ఉపయోగించుకుంది. ఆమె ఈ ప్రయాణం అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఎన్నో ఒడిదొడుకులనూ ఎదుర్కొంది. కాపీ క్యాట్ అనే పేరును సొంతం చేసుకుంది. వివాదాలను, సవాళ్లను స్వీకరించింది. అయినా, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ సమాజంలో తన ఉనికిని, బాధ్యతనూ సమానంగా నిలబెట్టుకుంటున్నానని తన మాటలు, చేతల ద్వారా నిరూపిస్తున్న కరిష్మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. – నిర్మలారెడ్డి -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
స్టార్టప్‌లతో 10 కోట్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్ క్యాపిటల్ సంస్థ సెకోయా క్యాపిటల్ ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్‌లు ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్‌పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్ చేసిన భారత్‌పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్ డాలర్లు, అలాగే భారత స్టార్టప్ సంస్థల్లోకి 40 బిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్‌లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. -
ఇన్ఫీ లాభం రూ.5,686 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2021–22, క్యూ4)లో రూ. 5,686 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 5,076 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 22.7 శాతం ఎగబాకి రూ.32,276 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ఆదాయం రూ.26,311 కోట్లుగా ఉంది. త్రైమాసికంగా తగ్గుదల... 2021–22 క్యూ3 (అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్)లో నమోదైన లాభం (రూ.5,809 కోట్లు)తో పోలిస్తే క్యూ4లో లాభం 2.1 శాతం తగ్గింది. ఇక మొత్తం ఆదాయం మాత్రం క్యూ3 (రూ.31,867 కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా 1.3 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి ఇలా... 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ నికర లాభం రూ.22,110 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతం ఎగసి రూ.1,00,472 కోట్ల నుంచి రూ.1,21,641 కోట్లకు పెరిగింది. కాగా, ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 13–15 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫీ అంచనా వేసింది. పటిష్టమైన డిమాండ్ పరిస్థితులు, భారీ స్థాయిలో దక్కించుకుంటున్న డీల్స్ ఇందుకు దోహదం చేస్తాయని కంపెనీ వెల్లడించింది. కాగా, 2021–22 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను 12–14 శాతంగా పేర్కొన్న ఇన్ఫీ, 2022 జనవరిలో దీన్ని 19.5–20 శాతానికి పెంచడం గమనార్హం. పటిష్టమైన డిమాండ్ నేపథ్యంలో అమ్మకాలు, డెలివరీ ఇంకా నవకల్పనల్లో సామర్థ్యాలను పెంచుకోవడం కోసం తగిన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) నిరంజన్ రాయ్ పేర్కొన్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యంశాలు... ► గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇన్ఫీ దక్కించుకున్న కాంట్రాక్టుల మొత్తం విలువ (టీసీవీ) 2.3 బిలియన్ డాలర్లు. పూర్తి ఏడాదికి టీసీవీ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్యూ4లో స్థూలంగా 110 కొత్త క్లయింట్లు జతయ్యారు. ► క్యూ4లో కంపెనీ నిర్వహణ మార్జిన్ 3 శాతం మేర దిగజారి 21.5 శాతానికి చేరింది. ఇక పూర్తి ఏడాదికి కూడా 3 శాతం తగ్గుదలతో 23 శాతంగా నమోదైంది. ► ఇన్ఫీ డైరెక్టర్ల బోర్డు 2021–22 ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.16 చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. తద్వారా పూర్తి ఏడాదికి ఇన్వెస్టర్లకు మొత్తం రూ.31 డివిడెండ్ (రూ.13,000 కోట్లు) లభించినట్లవుతుంది. 2020–21తో పోలిస్తే డివిడెండ్ 14.8 శాతం పెరిగినట్లు లెక్క. ► ప్రస్తుతం రష్యాకు చెందిన క్లయింట్లతో ఎలాంటి కాంట్రాక్టులు లేవని, రాబోయే కాలంలో కూడా సంబంధిత ప్రణాళికలు ఏవీ ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. రష్యాలో ఉన్న నామమాత్ర వ్యాపారాన్ని తరలిస్తున్నట్లు కూడా వెల్లడించింది. ► ఈ ఏడాది కనీసం 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది అంచనాలను మించి 85,000 మంది ఫ్రెషర్లకు ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, 2022 మార్చి 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,14,015కు చేరింది. వెరసి 2021 మార్చి చివరి నాటితో పోలిస్తే నికరంగా 54,396 మంది ఉద్యోగులు జతయ్యారు. ఐటీ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నేపథ్యంలో ఇన్ఫీలో ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 2021–22 క్యూ4లో 27.7 శాతానికి ఎగబాకింది, క్యూ3లో ఇది 25.5 శాతంగా ఉంది. 2020–21 క్యూ4లో అట్రిషన్ రేటు 10.9 శాతం మాత్రమే కావడం గమనార్హం. ► ఆర్థిక ఫలితాలు మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ఇన్ఫోసిస్ షేరు బుధవారం స్వల్పంగా 0.5 శాతం మేర లాభంతో రూ.1,749 వద్ద స్థిరపడింది. కాగా, విశ్లేషకుల అంచనాల మేరకు క్యూ4 ఫలితాలు లేకపోవడం, మార్జిన్లు దిగజారడం, అట్రిషన్ భారీగా ఎగబాకవడంతో ఇన్ఫీ ఏడీఆర్ బుధవారం నాస్డాక్లో ఒక దశలో 5 శాతం పైగా నష్టపోయింది. భారీ డీల్స్ దన్ను... 2021–22లో సుస్థిర వ్యాపార జోరు, భారీ స్థాయి డీల్స్‌ను చేజిక్కించుకోవడం, మరిన్ని పెద్ద డీల్స్ కూడా వరుసలో ఉండటం మాకు కలిసొచ్చింది. డిజిటల్ రంగంలో విజయవంతంగా నిలదొక్కుకోగలమన్న విశ్వాసాన్ని మా క్లయింట్లలో కల్పించడం ద్వారా మా మార్కెట్ వాటా వృద్ధి కొనసాగనుంది. 2022–23లో 13–15 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమని మేము విశ్వసిస్తున్నాం. గతేడాది కంపెనీ అన్ని వ్యాపార విభాగాలు, భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ–ఎండీ -
ఐటీ శ్లాబ్స్ హేతుబద్ధీకరించాలి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, ఆన్లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు.. ► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు. ► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది. ► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది. -
మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాలకు డిజిటల్ సేవలు అందించేందుకు స్పేస్ టెక్నాలజీ, టెలికం సాంకేతికల మేళవింపు తోడ్పడగలదని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనితో సమ్మిళిత వృద్ధి సాధ్యపడగలదని పేర్కొన్నారు. అంతరిక్ష టెక్నాలజీలు, ఉపగ్రహ కంపెనీల సమాఖ్య ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ) ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అటవీ ప్రాంతాలు, ఆదివాసీలు నివసించే మారుమూల ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాలు, ఎడారి గ్రామాలు మొదలైన ప్రాంతాలకు సంప్రదాయ విధానాల్లో డిజిటల్ సేవలను చేర్చడం కష్టం. ఇలాంటి ప్రాంతాలకు చేరుకునేందుకు స్పేస్ టెక్నాలజీలు ఉపయోగపడగలవని ఆశిస్తున్నా‘ అని ఆయన వివరించారు. స్పెక్ట్రంపై తగు సూచనలివ్వండి.. స్పెక్ట్రం నిర్వహణ తదితర అంశాల విషయంలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించిన విధానాల రూపకల్పనకు తగు సిఫార్సులు చేయాలని పరిశ్రమ వర్గాలకు ఆయన సూచించారు. స్పెక్ట్రం విషయంలో స్పేస్, టెలికం రంగాలు రెండూ ఒకదానితో మరొకటి అనుసంధానమైనవేనని ఆయన చెప్పారు. ఫైబర్, టెలికం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో సంక్షోభాల నిర్వహణ, ప్లానింగ్, రైళ్ల రాకపోకల నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి భారతీయ రైల్వేస్.. ఎక్కువగా స్పేస్ టెక్నాలజీలనే వినియోగిస్తోందని వైష్ణవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వేస్ విభాగం మరింత సమర్ధమంతంగా పనిచేసేందుకు ఉపయోగపడే సాధనాల గురించి రైల్వే, స్పేస్ విభాగాల అధికారులతో చర్చించి, అధ్యయనం చేయాలని, తగు పరిష్కార మార్గాలు సూచించాలని ఆయన పేర్కొన్నారు. ఐఎస్‌పీఏ ఆవిషఅకరణతో పరిశ్రమ, రీసెర్చ్ సంస్థలు, విద్యావేత్తలు, స్టార్టప్‌లు, తయారీ సంస్థలు, రైల్వేస్ వంటి సర్వీస్ సంస్థలు మొదలైన వాటికి కొత్త అవకాశాలు లభించగలవని వైష్ణవ్ చెప్పారు. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.. స్పేస్ టెక్నాలజీ రంగంలో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షించాలని, నియంత్రణ సంస్థలపరమైన అనుమతులు వేగవంతమయ్యేలా చూడాలని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలను సరి చేయాలని స్పేస్ సంస్థలు కోరాయి. తక్కువ వ్యయాల భారంతో రుణాలు లభించేలా తోడ్పాటు అందించాలని స్టార్టప్ సంస్థలు, చిన్న.. మధ్య తరహా కంపెనీలు ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘చాలా మటుకు అనుమతుల ప్రక్రియలు మందకొడిగా సాగుతున్నాయి. అనుమతులు లభించడానికి ఏడాదిన్నర పైగా పట్టేస్తోంది. మీరు వ్యక్తిగతంగా ఈ రంగాన్ని పర్యవేక్షించాలని కోరుతున్నాం. పురోగతి నివేదికలను ఎప్పటికప్పుడు మీరు పరిశీలిస్తుంటే, పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది‘ అని ప్రధానితో ఆన్లైన్లో పరిశ్రమ వర్గాలు నిర్వహించిన చర్చల సందర్భంగా భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తదితరులు కోరారు. దిగ్గజాలకు సభ్యత్వం.. ఐఎస్‌పీఏ తొలి చైర్మన్‌గా ఎల్అండ్టీ నెక్సŠట్ సీనియర్ ఈవీపీ జయంత్ పాటిల్ చైర్మన్‌గాను, భారతి ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వత్స్ వైస్ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ దిగ్గజాలు లార్సన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, నెల్కో (టాటా గ్రూప్), మ్యాప్‌మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, వన్‌వెబ్, అనంత్ టెక్నాలజీ మొదలైనవి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రెజ్, బీఈఎల్ తదితర సంస్థలకు సభ్యత్వం ఉంది. -
భారీ అవకాశాలు: డిజిటల్ హబ్‌గా విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో రోజురోజుకీ ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గణనీయంగా పెరుగుతోంది. కొన్నాళ్ల కిందటి వరకూ క్రమంగా ఒక పద్ధతిలో విస్తరిస్తూ వచ్చిన ఆన్లైన్ రంగం... కోవిడ్‌తో ఆకాశమే హద్దు అన్నట్లు పెరిగిపోయింది. ఆన్లైన్ వ్యవస్థే సమూలంగా మారిపోయింది. ఇంట్లో సరుకులు మొదలు... ఇతరత్రా వస్తువులు... తినే భోజనం... కాఫీ, టీ కూడా ఆన్లైన్లోనే ఆర్డరు చేసే పరిస్థితులు బాగా పెరిగిపోయాయి. మరోవంక సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచార వ్యూహాన్నీ మార్చాయి. పెద్ద ఎత్తున డిజిటల్ ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆన్లైన్ వినియోగదారుల అభిరుచులను కనుక్కోవడంతో పాటు ఎటువంటి ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు? ఎలాంటి ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు? వంటి డేటా కంపెనీలకు ఇంధనంగా మారుతోంది. సరిగ్గా ఈ అవసరమే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కు.. సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే ‘మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్’కు డిమాండ్‌ను పెంచుతోంది. రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖపట్నంలో ఇప్పటికే పలు కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ సేవలందిస్తున్నాయి. ఈ రంగానికి సంబంధించిన మానవ వనరులు కూడా ఇక్కడ పుష్కలంగా లభిస్తుండటంతో విశాఖలో రాబోయే రోజుల్లో ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఐదేళ్లలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ వార్షిక కార్యకలాపాలు 300 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అత్యంత వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా వచ్చే ఐదేళ్లలో డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాల విలువ ఏకంగా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పలు సంస్థలు అంచనాలు వేశాయి. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశాలూ లేకపోలేదన్నది నిపుణుల మాట. దీంతో ఐటీ ఆధారిత సేవలందిస్తున్న సంస్థలు కూడా డిజిటల్ మార్కెటింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. రాష్ట్రంలో మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖలోనే ఐటీ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయనే అంశం నిర్వివాదం. గతంలో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించినా... ఆ తరవాత నిపుణుల కొరత వంటి పలు కారణాలతో తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. డిజిటల్ మార్కెటింగ్‌కు వచ్చేసరికి మాత్రం ఇప్పటికే ఇక్కడ పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రిటైల్, హెల్త్, టెక్స్టైల్ బిజినెస్ రంగాల్లోని కంపెనీలకు సేవలందిస్తున్నాయి. వీటిలో హెల్త్‌టెక్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ రంగంలో విస్తరిస్తున్న పల్సస్ గ్రూపు ఇప్పటికే ఇక్కడ 2,500 మందికి ఉపాధి కల్పించింది. ఈ సంస్థకు దేశంలో గుర్గావ్, చెన్నై, హైదరాబాద్‌లో కేంద్రాలున్నా విశాఖ కేంద్రంలో 65 శాతం మహిళలే ఉండటం గమనార్హం. ఇక డబ్ల్యూఎన్ఎస్, ఏజీఎస్ హెల్త్‌టెక్, ఏసీఎస్ హెల్త్‌కేర్ వంటి ఇతర కంపెనీలూ విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఇప్పటికే 4 వేల మందికి పైగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి పొందుతుండగా... వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 20వేలకు చేరవచ్చనే అంచనాలున్నాయి. ‘‘వచ్చే ఐదేళ్లలో డిజిటల్ రంగ మార్కెట్ ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. దీన్లో కనీసం 2 శాతంపై ఏపీ దృష్టి సారించినా ఇక్కడ కనీసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది’’ అనేది నిపుణుల మాట.. తద్వారా డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖ కేంద్రంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ అన్ని విధాలా అనుకూలం ఐటీ సేవల రంగమైతేనే ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలం. దీనికి శిక్షణ పొందిన మానవ వనరులు కావాలి. డిజిటల్‌కూ అంతే. కొన్నాళ్లుగా మేం శిక్షణనిస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 2,500 మంది పనిచేస్తున్నారు. నగరంలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల లభ్యత కూడా పెరిగింది. పలు ఇతర కంపెనీలూ వచ్చాయి. నిజానికి ఏపీ ఐటీ నిపుణుల సంఖ్య లక్షల్లో ఉన్నా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఐటీకి ప్రాధాన్యమివ్వటం, విశాఖ సహా 3 చోట్ల ఐటీ కాన్సెప్ట్ సిటీలు ప్రతిపాదించటం రాష్ట్రంలో ఈ రంగానికి ఊతమిస్తాయి. డిజిటల్‌పై ప్రభుత్వం దృష్టి పెడితే ఇక్కడి విద్యార్థులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. – గేదెల శ్రీనుబాబు, పల్సస్ గ్రూపు సీఈవో విశాఖలో అపార అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖలో చాలా అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో ఉంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఇక్కడ మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈ రంగంలో కొన్ని కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరిన్ని కంపెనీలకు అవకాశం ఉంది. – ఆర్ఎల్ నారాయణ, చైర్మన్, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ఇన్వెస్ట్మెంట్ బ్రాండింగ్ కమిటీ డేటా చాలా కీలకం ఆన్లైన్ వ్యాపార రంగంలో ఉన్న కంపెనీలకు వినియోగదారుల అభిరుచులపై డేటా చాలా కీలకం. వారి అభిరుచులకు అనుగుణంగా వారు తమ వద్ద ఆయా ప్రొడక్ట్స్‌ను స్టాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వినియోగదారుల డేటా చాలా కీలకం. దీన్ని విశ్లేషించడం అంత సులువు కాదు. నిపుణులు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడాలి. ఇందుకోసం మా ఉద్యోగులకు మేమే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మార్కెట్ ప్లేస్ మేనేజ్మెంట్ రంగం చాలా కీలకంగా మారనుంది. – చమన్ బేడ్, ఏసీఎస్ హెల్త్‌టెక్ సీఈవో -
18- 40 ఏళ్ల లోపు వారే: వీళ్లు ‘డిజిటల్ స్పూన్’తో పుట్టారు!
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే శాసిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, డిజిటల్ రంగంలోని కంపెనీలకు వీరు అదనపు లాభాలను తెచ్చిపెడుతున్నారు. ‘బోర్న్ డిజిటల్’గా పిలిచే ఈ తరం వారివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.1,40,60,000 కోట్ల అదనపు లాభాలను కార్పొరేట్ కంపెనీలు పొందుతున్నాయి. ఏ దేశంలో అయినా బోర్న్ డిజిటల్ జనరేషన్ ఒక శాతం పెరిగితే ఆ దేశ కార్పొరేట్ కంపెనీల లాభాలు 0.9 శాతం పెరుగుతాయట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు వీరి నాయకత్వంలోనే నడుస్తాయని అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ సిట్రిక్స్ తాజా సర్వేలో పేర్కొంది. 10 దేశాల్లో వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు, 2 వేల మందికి పైగా ‘బోర్న్ డిజిటల్స్’ను ఆ సంస్థ సర్వే చేసింది. భారత్‌లో 0.4 శాతమే: 1981–96 మధ్య జన్మించిన మిలీనియల్స్, 1997 తర్వాత జన్మించి అత్యున్నత నైపుణ్యాల (హైఎండ్ స్కిల్స్)తో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ‘బోర్న్ డిజిటల్’గా పిలుస్తారు. పనిచేసే వారిలో వీరి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతోందని సర్వే పేర్కొంది. బోర్న్ డిజిటల్ జనాభాతో అమెరికా, చైనా, బ్రిటన్, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రయోజనం పొందుతుండగా.. జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి దేశాలు ఆ ప్రయో జనాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 8.8 శాతం మంది బోర్న్ డిజిటల్ జనాభా ఉద్యోగం చేస్తున్నారు. దీనివల్ల ఆ దేశ కంపెనీలు ఏటా రూ.16,13,200 కోట్ల అదనపు లాభాలు పొందుతున్నాయి. దీనికి భిన్నంగా బోర్న్ డిజిటల్ జనాభా తక్కువగా ఉన్న భారత్‌లో కంపెనీలు ఏటా రూ.16,35,400 కోట్ల లాభాలను నష్టపోతున్నాయి. హైఎండ్ స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసుకోవచ్చని సర్వే సూచించింది. కుటుంబానికీ ప్రాధాన్యమిస్తున్న బోర్న్ డిజిటల్ కోవిడ్ తగ్గాక కూడా బోర్న్ డిజిటల్ జనాభా తిరిగి కార్యాలయాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేయడానికే మొగ్గు చూపుతు న్నారు. భారత్‌లో 76 శాతం మంది మాత్రమే ఇంటి నుంచి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. బోర్న్ డిజిటల్ తరం వాళ్లు పని వేళలు కూడా వారికి నచ్చిన విధంగా నిర్ణయించుకునేలా ఉండాలంటు న్నారు. ఇలాంటి అవకాశం కోరుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది ఉంటే.. భారత్‌లో 86 శాతం మంది ఉన్నారు. వారంలో 4 రోజులు కార్యాలయ పనులకు, 3 రోజులు ఇంటికి కేటాయించేలా ఉండాలని అత్యధికులు కోరుకుం టున్నారు. 4 రోజుల పని దినాలు కావాలని అడుగున్న వారి శాతం 69గా ఉంటే.. భారత్‌లో అది అత్యధికంగా 76 శాతంగా ఉంది. -
డిజిటల్‌పై ఎయిర్టెల్ దృష్టి
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌కి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ బాటలోనే డిజిటల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరించింది. డిజిటల్, ఇండియా, ఇంటర్నేషనల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ నాలుగు ప్రధాన విభాగాలపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ వివరించింది. కొత్త మార్పుల ప్రకారం ఎయిర్టెల్ డిజిటల్ లిమిటెడ్ ఇకపై లిస్టెడ్ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో భాగంగా ఉంటుంది. వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్, మిత్రా పేమమెంట్స్ ప్లాట్‌ఫాం మొదలైన వాటితో పాటు భవిష్యత్‌లో ప్రవేశపెట్టే డిజిటల్ ఉత్పత్తులు, సర్వీసులు కూడా దీని కిందే ఉంటాయి. ఇక టెలికం వ్యాపార కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ఉంటాయి. డీటీహెచ్ సేవలకు సంబంధించిన భారతి టెలీమీడియా ప్రస్తుతానికి విడిగానే ఉంటుందని, ఈ వ్యాపారాన్ని అంతిమంగా ఎయిర్టెల్ లిమిటెడ్‌లోకి చేర్చే ఉద్దేశం ఉందని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ .. భారతి ఎయిర్‌టెల్‌లోనే ప్రత్యేక సంస్థగా కొనసాగుతుంది. మరోవైపు ఎన్ఎక్స్ట్రా, ఇండస్ టవర్స్ వంటి ఇన్ఫ్రా వ్యాపార సంస్థలు ప్రస్తుతానికి వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయి. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాటాదారులకు అధిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ మార్పులన్నీ దోహదపడగలవని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ఎయిర్టెల్ పోటీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ గతేడాది ఏకంగా రూ. 1,52,056 కోట్ల పెట్టుబడులు సమీకరించిన సంగతి తెలిసిందే. -
అమెరికన్ కంపెనీలపై వివక్ష
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ కంపెనీలకు సంబంధించి భారత్ పాటిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (డీఎస్టీ) విధానం.. అమెరికన్ కంపెనీల పట్ల వివక్షాపూరితంగా ఉంటోందని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) వ్యాఖ్యానించింది. ఇది అంతర్జాతీయ పన్ను విధానాలకు విరుద్ధమని ఆక్షేపించింది. డీఎస్‌టీపై చేపట్టిన విచారణ నివేదికలో యూఎస్టీఆర్ ఈ విషయాలు తెలిపింది. భారతీయ కంపెనీలకు మినహాయింపునిస్తూ, కేవలం విదేశీ సంస్థలనే టార్గెట్ చేస్తున్న భారత డీఎస్టీ విధానం పూర్తిగా వివక్షాపూరితమైనదిగా తేటతెల్లమవుతోందని పేర్కొంది. ‘‘దీనివల్ల స్థానికంగా కార్యాలయాలు లేని అమెరికన్ సంస్థల డిజిటల్ సర్వీసులపై పన్నులు విధిస్తుండగా.. అవే సర్వీసులు అందించే భారతీయ ప్రొవైడర్లకు మాత్రం మినహాయింపు ఉంటోంది. ఇది పూర్తిగా వివక్షాపూరితమైనదని స్పష్టమవుతోంది’’ అని యూఎస్టీఆర్ నివేదికలో పేర్కొంది. విదేశీ సంస్థలను విడిగా చూడటమే డీఎస్టీ ప్రధానోద్దేశమని ఒక ప్రభుత్వ అధికారి కూడా స్పష్టం చేసినట్లు వివరించింది. డిజిటల్ సర్వీసుల రంగంలో అమెరికన్ కంపెనీలు ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉన్న నేపథ్యంలో వాటిపై డీఎస్టీ భారం గణనీయంగానే ఉంటోందని తెలిపింది. దీని పరిధిలోకి వచ్చే 119 కంపెనీలను విశ్లేషించగా.. వీటిలో 86 సంస్థలు (దాదాపు 72 శాతం) అమెరికాకు చెందినవే ఉన్నాయని యూఎస్టీఆర్ వివరించింది. అస్పష్టత.. డీఎస్టీలోని కొన్ని అంశాలు అంతర్జాతీయ ట్యాక్సేషన్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని, కొన్ని విషయాల్లో స్పష్టత కొరవడిందని యూఎస్టీఆర్ తెలిపింది. దీనివల్ల పన్ను వర్తించే సర్వీసులు, ఏ సంస్థలు దీని పరిధిలోకి వస్తాయి వంటి అంశాలపై కంపెనీల్లో గందరగోళం నెలకొందని వివరించింది. వీటిని పరిష్కరించేందుకు భారత్ అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని యూఎస్టీఆర్ తెలిపింది. అందరూ సమానమే: భారత్ కాగా, యూఎస్టీఆర్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. భారత్‌లో స్థానికంగా ఉండని విదేశీ ఈ–కామర్స్ ఆపరేటర్లు ఎవరికైనా దీన్ని వర్తింపచేస్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సముచిత పోటీని ప్రోత్సహించేందుకు, భారత మార్కెట్లో డిజిటల్ కార్యకలాపాలు నిర్వహించే వ్యాపారాలపై పన్నులు విధించేందుకు ప్రభుత్వానికి ఉండే అధికారాల పరిధికి లోబడే డీఎస్టీ అమలు చేస్తున్నట్లు వివరించింది. -
బైడెన్ డిజిటల్ టీంలోకి కశ్మీరి మహిళ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్‌గా మరో భారతీయురాలిని నియమించారు. కశ్మీర్లో జన్మించిన ఈషా షాను ఈ పదవికి ఎంపికచేశారు. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా రాబ్ ప్లాహెర్టీ నేతృత్వం వహించనున్నట్లు బైడెన్ ట్రాన్సిషన్ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. లూసియానాలో పెరిగిన షా గతంలో బైడెన్-హారిస్ ప్రచారంలో డిజిటల్ భాగస్వామ్య నిర్హాకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జాన్ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్పోరేట్ ఫండ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గాను, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గానూ పనిచేశారు. (చదవండి: భారత్‌తో చెలిమికే బైడెన్ మొగ్గు!) ఇక ఇప్పటికే బైడెన్ తన టీంలో కమలా హారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా, నీరా టాండన్‌ను బడ్జెట్ చీఫ్‌గా, వేదాంత్ పటేల్‌లకు వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా, వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. గౌతమ్ రాఘవన్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో ఈషా షా కూడా చేరారు. -
రిలయన్స్ లాభం 9,567 కోట్లు
న్యూఢిల్లీ: కీలకమైన చమురు, రసాయనాల విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం తగ్గింది. లాభం 15 శాతం క్షీణించి రూ. 9,567 కోట్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 11,262 కోట్లు. ఇక ఆదాయం కూడా రూ. 1.56 లక్షల కోట్ల నుంచి రూ. 1.2 లక్షల కోట్లకు తగ్గింది. చమురు, రసాయనాల వ్యాపారం క్షీణించినప్పటికీ.. టెలికం తదితర వ్యాపారాలు మాత్రం మెరుగైన పనితీరు కనపర్చాయి. ‘రెండో త్రైమాసికంలో గ్రూప్ కార్యకలాపాలు, ఆదాయంపై కోవిడ్–19 ప్రభావం పడింది‘ అని రిలయన్స్ వెల్లడించింది. మరోవైపు, సీక్వెన్షియల్‌గా మెరుగైన ఫలితాలు సాధించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. ‘పెట్రోకెమికల్స్, రిటైల్ విభాగం కోలుకోవడం, డిజిటల్ సర్వీసుల వ్యాపార విభాగం నిలకడగా వృద్ధి సాధించడం వంటి అంశాల తోడ్పాటుతో గత క్వార్టర్‌తో పోలిస్తే నిర్వహణ , ఆర్థిక పనితీరు మెరుగుపర్చుకోగలిగాం. దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరగడంతో చాలా మటుకు ఉత్పత్తుల వ్యాపారం దాదాపు కోవిడ్ పూర్వ స్థాయికి చేరింది‘ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థూల రుణ భారం రూ. 2,79,251 కోట్లకు తగ్గింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది రూ. 3,36,294 కోట్లు. ఇక రూ. 1,85,711 కోట్ల నగదు నిల్వలు, వాటాల విక్రయం ద్వారా చేతికి వచ్చిన రూ. 30,210 కోట్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి రావాల్సిన రూ. 73,586 కోట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటే రుణాలు పోగా సంస్థ దగ్గర సుమారు రూ. 10,256 కోట్ల మిగులు ఉంటుంది. పెట్రోకెమికల్స్ ఆదాయం 23 శాతం డౌన్.. కీలకమైన పెట్రోకెమికల్స్ విభాగం ఆదాయం 23 శాతం క్షీణించి రూ. 29,665 కోట్లకు పరిమితమైంది. పన్ను ముందస్తు లాభం 33 శాతం తగ్గి రూ. 5,964 కోట్లకు క్షీణించింది. రిఫైనింగ్ వ్యాపార ఆదాయం రూ. 97,229 కోట్ల నుంచి రూ. 62,154 కోట్లకు క్షీణించింది. చమురు, గ్యాస్ విభాగ ఆదాయం రూ. 790 కోట్ల నుంచి రూ. 355 కోట్లకు తగ్గింది. రిఫైనింగ్ మార్జిన్ (ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా వచ్చే మార్జిన్) 5.7 డాలర్లుగా ఉంది. తగ్గిన రిటైల్ ఆదాయం.. క్యూ2లో రిలయన్స్ రిటైల్ ఆదాయం సుమారు 5 శాతం తగ్గి రూ. 39,199 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం దాదాపు 14 శాతం క్షీణించి రూ. 2,009 కోట్లకు పరిమితమైంది. రిటైల్ విభాగం ఇటీవలి కాలంలో సుమారు రూ. 37,710 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. సిల్వర్ లేక్, కేకేఆర్, టీపీజీ, జనరల్ అట్లాంటిక్ వంటి దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. రిలయన్స్ షేరు 1% పైగా పెరిగి రూ. 2,054 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. జియో జూమ్.. రిలయన్స్ టెలికం విభాగం జియో లాభం దాదాపు మూడు రెట్లు పెరిగింది. రూ. 2,844 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 990 కోట్లు. ఇక ఆదాయం సుమారు 33 శాతం పెరిగి రూ. 13,130 కోట్ల నుంచి రూ. 17,481 కోట్లకు చేరింది. క్యూ2లో కొత్తగా 73 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ చేరగా, ప్రతి యూజర్‌పై ఆదాయం రూ. 145కి చేరింది. జియో సహా డిజిటల్ సేవల వ్యాపారం ఆదాయం రూ. 16,717 కోట్ల నుంచి ఏకంగా రూ. 22,679 కోట్లకు ఎగిసింది. -
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లాభం 359 కోట్లు
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్(ఎల్టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ, సంజయ్ జలోన పేర్కొన్నారు. నిలకడ కరెన్సీ రేట్ల మారకం ప్రాతిపదికన ఆదాయంలో 12 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. డిజిటల్ సర్వీస్‌ల విభాగం మంచి వృద్ధిని సాధించిందని, తమ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా ఆదాయం 12 శాతం వృద్ధితో 36 కోట్ల డాలర్లకు చేరిందని వివరంచారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,347కు పెరిగిందని, ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 18.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,578 వద్ద ముగిసింది. -
20న రైతులతో మాట్లాడతా..
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలోని సమస్యలపై చర్చించేందుకు ఈనెల 20న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడనున్నారు. వివిధ సేవలను డిజిటల్ రూపంలో అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మూడు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాల (సీఎస్సీ) ద్వారా రైతులు మోదీతో మాట్లాడవచ్చు. గత కొద్దికాలంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తుండటం తెలిసిందే. శుక్రవారం డిజిటల్ ఇండియా పథకం లబ్ధిదారులతో మాట్లాడుతూ ‘20న ఉదయం 9.30 గంటలకు నేను రైతులతో ముచ్చటిస్తాను. నాతో మాట్లాడే అవకాశాన్ని రైతులకు మీరు (సీఎస్సీ ఏజెంట్లు) ఇవ్వాలి’ అని అన్నారు. రేపు నీతి ఆయోగ్ సమావేశం మోదీ అధ్యక్షతన ఆదివారం రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ పరిపాలక మండలి నాలుగో సమావేశం జరగనుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, ఆయుష్మాన్ భారత్, మిషన్ ఇంద్రధనుష్, జాతీయ పోషకాహార పథకం తదితర ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు హాజరవుతారు. ‘న్యూ ఇండియా 2022’ కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన పనులపై కూడా మండలి సమావేశంలో చర్చిస్తారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకు మోదీ విందు.. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లోని కీలక నేతలకు మోదీ శుక్రవారం రాత్రి తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా అనేక మంది ఈ విందుకు హాజరయ్యారు. కాగా దేశంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు వ్యూహాలు, ఇతర కాషాయ సంస్థలతో ఆరెస్సెస్, బీజేపీల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం తదితరాలపై చర్చించేందుకు సూరజ్‌కుండ్‌లో మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో బీజేపీ, ఆరెస్సెస్‌లకు చెందిన 60 మంది ఉన్నతస్థాయి నేతలు పాల్గొన్నారు. గురువారం ఇవి ప్రారంభం కాగా, అమిత్ షా శనివారం ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కశ్మీర్‌పై మోదీ ఉన్నతస్థాయి భేటీ జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితిపై మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో మిలిటరీ ఆపరేషన్లను ఆపివేయగా, శుక్రవారంతో ఆ గడువు పూర్తయింది. దీంతో ఆపరేషన్ల నిలిపివేత ఆదేశాలు పొడిగింపుపై సమావేశంలో చర్చించారు. -
గంటల తరబడి వాటి ముందే గడపటంతో...
ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది... మీతో మాకేం పని అంటూ.. పక్కన వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలోనే మునిగి తేలుతున్నారు చాలామంది. కాలు కదపకుండా.. కూర్చున్న దగ్గర్నుంచే అన్ని పనులు చకాచకా చేసేసుకుంటున్నారు. ప్రజంటేషన్ దగ్గర్నుంచి బిల్లు చెల్లింపుల వరకు అన్నింటిన్నీ ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి చేసుకుంటున్నారు. బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు సైతం స్మార్ట్ఫోన్లను వదలడం లేదు. స్మార్ట్ఫోన్లతో ఆడటం, గంటల తరబడి వీడియోలను, కార్టూన్లను చూడటం చేస్తున్నారు. ఇలా చేయడంతో పిల్లలు తాత్కాలిక ఉత్సాహాన్ని పొందుతున్నారేమో కానీ.. ఆరోగ్యానికి, ఇది ఏ మాత్రం మంచి కాదని అంటున్నారు నిపుణులు. ఒక్క పిల్లలకే కాకుండా.. మీపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. స్క్రీన్ ముందే గంటల తరబడి గడపటం వల్ల మీరు మీ కుటుంబంతో గడిపే అమూల్యమైన క్షణాలను కోల్పోతారట. డిజిటల్ స్క్రీన్ ముందే గంటల తరబడి గడపటం వల్ల వచ్చే అనర్థాలు.... డిజిటల్ స్క్రీన్ ముందు కూర్చుని గంటల కొద్దీ పనిచేయడంతో కేవలం కళ్లు మాత్రమే కాక... మొత్తంగా ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం పడనుందట. అవేమిటో ఓ సారి చూద్దాం.. రేడియేషన్ పెరగడం : ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడటంతో, వాటి నుంచి వచ్చే రేడియేషన్... క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలను పెంచుతాయట. ఈ ప్రమాద బారిన పడకుండా ఉండేందుకు రోజుల్లో ఒక్క గంట లేదా రెండు గంటలు మాత్రమే డిజిటల్ స్క్రీన్కు పరిమితమవుతూ.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. అలసట : సోషల్ మీడియాలో అప్డేట్లను చెక్ చేసుకుంటూ.. ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడం వల్ల కాస్త విశ్రాంతిని పొందవచ్చని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ పలు పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. ఇంటర్నెట్(ముఖ్యంగా సోషల్ మీడియా), ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడకం మిమ్మల్ని తీవ్ర అలసటకు గురిచేస్తుందని తెలిసింది. అంతేకాక డిప్రెషన్లోకి వెళ్లేలా చేస్తుందట. చిన్నారులపై కూడా గాడ్జెట్ల వాడకం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, వారి నిద్రకు భంగం కలిగించి, వారి ప్రవర్తనలో సమస్యలను తెచ్చి పెడుతుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నిద్ర రుగ్మతలు : మనం ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే, ఆరోగ్యకరమైన నిద్రను అలవాటు చేసుకోవాలి. పెద్దలకు రోజూ తప్పనిసరిగా రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లపై ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం వల్ల, చాలామంది(ముఖ్యంగా టీనేజర్లు, యువత) మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోవడానికే చాలా కష్టపడుతున్నారు. దీంతో నిరంతరం నిద్ర లేమి ఏర్పడి, ఊబకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. సంబంధాలు సన్నగిల్లడం : గత దశాబ్ధం లేదా రెండు దశాబ్దాల నుంచి అనూహ్యంగా బ్రేకప్‌లు, పెళ్లిళ్లు విఫలమవడం, విడాకుల సంఖ్య పెరగడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కపుల్స్ ఒకరినొకరు అర్థం చేసుకోలేక చాలా సతమతమవుతున్నారు. ఈ సమస్యలకు ప్రధాన పరిష్కారం ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడమే. కానీ ఇటీవల చాలా మంది తమ భాగస్వామికి కొంత సమయం కూడా కేటాయించకుండా.. గాడ్జెట్లలో మునిగి తేలుతున్నారు. దీంతో ముఖాముఖిగా సమస్యపై చర్చించుకోవడం, అర్థవంతమైన సంభాషణను కొనసాగించడం వంటి వాటిల్లో విఫలమవుతూ వస్తున్నారు. ఈ ప్రభావంతో సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లుతున్నాయని తెలిసింది. దీనికి పరిష్కారంగా డిజిటల్ స్క్రీన్‌పై వెచ్చించే సమయాన్ని తగ్గించి, కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచిస్తున్నారు నిపుణులు. దీంతో మీ భాగస్వామితో మీ బంధాన్ని కూడా మరింత బలోపేతం చేసుకోవచ్చట. మీ భంగిమల్లో తీవ్ర మార్పులు : రోజంతా స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో గడపటం తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాక శారీరక పనులు కూడా తగ్గిపోతాయట. దీంతో మెడ నొప్పి, భుజాలు లాగడం, వెన్నుపోటు వంటి సమస్యలు పెరిగి, సరిగ్గా నిల్చులేక, కూర్చోలేక సతమతమవుతారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో మీ అవసరాలు పెరిగినప్పటికీ.. వాటితో మీరు పని చేయనప్పుడైనా స్క్రీన్లను ఆపివేసి కాస్త పక్కన పెట్టేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఆ సమయంలో మీ చిన్నారులతో మాట్లాడుతూ వారితో సరదాగా గడిపితే, మానసిక, శారీరక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చట. -
‘మహానటి’ శాటిలైట్ హక్కులపై రూమర్స్
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ప్రధానంగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు ఫలానా సినిమాలు ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్లో ఆడాయి... అని లెక్కేసుకునేవారు. ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్, వంద, రెండు వందల కోట్ల క్లబ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. దీనిలో భాగంగానే సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఎంత పలుకుతున్నాయో కూడా ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యాయి. ఫలానా సినిమా శాటిలైట్ రైట్స్‌ను ఎంతకు అమ్మారు... ఏ ఛానల్‌కు అమ్మారు లాంటి విషయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రస్తుతం మహానటికి సంబంధించిన ఈ విషయాలే హల్చల్ చేస్తున్నాయి. మహానటి విడుదలైనప్పటి నుంచి విజయవంతంగా దూసుకెళ్తోంది. కలెక్షన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఓవర్సిస్లో కూడా ఈ సినిమా బాగానే రన్ అవుతోంది. అయితే మహానటి శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 18కోట్లకు అమ్మాలని నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. అయితే సినిమాకు పెరుగుతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ఛానెళ్లు ఈ రైట్స్‌కు పోటీపడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే టాప్ రేటింగ్ రావడం ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
డిజిటల్ రంగంలో 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశ పెట్టిన కొత్త టెలికాం పాలసీ ‘నేషనల్ డిజిటర్ కమ్యునికేషన్ పాలసీ 2018’ డ్రాఫ్ట్ ద్వారా 2022 కల్లా డిజిటల్ కమ్యునికేషన్ రంగంలో దాదాపు 40 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పాడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ ద్వారా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వినియోగాదారుడికి దాదాపు 50 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో డిజిటల్ కమ్యునికేషన్ వాటా 6 శాతంగా ఉంది. ఈ పాలసీ ద్వారా అది 8 శాతానికి పెరగనుంది. -
అరచేతిలోనే అన్ని సేవలు
సత్తెనపల్లి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీని) లాభాల బాట పట్టించేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతోంది. బస్సు ఎక్కడుందో ప్రత్యేక ట్రాకింగ్ ద్వారా తెలుసుకునేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బస్సులు మరమ్మతులు చేసే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు ఇ–వాలెట్ (ఎలక్ట్రానిక్ పర్స్)ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కంప్యూటర్ ద్వారా సెల్ఫోన్లోనూ సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా త్వరితగతిన టికెట్ బుకింగ్, ప్రచార రాయితీలు, ఒక ఇ–వాలెట్ నుంచి వేరొక ఈ – వాలెట్‌కు అదనపు ఖర్చు లేకుండా వేగంగా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇ–వాలెట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అడ్వాన్సుడు రిజర్వేషన్, టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయడం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ– వ్యాలెట్ ఇలా.. గూగుల్‌ప్లే స్టోర్ నుంచి వ్యాలెట్ యాప్నును డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అయి మీ ఖాతాను ప్రారంభించాలి. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఈ–వ్యాలెట్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఖాతా కలిగి టికెట్ కొనుగోలు చేస్తే టికెట్ ధరపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ప్రయాణికులు ఆర్టీసీకి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలనుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్ పేజీల ద్వారా నేరుగా తెలియజేయవచ్చు. మొబైల్ యాప్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఎంతో ముఖ్యమైంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్టీసీ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్, రద్దు, ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. లైవ్ ట్రాక్ ఆప్షన్లో ఎక్కాల్సిన బస్ సర్వీస్ నెంబర్ ప్రెస్ చేయడం ద్వారా ఆ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. ఏపీఎస్ ఆర్టీసీ మొబైల్ యాప్ ఇలా.. n గూగుల్ ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. n ఈ యాప్ ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు. n బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ లైవ్ ట్రాక్ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. n అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. -
రంగస్థలం.. ఆ లొల్లి లేనట్లే!
రంగస్థలం బ్లాక్‌బస్టర్ టాక్‌తో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన తొలి చిత్రం కావటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఓ అంశం వారిని కలవరపెడుతోంది కూడా. అదే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ వ్యవహారం. ఈ మధ్య సినిమాల డిజిటల్ హక్కులను దక్కించుకుంటున్న అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు.. నెల రోజులు తిరగకుండానే సినిమాలను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేస్తున్నాయి. రంగస్థలం చిత్రం కోసం కూడా భారీగా వెచ్చించి (సుమారు రూ.18 కోట్లు అని చెబుతున్నారు) అమెజాన్ ప్రైమ్ హక్కులను దక్కించుకుంది. దీంతో చిత్రం హిట్ టాక్ వచ్చినప్పటికీ.. 50 రోజులు తిరగకుండానే డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తుందేమోనని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతల క్లారిటీ... అయితే ఈ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని రంగస్థల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇస్తోంది. అమెజాన్ ప్రైమ్‌తో ‘50 రోజుల పూర్తయ్యాకే చిత్రం వినియోగదారులకు అందుబాటులోకి తేవాలి’ అన్న షరతు మేరకే ఒప్పందం చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నినేని స్పష్టం చేశారు. -
ఇక నిరవధిక సమ్మె : హీరో విశాల్
సాక్షి, చెన్నై: క్యూబ్, వీపీఎఫ్ చార్జీలు చెల్లింపు విషయంలో సమ్మె చేపట్టిన తమిళ చలన చిత్ర నిర్మాత మండలి.. శుక్రవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమ్మెను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు హీరో-నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ వెల్లడించారు. ‘ఇది డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల డిమాండ్లకు సంబంధించిన అంశం కాదు. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకులపై అదనపు భారం పడకూడదనే మా ప్రయత్నం. టికెట్ ఛార్జీల మొదలు ఆన్లైన్ బుకింగ్, పార్కింగ్ ఛార్జీలు ఇలా ఏది కూడా ప్రేక్షకుడిపై మోపకుండా ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలున్నాయి. నిర్మాతల మండలి డిమాండ్లకు ప్రొవైడర్లు తలొగ్గేదాకా ఈ సమ్మె కొనసాగుతుంది. అందుకోసం ఎన్నాళ్లైనా మా పోరాటం ఆగదు’ అని విశాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత మండలి తరపున విశాల్, నడిగర్ సంఘం తరపున హీరో కార్తీ, డైరెక్టర్ యూనియన్స్ తరపున విక్రమన్, సినిమాటోగ్రఫర్ అసోషియేషన్ తరపున పీసీ శ్రీరాం, ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పాల్గొన్నారు. కాగా, ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి పళని స్వామి, మంత్రి కాదంబూర్ రాజుతో కోలీవుడ్ ప్రతినిధులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పెద్ద చిన్నా అన్న తేడా లేకుండా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. -
టీ20 ట్రై సిరీస్ డిజిటల్ హక్కులు జియోకే!
ముంబై : శ్రీలంక వేదికగా నేటి( మంగళవారం) నుంచి ప్రారంభమయ్యే భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక ట్రై నేషన్ నిధాస్ ట్రోఫీ డిజిటల్ ప్రసార హక్కులను జియో టీవీ యాప్ సొంతం చేసుకుంది. ఇప్పటికే వింటర్ ఒలింపిక్స్, ఈఎఫ్ఎల్ కప్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ప్రసార హక్కులను సొంత చేసుకున్న జియో తాజాగా ట్రై సిరీస్ హక్కులను పొందింది. మార్చి 6 నుంచి 18 వరకు మ్యాచ్‌ల ప్రత్యక్షప్రసారంతో పాటు రిపీట్, హైలెట్ ప్యాకేజిలు అందజేయునున్నట్లు కంపెనీ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. -
వినోదానికి తెర
పాత గుంటూరు: సామాన్యుడికి వినోదం పంచే సినిమాకు తెర పడింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు, నిర్మాతలు ఉద్యమబాట పట్టి బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా హాళ్లు మూతబడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాదిమంది ఉపాధి దెబ్బతింది. డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు వసూలు చేసే ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు థియేటర్ యాజమాన్యాలు బంద్‌ను పాటిస్తున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి జిల్లాలోని 200 థియేటర్లు మూతబడ్డాయి. ఈనెల 9 వరకు బంద్ కొనసాగనుందని తెలిసింది. బంద్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గతంలో సినిమాలను మనందరికీ తెలిసిన రీల్ ఫార్మెట్లో ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించేవారు. 12 ఏళ్ల కిందట డిజిటల్ సినిమా రంగప్రవేశం చేసింది. ల్యాబ్ నుంచి ప్రింట్ తెచ్చుకునే అవసరం లేకుండా హార్డ్ డిస్క్‌ను తెచ్చుకుని డిజిటల్ ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమా వేసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వారిని డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు(డీఎస్పీ)లుగా వ్యవహరిస్తున్నారు. వీరు దేశమంతటా తమ టెక్నాలజీని దశల వారీగా అమర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా రీల్ ఫార్మెట్ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిందని థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను తీసి పక్కన పడేశారు. ఇదే డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లకు వరంగా మారింది. ఏకస్వామ్య విధానం అమలుచేయడానికి అవకాశం లభించింది. థియేటర్లలో అమర్చిన డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దెను క్రమంగా కంపెనీలు పెంచుకుంటూ వెళ్లిపోయాయి. ఈ ఫీజు థియేటర్ యాజమాన్యాలకు భారంగా మారింది. దేశంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు అయిన యూఎఫ్ఓ, క్యూబ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. అంతా వారి చేతుల్లోనే ఉండటంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా మౌనంగా ఉండిపోయారు. డీఎస్పీలు అద్దెలు, చార్జీలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఒక్కో చోట ఒకలా వున్నాయి. ఇంగ్లిష్ సినిమాలకు ఎక్కడా వర్చువల్ ప్రింటింగ్ ఫీజు లేదు.. మనకు కూడా లేదు. ఉత్తరాదిలో హిందీ సినిమాలపై మన దగ్గర వసూలు చేస్తున్న ఫీజులో 50 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అదే సినిమా మన వద్ద వేస్తే వంద శాతం వీపీఎఫ్ చెల్లించాలి. ఉత్తరాదిలో అన్నీ హిందీ సినిమాలే కాబట్టి ఫీజు తక్కువగా వుంది. మన తెలుగు చిత్రాలకు పూర్తి ఫీజు చెల్లించాలి. ఈ ద్వంద్వ వైఖరిని దక్షిణాది నిర్మాతలు, పంపిణీదారులు వ్యతిరేకించారు. జేఎసీగా ఏర్పడి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె, వీపీఎఫ్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకటనల ఆదాయంపై బాదుడే ఈ డీఎస్పీలు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వసూలు చేసే వీపీఎఫ్ కాకుండా థియేటర్ యజమానుల నుంచి రెండురకాలుగా లబ్ధి పొందుతున్నాయి. అందులో ఒకటి డిజిటల్ ప్రొజెక్టర్ అద్దె కాగా, మరొకటి ప్రకటనల ఆదాయం. సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు, ఇంటర్వెల్ తర్వాత వేసే ప్రకటనల ఆదాయం మొత్తం డీఎస్పీలే తీసుకుంటున్నాయి.అందులో నామమాత్రంగా 10 నుంచి 15 శాతం మాత్రమే యాజమాన్యాలకు ఇస్తున్నారు. ప్రకటన సైజు తెలుపకుండానే నచ్చినంత సేపు వేసుకుంటూ యాజమాన్యాలకు నష్టాలు కలిగించడంతో పాటు ప్రేక్షకులను ఇబ్బందిపెడుతున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ల అద్దె ఇలా... నగరంలోని 4కె థియేటర్లు డిజిటల్ ప్రొజెక్టర్లకు వారానికి రూ.13,600 చెల్లిస్తున్నాయి. సాధారణ థియేటర్లు వారానికి రూ.10,300 చెల్లిస్తున్నాయి.వీటితో పాటు వీపీఎఫ్ నెలకు రూ.15 నుంచి రూ. 20 వేలకు వరకు చెల్లిస్తున్నాయి. -
‘సై రా’ సంచలనం
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ సినిమా బిజినెస్‌కు సంబంధించిన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. మెగా తనయుడు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పూర్తి స్థాయిలో షూటింగ్ మొదలవ్వకుండానే బిజినెస్ ప్రారంభమైందట. సైరా సినిమా డిజిటల్ రైట్స్‌ను అమేజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 30 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియోస్ ఇలా అన్నీ ఆ సంస్థకే ఇచ్చేట్టుగా ఒప్పందం చేసుకున్నారు. చిరు చారిత్రక వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌తో పాటు జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
థియేటర్ల బంద్‌తో తీవ్రంగా నష్టపోతున్నాం
-
డిజిటల్ నానో కోప్ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేబుల్ ఆపరేటర్లను ఆర్థిక స్వతంత్రులను చేయడంతోపాటు స్వయం ఉపాధి కల్పించుకునేందుకు తోడ్పాటు అందించే లక్ష్యంతో హిందూజా మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ఎన్ఎక్స్టీ డిజిటల్ నానో కోప్ను ఖమ్మంలో ప్రారంభించింది. కేబుల్ ఆపరేటర్లను స్వతంత్ర వ్యాపారిగా తీర్చిదిద్ది.. ఎవరిపై ఆధారపడకుండా ఉండాలనే లక్ష్యంతోపాటు ఈ డిజిటల్ ద్వారా నాణ్యమైన ప్రసారాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అందించాలనేదే తమ ప్రధాన ధ్యేయమని హిందూజా మీడియా గ్రూపు ఎండీ, సీఈవో అశోక్ మన్సుఖానీ చెప్పారు. తెలంగాణ రీజినల్ హెడ్ శ్రీకుమార్‌తో కలసి ఆయన మంగళవారం ఖమ్మంలోని ఓ హోటల్లో నానోకోప్‌ను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. దేశంలో అతిపెద్ద డిజిటల్ టీవీ కం పెనీ వేదికగా ఉన్న ఎన్ఎక్స్టీ డిజిటల్ రంగంలో ఆపరేటర్లకు మరింత చేరువ కావడం ద్వారా నాణ్యమైన ప్రసారాలను అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రతి ఆపరేటర్ రూ.15 లక్షల ఖర్చు తో 500కు పైగా చానల్స్ వచ్చే లా ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆపరేటర్లు రూ. 4.40 లక్షలతో దాదాపు 250 చానల్స్‌ను వీక్షకులకు అందించవచ్చని, నగర ప్రాంత ఆపరేటర్లు హెచ్డీ నాణ్యతగల చానల్స్‌ను అందించగలుగుతారన్నారు. కేబుల్ రంగంలో హిందూజా గ్రూపుకు ఉన్న అనుభవంతో కేబుల్ ఆ పరేటర్లను అనుసంధానం చేసి.. వారి కి వ్యాపార ప్రయోజనాలను కల్పిస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లు తమతో అనుసంధానమైతే ఎక్కడి నుంచైనా ప్రసారాలను ఆపరేట్ చేసుకోవచ్చని శ్రీకుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలకు తగినట్టు ప్యాకేజీల రూపకల్పన జరుగుతుందని, ‘మీ నె ట్‌వర్క్.. మీ వ్యాపారం.. మీ లాభాలు’నినాదంతో తమ వ్యాపార ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. -
డిజిటల్ తెరలకు అతుక్కుంటే... లావెక్కుతారు!
పిల్లలు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లతో ఆడుకోవడం ఎక్కువైంది ఈ మధ్య. అయితే నిద్ర సమయానికి ముందు ఇలా డిజిటల్ స్క్రీన్స్‌కు అతుక్కుపోవడం ఏమంత మంచిది కాదంటున్నారు పెన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దీనివల్ల నిద్ర పాడవడమే కాకుండా పొద్దున్న లేవగానే ఉత్సాహంగా ఉండాల్సింది పోయి నీరసించినట్టు కనిపిస్తారని వీరు జరిపిన సర్వే స్పష్టం చేసింది. అంతేకాకుండా రాత్రుళ్లు నిద్ర సమయానికి ముందు టీవీ ఎక్కువగా చూసే పిల్లల్లో బీఎంఐ కూడా ఎక్కువ అవుతుందని తాము తెలుసుకున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న శాస్త్రవేత్త కేటలీన ఫుల్లర్ అంటున్నారు. గతంలో జరిగిన ఒక సర్వే యుక్తవయస్కుల్లో ఇలాంటి ప్రభావాలుంటాయని చెప్పింది కానీ.. పిల్లల విషయంలో తాము తొలిసారి ఈ విషయాలను గమనించామని తెలిపారు. నిద్రకు ముందు టీవీ చూసేవారిలో... లేదంటే వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో నిద్ర సగటున 30 నిమిషాలు తక్కువగా ఉంటోందని, ఫోన్, కంప్యూటర్లు వాడేవారిలో ఇది గంట వరకూ ఉందని ఫుల్లర్ సర్వేలో తేలింది. ఒకవైపు టీవీ చూస్తూ.. ఇంకోవైపు స్మార్ట్‌ఫోన్ వాడటం మరీ ప్రమాదకరమైన విషయమని అంటున్నారు. రాత్రిపూట పిల్లలకు ఈ డిజిటల్ టెక్నాలజీలను వీలైనంత దూరంగా పెట్టడం మంచిదని, లేనిపక్షంలో కనీసం ఏదో ఒకదానికి మాత్రమే పరిమితమయ్యేలా చూడటం ద్వారా సమస్య తీవ్రతను కొంత తగ్గించవచ్చునని వివరించారు. -
2022కి లక్ష కోట్ల డాలర్లకు డిజిటల్ సేవలు
ముంబై: 2022 నాటికి లక్ష కోట్ల డాలర్ల విలువైన డిజిటల్ సేవల లక్ష్యాన్ని తగిన విధాన చర్యలతో భారత్ చేరుకోగలదని ఓ నివేదిక తెలియజేసింది. ‘‘ఇంటర్నెట్ అన్నది విజ్ఞాన గని. దీనికి ఎటువంటి భౌగోళిక సరిహద్దులు ఉండవు. దేశాల సరిహద్దుల ఆవల కూడా సేవలను ఆఫర్ చేయగలదు. కనుక చట్టపరంగా, నియంత్రణ పరమైన నిబంధనల పరంగా ఈ విభాగాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం’’అని డిజిటల్ ఆర్థిక రంగానికి సంబంధించిన పన్నులపై ఐఏఎంఏఐ, నిషిత్ దేశాయ్ అసోసియేట్స్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. భారత్ అంతర్జాతీయంగా సులభతర దేశాల సూచీలో మెరుగైన స్థానాన్ని సంపాదించడం వంటి పలు చెప్పుకోతగ్గ విజయాలను సాధించిందని పేర్కొంది. దేశీ డీజిటల్ సెక్టార్ తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ఈ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించాల్సి ఉందని సూచించింది. స్థిరమైన, ఊహాజనిత పన్ను విధానాలు డిజిటల్ ఆర్థిక రంగ వృద్ధికి ప్రోత్సాహాన్నిస్తాయని పేర్కొంది. డిజిటల్ రంగం ప్రధానంగా విదేశీ నిధులపై(ఎఫ్ఐఐ/ఎఫ్‌డీఐ), టెక్నాలజీ బదిలీలపై ఆధారపడి ఉందని తెలిపింది. ఈ రెండు అంశాలు కూడా పన్నుల విధానాల పరంగా చాలా సున్నితమైనవిగా పేర్కొంది. ఆన్లైన్ ప్రకటనలు, కొనుగోళ్లు, సాఫ్ట్వేర్ లైసెన్స్‌ల అద్దెలు, ఐపీ, క్లౌడ్, సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తదితరమైనవి చాలా స్టార్టప్‌లకు నిర్వహణ పరంగా సమస్యల్లాంటివని తెలియజేసింది. విదేశీ నిధులు, టెక్నాలజీపై ఆధారపడి ఉండటంతో విదేశీ కంపెనీలు ఆర్జించిన ఆదాయంపై పన్ను అనేది స్థిరంగా ఉండాలని నివేదిక స్పష్టం చేసింది. -
పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌గా డిజిటల్ బంగారం ఆఫర్
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే యూజర్లు ప్రస్తుతం తమ వాలెట్లలో ఉన్న క్యాష్‌బ్యాక్‌ను సైతం పేటీఎం గోల్డ్ కింద మార్చుకునేందుకు ప్రత్యేక ప్రమోషనల్ కోడ్‌ను కూడా ఇవ్వనున్నట్లు వివరించింది. ఈ విధంగా జమయిన డిజిటల్ బంగారాన్ని డెలివరీ తీసుకోవచ్చని, లేదా పసిడి రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీకైనా విక్రయించుకోవచ్చని పేటీఎం తెలిపింది. అత్యంత తక్కువగా రూ.1కే డిజిటల్ బంగారాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలు కల్పించేందుకు ఎంఎంటీసీ–పీఏఎంపీతో పేటీఎం జట్టు కట్టిన సంగతి తెలిసిందే. -
సాగుకు స్కానింగ్!
⇔ భారీ డిజిటల్ పరిశోధనా ప్రాజెక్టుకు ఇక్రిశాట్ రూపకల్పన ⇔ వ్యవసాయశాఖకు ప్రతిపాదన... రిమోట్ సెన్సింగ్‌తో డేటా సేకరణ ⇔ ప్రతిపాదన ఆమోదం పొందితే వచ్చే నెల నుంచి ప్రాజెక్టు ప్రారంభం ⇔ తెలంగాణలో పంటల వర్గీకరణ, కనీసం మీటరు పరిధి నేలపైనా విశ్లేషణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయరంగ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ భూమి, పంటలు, నేలలు తదితర అంశాలపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ రంగం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సాగు విస్తీర్ణం, ఏ నేలల్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారనే అంశాలపై ఎప్పుడో నిర్ధారించిన సమాచారం అరకొరగా ఉంది. దీనివల్ల వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు లోపాలతో కూడుకొని ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవసాయరంగాన్ని పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై డాక్యుమెంటు తయారు చేసి ఇస్తామని ఇక్రిశాట్ ముందుకు వచ్చింది. డిజిటల్ వ్యవసాయ పరిశోధన ప్రాజెక్టు రూపకల్పనకు రూ.169.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు ప్రాజెక్టు ప్రతిపాదన నివేదికను బుధవారం అందజేసింది. ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపితే వచ్చే నెల నుంచే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఇక్రిశాట్ తెలిపిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డిజిటల్ ప్రాజెక్టుతో ప్రయోజనాలివి ఈ ప్రాజెక్టు పూర్తి చేశాక కచ్చితమైన మ్యాపింగ్ చేసి అందజేస్తారు. గతంలో ఆస్ట్రేలియాలో ఇలాగే ప్రాజెక్టు నిర్వహించి ఒక మీటరు, 4 మీటర్లు, 24 మీటర్లు ఇలా భూమి పరిధిని పరిగణనలోకి తీసుకొని సూక్ష్మ విశ్లేషణ చేశారు. దీనివల్ల శాస్త్రీయ డేటా సేకరిస్తారు. అంటే ఒక మీటరు వ్యవసాయ విస్తీర్ణాన్ని కూడా విశ్లేషిస్తారన్నమాట దీనివల్ల పంట దిగుబడి, ఉత్పాదకతను అంచనా వేయవచ్చు కరువు, తుఫాన్లు, చీడపీడల వల్ల పంట నష్టం వాటిల్లితే సరైన అంచనా వేయవచ్చు పంట పండించాక జరిగే నష్టాన్ని రైతువారీగా వ్యక్తిగతంగా అంచనా వేయవచ్చు ∙భూముల వర్గీకరణ శాస్త్రీయంగా అంచనా వేయడానికి వీలు కలుగుతుంది ∙పంటల సాగు కాలాన్ని, పంట పండే కాలాన్ని శాస్త్రీయంగా అంచనా వేయవచ్చు భూగర్భ, ఉపరితల జలవనరులను అంచనా వేయవచ్చు. దానివల్ల వ్యవసాయానికి అవసరమైన ప్రణాళిక రచించవచ్చు ‘స్మార్ట్ ఫామింగ్’కు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దానివల్ల ఇన్‌ఫుట్స్, సబ్సిడీలు, కూలీలు, వ్యవసాయానికి అందజేయాల్సిన ఆర్థిక సాయాన్ని సక్రమంగా అంచనా వేయడానికి వీలుకలుగుతుంది మూడేళ్లపాటు నిర్వహణ అగ్రి మానిటర్డ్ రీ ఇంజనీరింగ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్(అమార్ట్) పేరుతో చేపట్టే ఈ ప్రాజెక్టును 2020 జూలై నాటికి పూర్తి చేయాలని ఇక్రిశాట్ సంకల్పించింది. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయశాఖ సహా పలు రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకోనుంది. రాష్ట్రంలో 85 శాతం మంది సన్న,చిన్న రైతులే ఉండటంతో వారికి తగినట్లుగా పంటల విధానం ఉండలన్నది ఇక్రిశాట్ ఆలోచన. అందుకోసం రిమోట్ సెన్సింగ్ డేటాను సేకరించడం అత్యంత కీలకమైన అంశమని ఇక్రిశాట్ స్పష్టం చేసింది. మల్టీస్పెక్ట్రల్ డేటా సేకరిస్తామని వెల్లడించింది. -
స్కాలర్షిప్ అక్రమాలకు చెక్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : స్కాలర్షిప్ అక్రమాలకు ఇక తావుండదు. కళాశాలల యాజమాన్యాలు తప్పుడు లెక్కలు చూపి స్కాలర్షిప్ నిధులను పక్కదారి పట్టించే అవకాశమూ ఉండదు. స్కాలర్‌షిప్‌ల కోసమే కొందరు విద్యార్థులు కళాశాలల్లో చేరుతున్నారని, తరగతులకు హాజరుకావడం లేదనే అపవాదుకు ఆస్కారం ఉండదు. స్కాలర్షిప్ అక్రమాలకు చెక్ పెట్టేలా, పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వం జన్మభూమి వెబ్‌పోర్టల్‌ను రూపొందించింది. దీని ద్వారా స్కాలర్షిప్లు సులభతరం కావడంతో పాటు ఎటువంటి అవకతవకలకు ఆస్కారముండదని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ఈ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనీ ఉండదంటున్నారు. కళాశాలల్లోనే దరఖాస్తు గతంలో స్కాలర్షిప్ కావాలంటే విద్యార్థులు ఈ సేవ కేంద్రం, నెట్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేంది. ఒక్కోసారి సర్వర్ సక్రమంగా పనిచేయకపోతే రోజుల తరబడి కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ఇకపై అటువంటి కష్టాలు పడనక్కరలేదు. తాము చేరిన కళాశాలలోనే ఆన్లైన్లో జ్ఞానభూమి పోర్టల్ ద్వారా స్కాలర్‌షిప్‌లకు సంబంధిత కళాశాల యాజమాన్యమే దరఖాస్తు చేస్తుంది. దరఖాస్తులోని వివరాలను విద్యార్థి నింపితే మిగిలిన పని కళాశాల యాజమాన్యమే పూర్తిచేస్తుంది. సదరు విద్యార్థి కళాశాల యాజమాన్యానికి తెల్లరేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువపత్రం, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్సుతో పాటు శాశ్వత మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది. 201718 విద్యా సంవత్సరంలో కళాశాలల్లో చేరిన విద్యార్థులంతా (ఉపకారవేతనం కోసం దరఖాస్తు చేసిన, చేయని) ప్రెష్ /రెన్యువల్ విద్యార్థులందరి వివరాలను సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ జ్ఞానభూమి వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన ప్రభుత్వం విధించింది. దీంతో స్కాలర్‌షిప్‌లకు అర్హులెవరనే విషయం ఉన్నతాధికారులకు సులభంగా తెలుస్తుంది. 75 శాతం హాజరు ఉంటేనే.. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా నమోదై స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు 75 శాతం తప్పనిసరిగా హాజరు ఉండాలి. అనారోగ్య కారణాల వల్ల లేదా మరే ఇతర కారాణాల వల్ల ఒక నెలలో హాజరు శాతం తగ్గితే ఆపై నెలలో పూర్తిగా హాజరై రెండు నెలలకూ కలిపి 75 శాతం సగటు హాజరు చూపాల్సి ఉంటుంది. అప్పుడే రెండు నెలలకు కలిపి మెస్ చార్జీలు విడుదల చేస్తారు. విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో నమోదు చేస్తున్నందున స్కాలర్షిప్ కావాల్సిన విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రతి నెలా మెస్ చార్జీలు విడుదల చేసినా స్కాలర్షిప్ మొత్తాన్ని మాత్రం మూడు నెలలకోసారి విడుదల చేస్తారు. తొలి మూడు క్వార్టర్లకు హాజరు శాతాన్ని బట్టి స్కాలర్షిప్లు విడుదల చేసినా నాల్గో త్రైమాసికం సొమ్ము మాత్రం విద్యార్థి రాసిన సెమిస్టర్ లేదా సంవత్సరాంతపు పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత విడుదల చేస్తారు. విద్యార్థుల ప్రదర్శన, ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే స్కాలర్షిప్ నిలిపివేసే ప్రమాదం ఉంది. 465 కళాశాలలు నమోదు స్కాలర్షిప్ కావాలంటే కచ్చితంగా జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ఉన్న 589 ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో 465 కళాశాలలు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నాయి. మిగిలిన 124 కళాశాలలకు సంబంధించిన చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నమోదు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. వారంలోపు ఆ కళాశాలలు కూడా ఆన్లైన్లో నమోదయ్యే అవకాశం ఉంది. డిజిటల్ సిగ్నేచర్ కీలు పంపిణీ చేస్తున్నాం జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదైన కళాశాలలకు డిజిటల్ సిగ్నేచర్ కీలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సుమారు 100 కళాశాలలకు డిజిటల్ కీలు ఇచ్చాం. మిగిలిన కళాశాలలకు నాలుగైదు రోజుల్లో అందిస్తాం. నూతన విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక సామగ్రిని తగిన సమయంలో సమకూర్చుకోవాలని అన్ని కళాశాలలకు ఆదేశాలిచ్చాం. కలెక్టర్ చొరవతో డిజిటల్ సిగ్నేచర్ కీ పంపిణీ ప్రారంభించి, ముగించిన తొలి జిల్లాగా రాష్ట్రంలో పశ్చిమగోదావరి నిలుస్తుంది. -జేఆర్ లక్ష్మీదేవి, డిప్యూటీ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ -
ఫింగర్‌ప్రింట్స్‌తో నేరగాడి చరిత్ర
►అందుబాటులోకి అటోమేటిక్ ఫింగర్‌ప్రింట్స్ ఐడింటిఫికేషన్ సిస్టమ్ ►లైవ్ స్కానర్స్ ద్వారానే నేరగాళ్ల వేలిముద్రను సేకరించాలి ►సైబారాబాద్ సీపీ సందీప్ శాండిల్యా ఆదేశాలు సిటీబ్యూరో: నేరగాళ్ల వేలిముద్రలను డిజిటల్ ఫార్మాట్లో సేకరించడం ద్వారా వారికి సంబంధించిన నేరచరిత్ర సెకన్లలో కనిపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త సాఫ్ట్వేర్ అటోమేటిక్ ఫింగర్‌ప్రింట్స్ ఐడింటిఫికేషన్ సిస్టమ్ (పాపిలియన్–ఏఎఫ్ఐఎస్)ను సైబరాబాద్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పరికరాలను పేట్‌బషీరాబాద్, కూకట్పల్లి, ఆర్జీఐఏ, షాద్‌నగర్ ఠాణా సిబ్బందికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1999వ సంవత్సరంలో ఇన్స్టాల్ చేసిన ఫింగర్ ప్రింట్స్ అండ్ క్రిమినల్ ట్రేసింగ్ సిస్టమ్ స్థానంలో అటోమేటిక్ ఫింగర్‌ప్రింట్స్ ఐడింటిఫికేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. అరచేతి ముద్రణ లైవ్ స్కానర్లు, హెచ్డీ వెబ్ కెమెరాలు, మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌లను అన్ని పోలీసు స్టేషన్లకు అందిస్తున్నామన్నారు. ‘ఇంక్, స్లాబ్, రోలర్ ద్వారా వేలిముద్రలు సేకరించే స్థానంలో న్యూ లైవ్ స్కాన్ సిస్టమ్ పనిచేయనుంది. ఇక నుంచి లైవ్ స్కానర్స్ ద్వారానే నేరగాళ్ల వేలిముద్రను అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌వోలు సేకరించాలి. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే నిందితునికి సంబంధించిన చరిత్ర అంతా డిజిటల్ పార్మాట్లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది’ అన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్, ట్యాబ్లెట్‌కు మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ అనుసంధానించడం ద్వారా నేరగాడు ఫింగర్ ప్రింట్ టచ్కాగానే అతడికి సంబంధించిన డాటా కళ్ల ముందు ఫొటోలతో సహా ప్రత్యక్షమవుతుందని తెలిపారు. పోలీసు మొబైల్ వెహికల్స్, నైట్ పెట్రోలింగ్ వెహికల్స్, రక్షక్, నాకాబందీ సిబ్బందికి ఇది ఎంతో ఉపయుక్తకరమన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీమ్, క్రైమ్ డీసీపీ జానకి శర్మ, అదనపు డీసీపీ క్రైమ్స్ శ్రీనివాసరెడ్డి, సీఐడీ ఫింగర్ ప్రింట్స్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
జియో చీర్ కు అనూహ్య స్పందన
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద ఎల్టీఈ నెట్ వర్క్ అయిన రిలయన్స్ జియో... ఆదివారం జరుగబోయే భారత-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో మన క్రికెట్ జట్టులో ఉత్సాహం నింపేందుకు అభిమానులకు స్వాగతం పలుకుతోంది. 'బిగ్గరగా సందడి చేద్దాం.. గర్వంగా నిలుద్దాం' అనే జియో క్రికెట్ థీమ్ తో డిజిటల్ ఉద్యమం ప్రారంభించింది. www.jiocheer.com లైవ్ ప్రొగ్రామ్ ను మొదలుపెట్టింది. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే 'చీర్ ఫర్ ఇండియా, జియ్ ఫర్ ఇండియా' నినాదం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇప్పటికే ఇది దాదాపు 90 లక్షల మంది అభిమానులను చేరింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే భారత్-పాక్ మ్యాచ్ లో అభిమానులు ఆన్ లైన్ ద్వారా తమ బలమైన మద్దతును తెలిపేందుకు ఇది వేదికగా మారింది. జట్టుకు తమ మద్దతు తెలుపుతూ.. ఆటగాళ్లను ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని జియో ప్రారంభించింది. అంతేకాక, ఫేస్ బుక్ పేజీ, ట్విట్టర్, టంబ్లర్ వంటి వాటిల్లో షేర్ చేయడం ద్వారా మిత్రులకు, సహోద్యోగుల నుంచి మరింత మద్దతును భారత జట్టుకు అందించవచ్చు. ఉత్సాహభరితమైన ఈ డిజిటల్ ఉద్యమంలో కోట్లమంది క్రికెట్ అభిమానులంతా ఏకమై అద్భుతమైన అనుభూతిని పొందేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు భారత్ లో క్రికెట్ ను ప్రాణంగా ప్రేమించే అభిమానులను జియో చేరుకునేలా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. జియో వినియోగదారులు దూరదర్శన్ లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసాదం ద్వారా ఆస్వాదించవచ్చని, ప్రయాణంలో జియోటీవీ యాప్ ద్వారా కూడా మ్యాచ్ ను వీక్షించవచ్చని కంపెనీ పేర్కొంది. -
30 కేజీల డిజిటల్ పుత్తడి విక్రయించిన పేటీఎం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ, పేటీఎం 30 కేజీల ‘డిజిటల్’ పుత్తడిని విక్రయించింది. ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో ఆన్లైన్లో పుత్తడి కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహించే ఒక సర్వీస్‌ను ఇటీవలనే పేటీఎం సంస్థ, ఎంఎంటీసీ–పీఏఎంపీ భాగస్వామ్యంతో నెలకొల్పిన విషయం తెలిసిందే. ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వీలును ఈ సర్వీస్ కల్పించింది. పేటీఎం మొబైల్ వాలెట్ల ద్వారా వినియోగదారులు 24 క్యారట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారాన్ని ఎంఎంటీసీ–పీఏఎంపీ వాల్ట్స్‌లో ఎలాంటి చార్జీలు చెల్లించకుండా భద్రంగా దాచుకోవచ్చు. లేదా నాణేల రూపంలో ఇంటివ ద్దకే డెలివరీ తీసుకోవచ్చు. లేదా ఎంఎంటీసీ–పీఏఎంపీకే తిరిగి విక్రయించవచ్చు. ఆరు రోజుల్లో... ఈ డిజిటల్ గోల్డ్ సర్వీస్‌ను ప్రారంభించిన ఆరు రోజుల్లోనే 30 కేజీల డిజిటల్ పుత్తడిని విక్రయించామని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ హెగ్డే చెప్పారు. చిన్న నగరాల నుంచి అధికంగా కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. -
రూపాయికీ బంగారం..?
-
రూపాయికీ బంగారం..?
⇔ పసిడిలో పెట్టుబడులకు ‘పేటీఎం’ కొత్త ప్రచారం ⇔ ఎంఎంటీసీతో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్ ⇔ ఆన్లైన్లోనే క్రయ, విక్రయాలు ⇔ కావాలనుకుంటే 1 గ్రాము నుంచి నాణేల రూపంలో డెలివరీ న్యూఢిల్లీ: డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం... ఆన్లైన్ పసిడి క్రయ, విక్రయాల్లోకి కూడా ప్రవేశించింది. పసిడి రిఫైనరీ సంస్థ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)తో కలిసి ’డిజిటల్ గోల్డ్’ ప్లాన్‌ను ప్రారంభించింది. తమ పేటీఎం మొబైల్ వాలెట్ ద్వారా కస్టమర్లు అత్యంత తక్కువగా రూ.1 పెట్టుబడితో కూడా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలున్న బంగారాన్ని కొనుగోలు చేయొచ్చని పేటీఎం వ్యవస్థాపక సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 999.9 స్వచ్ఛత గల 24 క్యారట్ల బంగారాన్ని ఆన్లైన్లో కొన్నవారు... ఎంఎంటీసీ– పీఏఎంపీకి చెందిన సురక్షితమైన వాల్టులలో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చని ఆయన వివరించారు. నిజానికి ఎంఎంటీసీకి డిజిటల్ రూపంలో (సర్టిఫికెట్ల రూపంలో) బంగారాన్ని డెలివరీ చేసే సదుపాయం లేదు. అది భౌతిక బంగారాన్నే డెలివరీ చేస్తుంది. మరి రూపాయికెంత బంగారం వస్తుంది? దీనికి విజయ్ శేఖర్ శర్మ సమాధానమిస్తూ... పెట్టుబడి విలువ కనీసం 1 గ్రాము దాకా పోగుపడిన తర్వాత కావాలనుకుంటే డెలివరీ తీసుకోవచ్చని చెప్పారు. అంటే పెట్టుబడి కనీసం రూ.3వేల దాకా ఉంటేనే బంగారాన్ని డెలివరీ తీసుకోగలుగుతారు. కొనుగోలు చేసిన బంగారాన్ని 1, 2, 5, 10 ,20 గ్రాముల నాణేల రూపంలో ఇంటి వద్దకే డెలివరీ తీసుకోవచ్చని లేదా ఆన్లైన్లోనే ఎంఎంటీసీ–పీఏఎంపీకి విక్రయించవచ్చని శర్మ చెప్పారు. కస్టమర్లు విక్రయించదల్చుకున్న పక్షంలో ఎంఎంటీసీ–పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. డబ్బును యూజర్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ‘భారతీయులు పసిడిలో పెట్టుబడులకు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. వారు డిజిటల్ రూపంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసే ప్రక్రియను మేం సులభతరం చేస్తున్నాం‘ అని శర్మ చెప్పారు. ప్రస్తుతం పేటీఎం ద్వారా రూ.20,000 పైబడిన లావాదేవీలు జరిపే వారంతా కేవైసీ వివరాలు సమర్పించాల్సి ఉంటోంది. గోల్డ్ స్కీమ్‌కు కూడా ఇది వర్తిస్తుంది. పసిడి వినియోగదారులు బంగారం స్వచ్ఛత, సురక్షితంగా నిల్వ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంఎంటీసీ–పీఏఎంపీ చైర్మన్ మెహ్దీ బర్ఖుర్దార్ చెప్పారు. తాజా స్కీమ్‌తో ఉత్తమ నాణ్యత గల బంగారంలో అత్యంత తక్కువ స్థాయి నుంచి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభించగలదన్నారు. అత్యధిక వినియోగం భారత్‌లోనే... ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో పసిడి వినియోగం ఉంటోంది. దేశీయంగా ఇళ్లల్లో, బ్యాంకు లాకర్లలో సుమారు 900 బిలియన్ డాలర్ల విలువ చేసే 24,000 టన్నుల పైచిలుకు బంగారం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో కాయిన్లు, ఆభరణాలు ఇతరత్రా భౌతిక రూపంలో బంగారం కొనుగోలు కన్నా డిజిటల్ / పేపర్ రూపంలో పసిడి కొనుగోళ్లు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా సావరీన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కార్యకలాపాలపై రూ. 10,000 కోట్లు.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంపై వచ్చే మూడేళ్లలో రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లుగా రూ. 3,200 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. తమ పేమెంట్స్ బ్యాంక్‌కు త్వరలోనే తుది అనుమతులు రాగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు. గతేడాది దీపావళికే కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. అనుమతుల్లో జాప్యం కారణంగా వాయిదాపడింది. 150 కోట్ల స్థాయిలో ఉన్న పేటీఎం లావాదేవీల పరిమాణాన్ని ఈ ఏడాది 450 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు శర్మ చెప్పారు. విజయవాడ, వైజాగ్, జైపూర్, సోనేపట్ వంటి నగరాల్లో తమ కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
ఆధార్ సమర్పణకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఆధార్ సమర్పించాల్సిన తుది గడువును ఉద్యోగ భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) మరో నెల రోజులు పొడిగించింది. ఈనెల 30లోగా తమ ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అంతేకాకుండా పెన్షన్ ఖాతాలను ఆధార్‌కు అనుసంధానించేందుకు వీలుగా దాదాపు 50 లక్షల మంది పెన్షనర్లు తమ ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల’ను ఈనెల 30లోపు సమర్పించాలని గడువు విధించింది. ఈ సర్టిఫికెట్లను బ్యాంకుల ద్వారా భౌతికంగా స్వీకరించే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు పేర్కొంది. ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల’ను తమ మొబైల్ ఫోన్లు, కామన్ సర్వీస్ సెంటర్లు, లేదా ఈ సేవలను అందించే బ్యాంకు శాఖల ద్వారా సమర్పించాల్సి ఉంటుందంది. -
రిలయన్స్ క్యాపిటల్ నుంచి డిజిటల్ సేవలు
కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా భారీగా మూలధన లాభాలు పొందాలని యోచి స్తోంది. మరోవైపు డిజిటల్ సేవలందిండం ద్వారా కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. గురువారం జరిగిన కంపెనీ వ్యాపార ప్రణాళికలను విశ్లేషకులకు వివరించే సమావేశంలో కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కంపెనీ చైర్మన్, అన్మోల్ తండ్రి అనిల్ అంబానీ, గ్రూప్ కంపెనీల ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా హాజరయ్యారు. 24 సంవత్సరాల అన్మోల్ అంబానీ గత ఏడాది ఈడీగా రిలయన్స్ క్యాపిటల్‌లో చేరారు. మూడు నెలల్లో హోమ్ ఫైనాన్సింగ్ లిస్టింగ్ ప్రపంచంలో భారత్, చైనాలు పెద్ద డిజిటల్ మార్కెట్లని అన్మోల్ పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారులకు సేవలందించడానికి తమ వ్యాపారాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని యోచిస్తున్నామని వివరించారు. రిలయన్స్ గ్రూప్‌కు ఆర్థిక సేవల కంపెనీ కీలకమని, గ్రూప్‌లో అధిక వృద్ది ఉన్న వ్యాపారం ఇదని వివరించారు. కీలకం కాని ఆస్తుల విక్రయం జరుగుతోందని, వచ్చే మార్చి కల్లా భారీ స్థాయిలో మూలధన లాభాలు పొందగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లిస్టింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయ్.. రెండున్నరేళ్లలో భారత్‌లో భారీ మార్పులు వచ్చాయని, రెడ్ టేపిజమ్(ప్రభుత్వ విధానాల్లో సుదీర్ఘ జాప్యం)పోయి రెడ్ కార్పెట్ వచ్చిందని, చాలా సంస్కరణలు వచ్చాయని, వ్యాపార విశ్వసనీయత పెరిగిందని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. చౌక ధరల గృహాలు, సార్వత్రిక బీమా, చెల్లింపుల బ్యాంక్‌ల ఏర్పాటు, ఆధార్ వంటివన్నీ భారత్‌లో ఆర్థిక సేవల వృద్ధికి దోహదపడే కీలకాంశాలని వివరించారు. -
డిజిటల్ రంగం @రూ.20,000 కోట్లు
ఎర్నస్ట్ అండ్ యంగ్ నివేదిక ముంబై: భారత డిజిటల్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని ఎర్నస్ట్ యంగ్ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.8,490 కోట్లుగా ఉన్న ఈ రంగం 2020 నాటికి రూ.20,000 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. డిజిటల్ అడ్వర్జైజింగ్, ఓటీటీ(ఓవర్ ద టాప్) దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..., ⇔ మొబైల్ ఫోన్ల వాడకం విస్తృతంగా పెరిగిపోతుండటంతో, సంప్రదాయ ఇంటర్నెట్, టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసులు ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, భారత డిజిటల్ మీడియా మార్కెట్లో అవకాశాలు అపారంగా ఉండనున్నాయి. ⇔ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020 నాటికి వీరి సంఖ్య 74.6 కోట్లకు పెరుగుతుంది. ⇔ భారీ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తారు. ⇔ ఓటీటీ, డిజిటల్ అడ్వర్టైజింగ్, వీడియో ఓటీటీ సబ్స్క్రిప్షన్, మ్యూజిక్ ఓటీటీ సబ్స్క్రిప్షన్, గేమింగ్– ఈ రంగాల నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ⇔ 2015లో 31%గా ఉన్న స్మార్ట్ఫోన్ల వినియోగం 2020 కల్లా 59%కి పెరుగుతుంది. ⇔ డిజిటల్ ప్రకటనల వ్యయం 2020 కల్లా రూ.18,500 కోట్లకు చేరుతుంది. ⇔ భారత్‌లో 2020 కల్లా ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య 45 కోట్లకు పెరుగుతుంది. ఆన్లైన్ వీడియో వీక్షకుల పరంగా రెండో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ అవతరిస్తుంది. మొదటి స్థానంలో చైనా ఉంది. -
శిశువుల ఆరోగ్యం లాకెట్టులో!
‘ఖుషీ బేబీ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్న రాజస్థాన్ జైపూర్: పుట్టిన ప్రతి శిశువుకు టీకాలు వేయించడం ఇప్పుడు తప్పనిసరైపోయింది. ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధులు భవిష్యత్తులో వారికి హాని కలిగించకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ టీకాలు వేయిస్తుంటాం. అయితే ఏ టీకాలు వేశారు? మరే టీకాలు వేయాలి? అనే విషయంలో ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా అటు వైద్యులు, ఇటు తల్లిదండ్రులు పొరపడుతూనే ఉన్నారు. వేసిన టీకానే మళ్లీ వేయించడం, వేయించాల్సిన టీకా వేయించకపోవడం వంటి సంఘటనలు అంతటా జరుగుతూనే ఉన్నాయి. కార్డులు, రికార్డుల్లో నమోదు చేసినా.. సమయానికి అవి దొరక్క ఏదో ఒక టీకా వేసి పంపేస్తున్న ఘటనలు కూడా పునరావృతమవుతున్నాయి. అయి తే ఈ సమస్యకు చక్కని పరిష్కారం కనుగొన్నారు రాజస్థాన్‌లోని జైపూర్ వైద్యాధికారులు. అదే ‘ఖుషీ బేబీ’. ఖుషీ బేబీ అనేది ఓ డిజిటల్ లాకెట్. టీకాల కార్యక్రమం మొదలు కాగానే పిల్లల మెడలో ఈ లాకెట్ వేస్తారు. టీకా కోసం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు వేసిన టీకా వివరాలను ట్యాబ్ సాయంతో డిజిటల్ లాకెట్లో పొందుపరుస్తారు. దీంతో కార్డు పోగొట్టుకున్నామని, మర్చిపోయామని చెప్పడానికి అవకాశం లేదు. వేయాల్సిన టీకాపై స్పష్టత ఉంటుంది. అలాగే లాకెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వైద్య విభాగం అధికారుల వద్ద ఉండే ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లాకెట్లో ఏదైనా సమస్య వచ్చినా.. ట్యాబ్‌లోని సమాచారంతో టీకా వేస్తారు. ఓ రకంగా పిల్లల ఇమ్యునైజేషన్ ప్రక్రియను ఆన్లైన్ చేయడమన్నమాట. ఉదయ్‌పూర్‌లోని 81 ఆరోగ్య కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. -
ఆ 96 కోట్లమంది మాటేమిటి..?
న్యూఢిల్లీ: నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కాగా దీనిపై రాజకీయ పార్టీలు, మేధావులు, ఆర్థిక నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత దృష్ట్యా పూర్తిగా నగదు రహిత సమాజంగా మార్చడం సాధ్యంకాదని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇది సాధ్యం కావడం లేదని అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగం శరవేగంగా అభివృద్ది చెందాక మన దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. గత అక్టోబరు 6న ప్రపంచ బ్యాంకు వెల్లడించిన నివేదిక ప్రకారం దేశ జనభా 133 కోట్లు ఉండగా.. సెప్టెంబరులో ట్రాయ్ పేర్కొన్న నివేదిక ప్రకారం దేశంలో మొబైల్ వాడకందారుల సంఖ్య 105 కోట్లు ఉంది. కాగా మన దేశంలో దాదాపు 96 కోట్ల మంది ఇంటర్నెట్ను వాడటం లేదు. 37 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. అందులోనూ వీరిలో చాలామందికి మల్టీపుల్ కనెక్షన్లు ఉన్నందున నెటిజన్ల వాస్తవ సంఖ్య మరింత తక్కువగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా కావడం అన్నది ప్రశ్నగా మారింది. కాగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన డిజిటల్ మేళా కార్యక్రమంలో బీమ్ యాప్‌ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మొబైల్, ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలకు ఇంటర్నెట్ సదుపాయం అవసరం ఉండదని, వేలిముద్రల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. -
పెద్ద నోట్ల రద్దుతో రుణ వృద్ధికి బాట
• సీఐఐ విశ్లేషణ • డిజిటల్ డేటాబేస్ వ్యవస్థతో ఎన్పీఏలను కట్టడి చేయవచ్చని సూచన న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు బ్యాంకింగ్ రుణ వృద్ధికి దోహదపడుతుందని ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధి సంస్థ– సీఐఐ విశ్లేషించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. డీమోనిటైజేషన్ వల్ల అనధికార పొదుపులు అధికారికంగా మారి వృద్ధికి దోహదపడతాయని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి సీఐఐ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ⇔ బ్యాంకులు తమకు పెద్ద మొత్తంలో అందుబాటులోకి వచ్చిన నిధులను ఉత్పాదక రంగాలవైపు తరలించే వీలుంది. ఇది బ్యాంకింగ్ రుణ వృద్ధికి దోహదపడే అంశం. ⇔ ఇక వ్యక్తులు, కార్పొరేట్ల రుణ చరిత్ర ఆధారంగా బ్యాంకింగ్ విభిన్న రుణ రేట్లను అవలంబించే వీలుంది. ఇది దీర్ఘకాలంలో మొండిబకాయిల సమస్య తగ్గడానికి దోహదపడుతుంది. ఇక చక్కటి రుణ చెల్లింపు చరిత్ర ఉన్న కస్టమర్లు తేలిగ్గా బ్యాకింగ్ రుణాలు పొందే అవకాశం ఉంది. ⇔ మొండిబకాయిల భారాన్ని తగ్గించుకునే క్రమంలో బ్యాంకర్లకు అందుబాటులో ఉండే విధంగా ఒక ఇంటర్–లింక్డ్ డిజిటల్ డేటాబేస్ వ్యవస్థను సృష్టించుకుంటే ఫలితాలు మరింత బాగుంటాయి. దీనివల్ల చిన్న, మధ్య, బడా కార్పొరేట్ల రుణ గణాంకాలు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకు అందుబాటులో ఉంటాయి. రుణ గ్రహీత ‘రుణ చెల్లింపు సామరాథ్యన్ని’ ఇంటర్–లింక్డ్ డిజిటల్ డేటాబేస్ వ్యవస్థ ఫైనాన్షియర్‌కు అందుబాటులో ఉంచుతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను శాఖ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి కీలక మార్గాల ద్వారా డిజిటల్ డేటాబేస్ వ్యవస్థను రూపొందించుకునే వీలుంటుంది. -
డిజిటల్ లిటరసీపై ప్రత్యేక దృష్టి
- కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): డిజిటల్లిటరీసీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకు అధికారులకు జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ సూచించారు. ప్రతి గ్రామాన్ని ఈ నెల 25లోగా డిజిటల్ లిటరసీగా మార్చాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమావేశ మందిరంలో సిండికేట్ బ్యాంకు, ఆంధ్రబ్యాంకుల బ్రాంచీ మేనేజర్లు, బ్యాంకుల ఇన్చార్జి అధికారులకు వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రధానంగా 7 బ్యాంకులే జిల్లాలో కీలకంగా ఉన్నాయన్నారు. ఈ బ్యాంకులు తమ పరిధిలోని గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఎల్డీఎం నరసింహారావు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఆంధ్రబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం
డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్ అంశాలపై చర్చ న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టాప్ బిలియనీర్ అరుున బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో గురువారం సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈ-పేమెంట్స్, ఈ-అగ్రికల్చర్ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘ప్రస్తుతం ఇండియాలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి అపార వృద్ధి అవకాశాలు ఉన్నారుు. ఇది తమకు అనుకూలమైన సమయమని భావిస్తున్నాం’ అని బిల్ గేట్స్ సమావేశం అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని కొత్త అప్లికేషన్‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రధాన్యమిస్తాం. మా ఫౌండేషన్ కూడా వీటిపైనే ప్రధానంగా దృష్టికేంద్రీకరిస్తుంది’ అని వివరించారు. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కి బిల్ గేట్స్ సహవ్యవస్థాపకుడు అనే విషయం తెలిసిందే. ‘ఈ-అగ్రికల్చర్, డిజిటల్ హెల్త్, ఈ-పేమెంట్స్ వంటి అంశాలపై బిల్ గేట్స్ తన ఆలోచనలను నాతో పంచుకున్నారు. ఆధార్, ఆధార్ ఆధారిత చెల్లింపులు వంటి అంశాల గురించి నేను గేట్స్‌కు వివరించాను’ అని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
మంత్రి కేటీఆర్‌కు డిజిటల్ లిటరసీ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అందుకున్నారు. సర్టిపోర్ట్ సంస్థ అంతర్జాతీయ విక్రయాల విభాగం ఉపాధ్యక్షుడు జాన్డే చేతుల మీదుగా ఆదివారం బేగంపేటలోని తన నివాసంలో కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జాన్ డే మాట్లాడుతూ హైదరాబాద్ నగర వెలుగులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఈ పురస్కారానికి కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని అన్నారు. ఈ వివరాలను కేటీఆర్ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు సర్టిపోర్ట్ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ఏర్పాటుతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేందుకు క్రియాశీల పాత్ర పోషించిన కేటీఆర్ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్యక్రమ అమలుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కోసం డిజిటల్ తెలంగాణ, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ వంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు. -
డిజిటల్ స్క్రీన్ల వల్ల ఎంతో డేంజర్
న్యూయార్క్: ‘అరే! అదే పనిగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నావు. కళ్లు పోతాయ్!’ అంటూ పిల్లలను పెద్దవాళ్లు హెచ్చరించడం మనకు సర్వసాధారణంగా అనుభవమే. ఒకప్పుడు అది టీవీకి మాత్రమే వర్తించేది. ఇప్పుడు అది కంప్యూటర్లకు, లాప్‌ట్యాప్‌లకు, ట్యాబ్లెట్లకు, సెల్ఫోన్లకు అన్నింటికి వర్తిస్తుంది. వీటి వల్ల కళ్లు పూర్తిగా పోకపోయిన అనేక కంటి సమస్యలతోపాటు శారీరక సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు వాటినే ‘డిజిటల్ హై స్ట్రెయిన్’ అని పిలుస్తున్నారు. చూపు మందగించడం, మసగ్గా కనిపించడం, చూపు బ్లర్ అవడం, కళ్లు మంటపెట్టడం, గుంజడం లాంటి సమస్యలు తలెత్తడమే కాకుండా కొన్ని సార్లు రెటీనా దెబ్బదిని చూపు పూర్తిగా పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా కాకుండా భుజాలు, మెడ, నడుము నొప్పులతోపాటు తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ డిజిటల్ స్క్రీన్లను మనం ఎంతసేపు చూస్తామనేదాన్నిబట్టి సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రేటింగ్ ఏజెన్సీ ‘నీల్సన్’ నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 18 ఏళ్ల ప్రాయం యువత రోజుకు 11 గంటలపాటు ఈ డిజిటల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. అందుకనే అక్కడి పిల్లలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మెడ, భుజాలు, వెన్ను నొప్పి వచ్చిందన్న వారు 36 శాతం మంది, కంటీ సమస్యలు వచ్చిందన్నవారు 35 శాతం, తలనొప్పి వచ్చిందన్న వారు 25 శాతం మంది, 30 ఏళ్ల లోపువారిని పరిగణలోకి తీసుకుంటే వారిలో 73 శాతం మంది ఈ సమస్యలతో బాధ పడుతున్నారు. అంటే కొత్త జనరేషనే ఈ డిజిటల్ హై స్ట్రెయిన్‌తో ఎక్కువగా బాధ పడుతోందన్న మాట. ఆఫీసు వ్యవహారాలతోపాటు వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఈమెయిళ్లు, ఫేస్బుక్ అప్డేట్స్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ చూడడం ఈ తరం ప్రజల్లో ఎక్కువైన విషయం తెల్సిందే. ఇప్పుడు మనం అఫీసుల్లో ఒకటి, రెండూ కంప్యూటింగ్ డివైస్‌లను ఉపయోగిస్తుంటేనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. 2020 నాటికి ప్రతి ఉద్యోగి సగటున ఆరు కంప్యూటింగ్ డివైస్‌లను ఉపయోగించాల్సి వస్తుందని ‘సిట్రిక్స్’ సంస్థ వెల్లడించింది. మరి అప్పుడు పరిస్థితి మరెంత తీవ్రంగా ఉంటుందో. అన్నింటికన్నా కంటి సమస్యలను తీసుకొచ్చేది ఈ డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి కిరణాలే. వాటిలో నీలి కాంతి కిరణాలు మరీ ప్రమాదకరం. కంటిలోని రెటీనాకూ నీలికాంతిని ఫిల్టర్ చేసే సామర్థ్యం లేకపోవడమే అందుకు కారణం. ఊదారంగు కాంతికన్నా కూడా ఈ కాంతి ప్రమాదకరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ విప్లవం నుంచి మళ్లీ మనం ఎలాగూ వెనక్కి వెళ్లలేము గనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. డిజిటల్ స్క్రీన్ల నుంచి వెలువడే కాంతిని వీలైనంత మేరకు తగ్గించుకోవాలని, వాటిని వీలైనంత దూరంగా పెట్టి పనిచేసుకోవాలని, నీలిరంగు కాంతిని ఫిల్లర్ చేసే కళ్ల జోళ్లు వాడాలని వారు సూచిస్తున్నారు. కొన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు నీలిరంగు కాంతి కిరణాలను ఫిల్టర్‌చేసే కళ్ల జోళ్లను ఇప్పటికే సరఫరా చేస్తున్నాయి. ఐ ఫోన్లలో రాత్రిపూట కాంతిని నియంత్రించే సౌకర్యం ఉంది. ఈ సౌకర్యం అన్ని ఫోన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు యాప్స్ కూడా వస్తున్నాయి. ఈ దుష్ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కంటి నిపుణులు ‘20–20–20’ ఫార్ములాను పాటించాలని సూచిస్తున్నారు. అంటే డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 మీటర్ల దూరాన్ని చూడాలంటున్నారు. -
కిరికిరి
‘డిజిటల్ కీ’ వ్యవహారం కమిషనర్, ఎస్ఐలకు అందని ‘కీ’ సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం దరఖాస్తుదారుల ఇబ్బందులు జిల్లాలోని పలు ఠాణాల్లో ఇదే సమస్య జోగిపేట: పోలీసు, మున్సిపల్ శాఖలకు డిజిటల్ కీ తలనొప్పులు పట్టుకున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ‘కీ’ పర్మిషన్ రాకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. ఫలితంగా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్టిఫికెట్లు, సెల్ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, టైటిల్ డీడ్ మిస్ అయితే.. వాటిని పొందాలంటే అవస్థలు పడాల్సిందే. ‘కీ’లేక కుదరని ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేఽ, వాటిని మండల పరిధిలోని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వారంలో వాటిని జారీ చేయాల్సి ఉంటుంది. జోగిపేట ఎస్సైగా టి.శ్రీధర్ గత నెల 15వ తేదిన బాధ్యతలు చేపట్టారు. డిజిటల్ కీ కోసం ఆయన అర్జీ పెట్టుకున్నా ఇప్పటి వరకు రాలేదు. జోగిపేట సర్కిల్ పరిధిలోని పెద్దశంకరంపేట పోలీసుస్టేషన్‌కు కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైది కూడా ఇదే పరిస్థితి. గత నెలలో బదిలీ అయిన చాలా మంది ఎస్సైలకు ఇదే సమస్య ఎదురవుతోంది. దీంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. నగర పంచాయతీలో... నగర పంచాయతీ ద్వారా పొందే సర్టిపికెట్లన్నీ ముఖ్యమైనవే. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో నాన్‌అవెయ్‌లెబులిటీ సర్టిఫికెట్, వాటిల్లో మార్పులుచేర్పులు నగర పంచాయతీ ద్వారానే డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరిస్తారు. విదేశాలకు వెళ్లేవారికి తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ అవసరం. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు పత్రాలు సకాలంలో జారీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. జూలై 12వ తేదిన కమిషనర్‌గా ఉన్న రవీందర్రావును పలు కారణాలతో కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓ యాశ్మిన్‌భాషకు ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు గత నెల 29న రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆగస్టు 4వ ఆమె బాధ్యతలు చేపట్టినా డిజిటల్ కీ అనుమతి రాకపోవడంతో అనేక సర్టిఫికెట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. సర్టిఫికెట్ కోసం 15 రోజులుగా తిరుగుతున్నా.. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పోయిందని జూలై 23న జోగిపేట మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాలేదు. ఇదే విషయం ఎస్సైని అడిగితే డిజిటల్ కీ లేదని, కాబట్టి సర్టిఫికెట్ ధ్రువీకరించలేదని చెప్పారు. ఇంకా నెల పడుతుందన్నారు. - పొట్టిగల్ల కృష్ణ, డాకూర్ గ్రామం -
హైదరాబాద్‌లో డిజిటల్ గార్డియన్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డేటా ప్రొటెక్షన్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన డిజిటల్ గార్డియన్ భారత్‌లో తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి ఇది 7వ కేంద్రం. సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైస్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, సిస్టమ్స్ మేనేజ్మెంట్ ఇన్నోవేషన్‌పై ఈ సెంటర్ దృష్టిసారిస్తుందని కంపెనీ తెలిపింది. డ్యూపాంట్, జీఈ వంటి కంపెనీలు ఈ సంస్థకు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ గార్డియన్‌కు 350 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రంలో 150 మందిని నియమించుకోనుంది. -
డిజిటల్ కీల వాపస్
ఆర్డీఓలకు ఇచ్చిన తహసీల్దార్లు కలెక్టర్, జేసీలకు వినతిపత్రాలు సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి హన్మకొండ అర్బన్ : తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీడీటీఏ) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లు తమ వద్ద ఉన్న డిజిటల్ కీలను శుక్రవారం ఆర్డీఓలకు అందజేశారు. ఆన్లైన్లో తలెత్తుతున్న సాంకేతికలోపంతో ప్రజల సమస్యలను సకాలంలో పరి ష్కరించలేకపోతున్నామంటూ తహసీల్దార్లు తమ వద్ద ఉన్న డిజిటల్ కీలను ఉన్నతాధికారులకు ఇచ్చారు. తమ సమస్యలు వివరిస్తూ కలెక్టర్, జేసీలకు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు మాట్లాడుతూ సాంకేతిక సమస్యలతో మ్యూటేషన్లు, పాస్ పుస్తకాలజారీ, పౌర సరఫరాల వ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా ప్రస్తుత సీజన్లో రైతులకు సకాలంలో సేవలు అందించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నిలిచిన ధ్రువీకరణ పత్రాల జారీ తహసీల్దార్లు డిజిటల్ కీలను ఆర్డీఓలకు అప్పగించడంతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ నుంచి జరిగిగే ఆన్లైన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క రోజే సుమారు 15వేలకు పైగా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ పక్రియకు బ్రేక్ పడింది. పహణీల్లో మార్పులు, రేషన్‌కార్డుల పరిశీలన పక్రియ కూడా నిలిచిపోయింది. కాగా, తహసీల్దార్ల నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా స్పందించలేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా అనే విషయంలో స్పష్టత రాలేదు. ప్రభుత్వం తమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపితే తప్ప డిజిటల్ కీ వాపస్ తీసుకునేది లేదని జిల్లా తహసీల్దార్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. కలెక్టర్, జేసీని కలిసిన వారిలో తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పూల్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర కార్యదర్శి చెన్నయ్య, ఉపాధ్యక్షులు రవి, నాయకులు రాజ్‌కుమార్, కిరణ్‌ప్రకాష్, రవి, రాము తదితరులు ఉన్నారు. -
వైద్యుల చేతిలో డిజిటల్ ప్రిస్కిప్షన్లు!
♦ ర్యాపిడ్ఆర్ యాప్‌ను విడుదల చేసిన సెయిన్స్ హెల్త్‌టెక్ ♦ ఈ ఏడాది చివరినాటికి 25 వేల డాక్టర్ల నమోదు లక్ష్యం ♦ సెయిన్స్ హెల్త్‌టెక్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ రఘువీర్ వేదాంతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఎవరికీ అర్థంకానీ చేతి రాతతో రాసే ప్రిస్కిప్షన్ల వల్ల ఒక మందుకు బదులు మరో మందులేసుకుంటూ కొంతమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటే.. మరికొంత మంది మరణించిన సందర్భాలూ ఉన్నాయి. వీటికి పరిష్కారం చూపించాలంటే చేతిరాతకు బదులు డిజిటల్ ప్రిస్కిప్షన్లను వైద్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. అదే మా లక్ష్యం కూడా’’ అని సెయిన్స్ హెల్త్‌టెక్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ రఘువీర్ వేదాంతం చెప్పారు. దీనికోసం ర్యాపిడ్ఆర్ పేరుతో యాప్‌ను రూపొందించామని, డిజిటల్ ప్రిస్కిప్షన్ల వల్ల ఎలాంటి పొరపాట్లు జరగవని.. పెపైచ్చు పూర్తి సురక్షింతంగా ఉంటుందని బుధవారమిక్కడ విలేకరులతో చెప్పారాయన. ‘‘రిజిస్టర్ చేసుకున్న వైద్యులు ఈ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో ప్రిస్కిప్షన్స్ ఇస్తారు. దీన్ని మెడికల్ షాపులు, రోగులు వినియోగించుకునే వీలుంటుంది. అవసరమైన మందులు, వేసుకోవాల్సిన సమయాలను పేషెంట్లకు ఎస్ఎంఎస్ రూపంలోనూ పంపిస్తాం’’ అంటూ పనితీరును వివరించారు. పేషెంట్లకు తమ మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్‌ను, డాక్టర్ సమ్మరీలను భద్రపరుచుకునే వీలు కూడా ఈ యాప్‌లో ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో 10 లక్షల మంది లెసైన్స్డ్ డాక్టర్లుండగా.. ఏటా 3-3.5 బిలియన్ల ప్రెస్కిప్షన్లు రాస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి 25 వేల మంది వైద్యులను యాప్‌లో నమోదు చేయాలని లక్ష ్యంగా పెట్టుకున్నామని చెప్పారు. యాప్ వినియోగానికి ఎలాంటి చార్జీలు ఉండవని, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చెప్పారు. అట్లాంటా ప్రధాన కేంద్రంగా వైద్య రంగంలో డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సేవలందిస్తున్న సెయిన్స్ హెల్త్‌టెక్ అనుబంధ సంస్థే ఇది. -
సెక్రటేరియట్ సందర్శకులకు ఇక డిజిటల్ పాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులకు డిజిటల్ పాస్‌లు ఇవ్వనున్నట్లు ఛీఫ్ రిసెప్షన్ ఆఫీసర్(సీఆర్వో) బంగార్రాజు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ ఫోటో ఐడీ పాస్ విధానాన్ని సాధారణ పరిపాలన అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటలకు ప్రారంభించనున్నట్లు సీఆర్వో తెలిపారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా తమవెంట ఆథార్‌కార్డు లేదా ఏదేని ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని సూచించారు. -
డిజిటల్ ఇంటిగ్రేషన్ పై ఎన్ఐఐటీ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్ఐఐటీ టెక్నాలజీస్ సంస్థ... డిజిటల్ ఇంటిగ్రేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా గతేడాది కొనుగోలు చేసిన డిజిటల్ టెక్నాలజీ సేవలను అందించే ఇన్సెశాంట్ టెక్నాలజీస్‌ను భారీగా విస్తరిస్తోంది. సుమారు రూ.20 కోట్లతో హైదరాబాద్‌లో ఇన్సెశాంట్ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను (ఆర్అండ్డీ) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చతుర్వేది మాట్లాడుతూ ఆటోమేషన్, రోబోటిక్ వంటి ప్రధానమైన ఆరు డేటా ఇంటిగ్రేషన్ సేవలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఖాతాదారులకు కావాల్సిన సేవలను అతి తక్కువ సమయంలోనే అందించేలా ఇక్కడ ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా డిజిటల్ ఇంటిగ్రేషన్ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఇన్సెశాంట్ టెక్నాలజీస్ సీఈవో విజయ్ మద్దూరి తెలిపారు. -
బీమా పత్రాలు కాస్త భద్రం!
భౌతికంగానే కాక... డిజిటల్ కాపీలూ ఉంచుకోండి అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడం, కొనుక్కోవడం అంత సులువేమీ కాదు. ప్రస్తుతం బోలెడన్ని కంపెనీలు అనేక రకాల పాలసీలు అందిస్తున్నాయి. పాలసీ తీసుకోవాలంటే దాని టర్మ్, ప్రీమి యం, కవరేజీ, మినహాయింపులు మొదలైనవన్నీ చూసుకోవడం తప్పనిసరి. దీనికే సమయం సరిపోతుంది. ఈ హడావుడిలో పడి పాలసీ కొనుక్కునేటప్పుడు కీలకమైన నియమ, నిబంధనలను, డాక్యుమెంటేషన్‌ను చాలా మంది పట్టించుకోరు. బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు నియమ, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక డాక్యుమెంటేషన్ విషయానికొస్తే... కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇదొక్కటే ఆధారం. ఎంత ప్రీమియం కడతాం? ఎంత కవరేజి ఉండబోతోంది? వంటి కీలకమైన సమాచారమంతా ఇందులోనే ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే పట్టించుకోకపోతే.. ఆ తర్వాత ఇవే సమస్యలై కూర్చుంటాయి. అంతే కాదు! పాలసీని జాగ్రత్తగా భద్రపర్చుకోవడం కూడా కీలకమే. ఇందుకోసం తీసుకోతగిన జాగ్రత్తల్లో కొన్ని.. ♦ దరఖాస్తు నింపేటప్పుడే అన్ని సూచనలు సరిగ్గా చదువుకుని నింపాలి. అవసరమైన పత్రాలన్నింటినీ జత చేయాలి. కొన్ని కంపెనీలు ఎలక్ట్రానిక్ రూపంలోనూ అడుగుతుంటాయి.. కాబట్టి ముందుగానే నిర్దేశిత పత్రాలను స్కాన్ చేసి పెట్టుకుంటే పాలసీ తీసుకోవడంలో సమయం వృథా కాదు. ♦ వైద్య బీమా పాలసీలకు సంబంధించి కంపెనీలు ప్రస్తుతం ఫ్రీ లుక్ పీరియడ్ ఇస్తున్నాయి. ఇది సుమారు పది-పదిహేను రోజులుంటుంది. తనకు జారీ అయిన పాలసీపై సంతృప్తి చెందని పక్షంలో పాలసీదారు ఈ వ్యవధిలో దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఫ్రీ లుక్ పీరియడ్‌లో రద్దు చేసుకున్నా పాలసీదారు కట్టిన మొత్తం ప్రీమియం వెనక్కి వచ్చేస్తుంది. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అయితే, ఈ వ్యవధిలో ఎటువంటి క్లైమ్ దాఖలవకుండా ఉండాలి. ఈ ఆప్షన్ ఉపయోగించుకోదల్చుకుంటే.. బీమా కంపెనీకి రాతపూర్వకంగా రిక్వెస్ట్ ఫారం సమర్పించాలి. దీన్ని ఆయా కంపెనీల వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పాలసీని వద్దనుకుంటే.. పాలసీ డాక్యుమెంటు అందిన తేదీ, ఏజంటు సమాచారం, రద్దు చేసుకుంటున్నందుకు కారణాలు మొదలైన వివరాలన్నీ ఫారంలో పొందుపర్చాలి. అలాగే ప్రీమియం రీఫండ్ కోసం చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి. రూ. 1 రెవెన్యూ స్టాంపును ఫారంపై అతికించి, పాలసీదారు సంతకం చేసి అందజేయాలి. ♦ ఫ్రీ లుక్ పీరియడ్ అంశాన్ని పక్కన పెట్టి.. పాలసీ పత్రాల విషయానికొస్తే, వీలైనంత వరకూ పాలసీ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు తీసి పెట్టుకోవడం మంచిది. మీకు నమ్మకమైన బంధువులెవరైనా ఉంటే వారి దగ్గరా ఒక కాపీ ఉంచవచ్చు. అలాగే, పాలసీని స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపర్చుకోవచ్చు. ఒరిజినల్ పత్రాలను ల్యామినేట్ చేసి బ్యాంక్ సేఫ్ డిపాజిట్లో కూడా ఉంచవచ్చు. అగ్ని ప్రమాదాలో లేక ప్రకృతి వైపరీత్యాల్లోనో ఇంటికి ఏదైనా జరిగినా కూడా క్లెయిమ్ చేసుకునేందుకు మీ పాలసీ పత్రాలు భద్రంగా ఉంటాయి. ♦ సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చే చోట నివసించే వారికి ఇలాంటి జాగ్రత్తలు చాలా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇటీవ ల చెన్నైను వరదలు ముంచెత్తినప్పుడు బీమా క్లెయిమ్‌లు దాదాపు రూ. 2,500 కోట్లకు పైగా వచ్చాయి. కాబట్టి, ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు బీమా పత్రాలన్నీ జాగ్రత్తగా ఉంచుకుంటేనే అసలు ప్రయోజనాలు పొందగలరు. టూకీగా చెప్పాలంటే.. పాలసీ దరఖాస్తులో ఎటువంటి తేడాలు లేకుండా నిజాయితీగా నింపాలి. నియమ నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా చదువుకోవాలి. పాలసీ జారీ అయ్యాక బ్యాకప్ కాపీలను కనీసం రెండు సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపర్చుకోవాలి. -
యప్ టీవీకి ఏషియా కప్ డిజిటల్ రైట్స్
ఈనెల 24 నుంచి మార్చి 6 వరకు జరగనున్న ఏషియా కప్ టి 20 మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ మీడియా రైట్స్ తమకు సొంతం అయినట్లు యప్ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది. యప్‌టీవీ యాప్‌తో పాటు ఇంటర్నెట్ ఎనేబుల్డ్ పరికరాలలో కూడా ఈ టి20 మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తామని చెప్పింఇ. అమెరికా, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా దేశాలతో పాటు.. సింగపూర్‌లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఏషియా కప్ 2016ను యప్‌టీవీ ద్వారా చూడొచ్చు. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ బ్లూరే ప్లేయర్లు, స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్లు, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఏషియా కప్ టి20 టోర్నమెంటు నిర్వహిస్తారు. ప్రారంభ మ్యాచ్ భారత్- బంగ్లా జట్ల మధ్య జరుగుతుంది. ఈ తటస్థ వేదికపై భారత్ - పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 27న జరగనుంది. దక్షిణాసియా దేశాల్లో క్రికెట్‌కు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారని, ఇప్పుడు తాము ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ మీడియా రైట్స్‌ను దక్కించుకోవడం ద్వారా లైవ్ మ్యాచ్‌లను అభిమానులకు చూపించగలమని యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో పాటు అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్, ఒమన్, యూఏఈ జట్లు కూడా ఈ టోర్నమెంటు క్వాలిఫయింగ్ రౌండులో పాల్గొంటున్నాయి. -
సంతకం సమర్పయామీ!
సంగారెడ్డి క్రైం: దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా మారింది ప్రభుత్వ కార్యాలయాల్లోని పరిస్థితి. జిల్లాలోని ఆయా శాఖల్లో డిజిటల్ కీ వ్యవహారమంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఉండాలి. కానీ ఆ వ్యవహారమంతా ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ల చేతిలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ శాఖల్లో సేవలను సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్ సేవలు అందిస్తోంది. అలాగే ఉన్నతాధికారులకు సంబంధించిన సిగ్నేచర్‌ను డిజిటలైజేషన్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే ఆర్జీదారుల సర్టిఫికెట్ల కోసం సంతకాలు చేయాలంటే జాప్యమవుతోంది.జాప్యాన్ని నివారించేందుకు డిజిటల్ సిగ్నేచర్ పరికరం డిజిటల్ కీని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే, కార్మిక శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు తదితర శాఖల్లో ఈ డిజిటల్ కీ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఆయా శాఖల ఉన్నతాధికారుల చేతుల్లో వుండాల్సిన డిజిటల్ కీ సిగ్నేచర్ వారికి తెలియకుండానే అనధికారికంగా దుర్వినియోగమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో డిజిటల్ కీ సిగ్నేచర్‌ను వాడుకొని ఒక సాధారణ కంప్యూటర్ ఆపరేటర్ రూ. 3 కోట్లకు పైగా నిధులను ఆన్లైన్ ద్వారా దారి మళ్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందంతో సమగ్ర విచారణ జరుపుతోంది. దీనితోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ నేతృత్వంలో జెడ్పీ సీఈఓ వర్షిణి, జిల్లా ఎస్పీ సుమతి నేతృత్వంలో సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్నలు వేర్వేరుగా దర్యాప్తులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా వ్యవసాయ శాఖలో భారీగా నిధులు ఆన్లైన్ ద్వారా దారి మళ్లిన తర్వాత తీరిగ్గా అధికారులు తేరుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజు సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్‌లు, మండలాల ప్రత్యేకాధికారుల నియామకం కారణంగా గ్రామాలను సందర్శించడం ఇలా ఆయా శాఖల అధికారులకు తీరక లేకుండాపోయింది. అంతేగాక డిజిటల్ కీని తమ వద్దే వుంచుకోవాలన్న విషయం తెలిసి కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ కీని కార్యాలయాల సిబ్బందికి, కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పగించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లోని కంప్యూటర్ ఆపరేటర్లే నియంతలుగా మారి అక్రమాలకు పాల్పడుతున్నారు. మీ సేవా, ఇతర ఆన్లైన్ సేవల ద్వారా ఇస్తున్న సర్టిఫికెట్లు చాలా వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సంబంధం లేకుండానే జారీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ప్రధాన శాఖల్లో డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటే ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా అడ్డుకట్ట వేయడానికి అవకాశం వుంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు వాడారు? ఏ ఏ సర్టిఫికెట్లకు వాడారో? పేర్కొంటూ రికార్డులు నమోదు చేస్తూ, వాటిని ప్రతి వారం జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. -
పోలీస్ యాప్‌కు మరో అవార్డు
హైదరాబాద్ : నగర పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ 'హాక్-ఐ' మరో అవార్డు సాధించింది. బెంగళూరుకు చెందిన ఓ పత్రికా సంస్థ 2015 సంవత్సరానికిగాను డిజిటల్ సిటిజన్ సర్వీసు అవార్డ్ ప్రకటించింది. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) అంజనీకుమార్, ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి ఈ అవార్డు అందుకున్నారు. ఈ యాప్‌కు సంబంధించి గురువారం ఢిల్లీలో సీఎస్ఐ నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ అవార్డును నగర పోలీసులు అందుకున్న విషయం విదితమే. -
గిఫ్టింగ్‌లో నయా ట్రెండ్
పండుగలల్లో బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్స్ ఇచ్చే విధానం మారుతోంది. ఒకప్పుడు ఇలాంటి ప్రత్యేక రోజుల్లో స్వీట్లు,డ్రైఫ్రూట్లను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ ఆక్రమిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆన్లైన్ వోచర్లు, గిఫ్ట్ కార్డ్స్‌కు గిరాకీ పెరుగుతోంది, స్టార్టప్స్, ఇతర సంస్థలు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాటి కార్పొరేట్ గిఫ్ట్స్ కోసం డిజిటల్ గిఫ్టింగ్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. డిజిటల్ గిఫ్టింగ్ అంటే.. డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో ఆన్లైన్ వోచర్లు, గిఫ్ట్ కార్డులు, ఈ-గిఫ్టింగ్ అనే అంశాలుంటాయి. గిఫ్ట్ కార్డ్స్ చూడటానికి మన క్రెడిట్, డెబిట్ కార్డులాగే ఉంటాయి. ఈ-గిఫ్టింగ్‌లో గిఫ్ట్స్ డెరైక్ట్‌గా మెయిల్‌కే వస్తాయి. వోచర్ల విషయానికి వస్తే.. ఎంపిక చేసిన రిటైల్ షాప్‌ల్లో ఇచ్చిన నిర్ణీత ధరల్లో నచ్చిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. అలాగే వీటికి కాల పరిమితి కూడా ఉంటుంది. సొల్యూషన్స్‌ను అందిస్తున్న పలు సంస్థలు డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్‌ను పలు సంస్థలు అం దిస్తున్నాయి. పేమెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పైన్ ల్యాబ్స్, ఈ-గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్ క్విక్కిల్వర్, ఆన్లైన్ గిఫ్టింగ్ ప్లాట్‌ఫామ్ గిఫ్ట్జోజో, ఆఫీస్ సప్లై ఈ-కామర్స్ పోర్టల్ జోఫియో వంటి సంస్థలు డిజిటల్ గిఫ్టింగ్ విభాగంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. పైన్ ల్యాబ్స్‌లో క్రోమా, బిగ్ బజార్, సినీపోలిస్, స్పైస్ హాట్‌స్పాట్, గోద్రేజ్ నేచర్స్ బాస్కెట్, మెయిన్‌ల్యాండ్ చైనా, పిజా హాట్ వంటి 100పైగా బ్రాండ్స్ సంబంధిత గిఫ్ట్ వోచర్లను పొందొచ్చు. డిజిటల్ గిఫ్టింగ్ ప్రయోజనాలు సంప్రదాయ పద్ధతుల్లోని గిఫ్టింగ్ విధానంతో పోలిస్తే డిజిటల్ గిఫ్టింగ్‌లో పలు ప్రయోజనాలు ఉన్నాయి. డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో ఎలాంటి లాజిస్టిక్ చార్జీలు లేకుండా వెంటనే గిఫ్ట్‌ను డెలివరీ చేయొచ్చు. కార్పొరేట్ సంస్థలు వారి ఉద్యోగులందరి అభిరుచులకు తగ్గట్టుగా గిఫ్ట్స్‌ను అందించడానికి డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ ఒక సులువైన మార్గమని పైన్ ల్యాబ్స్ సీఈవో లొక్వీర్ కపూర్ తెలిపారు. శామ్సంగ్, మ్యాక్స్ బుపా, మాస్టర్ కార్డు, బ్రిటిష్ ఏయిర్‌వేస్, ఏయిర్టెల్ వంటి తదితర పెద్ద పెద్ద కంపెనీలు కూడా డిజిటల్ గిఫ్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించాయని పేర్కొన్నారు. డిజిటల్ గిఫ్ట్ కార్డ్స్ విధానంలో గిఫ్ట్ గ్రహీతలు వారికి కావాల్సిన, నచ్చిన బహుమతులను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందని క్విక్కిల్వర్ సీఈవో కుమార్ సుదర్శన్ తెలిపారు. డిజిటల్ గిఫ్టింగ్ విధానంలో నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని చెప్పారు. ‘ఉద్యోగి తన కంపెనీ నుంచి ఒక గిఫ్ట్‌ను పొందడానికి కన్నా ఆన్లైన్ గిఫ్ట్ వోచర్‌ను తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆన్లైన్ గిఫ్ట్ వోచర్లో అతనికి కావాల్సిన గిఫ్ట్‌ను ఎంచుకోవడంలో స్వేచ్ఛ ఉంటుంది’ అని వివరించారు. సంప్రదాయ గిఫ్టిం గ్లో ఉన్న ఎంపిక, డెలివరీ ఖర్చులు వంటి సమస్యలు డిజిటల్ గిఫ్టింగ్‌లో ఉండవని జోఫియో సీఈవో అభిషేక్ కుమాని తెలిపారు. ఉద్యోగులు అధికంగా ఉండే సంప్రదాయ తయారీ కంపెనీలు ఇంకా డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ విషయంలో వెనుకంజలో ఉన్నాయని గిఫ్ట్జోజో సహ వ్యవస్థాపకులు మనోజ్ తెలిపారు. గత మూడేళ్లలో తాము 200 క్లయింట్స్‌కు డిజిటల్ గిఫ్టింగ్ సొల్యూషన్స్ సేవలను అందించామన్నారు. కొత్త దారిలో వెళ్తున్న స్టార్టప్స్ స్టార్టప్స్ వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. తన కస్టమర్లు, ఉద్యోగులకు పండుగ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నాయి. అర్బన్‌క్లాప్, ఈజీఫిక్స్ వంటి స్టార్టప్స్ దీపావళి సందర్బంగా వాటి కస్టమర్లు, ఉద్యోగులకు బోనస్‌తోపాటు ఇంటీరియర్ డెకరేషన్ నుంచి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ వరకు ఇన్స్టాంట్ ప్రొఫెషనల్ సొల్యూషన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఈజీరివార్డ్జ్ అయితే తన ఉద్యోగులకు డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది. -
హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం
హైదరాబాద్: భారత్‌లో అతి పెద్ద డిజిటల్ పబ్లికేషన్స్ ప్లాట్ఫామ్అయిన రీడ్వేర్డాట్కామ్ను నిర్వహించే మీడియాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇటీవలే హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుర్గావ్లో ప్రధాన కార్యాలయం ఉందని, దీని తర్వాత వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదేనని మీడియాలజీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, కామిక్స్, ఇతర పుస్తక ప్రచురణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని మీడియాలజీ వ్యవస్థాపకులు గౌరవ్ భట్నాగర్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ.. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమకు మంచి రీడర్షిప్ ఉందని తెలిపారు. మొబైల్ సీఎంఎస్ సొల్యూషన్‌తో మొబైల్ వినియోగదారులకు సమర్థవంతంగా కనెక్ట్ కాగలమని మీడియాలజీ సీఈఓ, డెరైక్టర్ మనీష్ థింగ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇక కేబీఆర్ డిజిటల్ పార్క్
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు డిజిటల్ పార్క్‌గా రూపుదాల్చబోతోంది. ఇందుకోసం ఇప్పటికే పార్క్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. రేపటి నుంచి వాకర్లను బయోమెట్రిక్ విధానం ద్వారా పార్క్‌లోకి అనుమతించనున్నట్లు డీఎఫ్‌వో కొండా మోహన్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది వాకర్లకు పాస్‌లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై పార్క్ లోపలికి వెళ్లాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ విధానం ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. పార్క్‌కు రెండు వైపులా ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద బయోమెట్రిక్ యంత్రాలను అమర్చినట్లు పేర్కొన్నారు. పార్క్‌లోకి వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరు వారికిచ్చిన గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. కార్డు లేకపోతే, ఫింగర్ ప్రింట్ ద్వారా మిషన్‌లో వివరాలు నమోదు చేసుకొని ప్రవేశించాల్సి ఉంటుందన్నారు. ఇక టిక్కెట్లు కూడా డిజిటల్ రూపంలోనే ఇస్తామని మెహన్ చెప్పారు. కేబీఆర్ పార్క్ నగరంలోనే తొలి డిజిటల్ పార్క్‌గా రూపుదాల్చిందని ఆయన వివరించారు. -
అంతా డిజిటల్ పాలనే..!
పత్రాల పాలన కనుమరుగు కానుంది. వివిధ రకాల ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజలు కష్టాలకు ఇక చెక్ పడనుంది. ఏ ధ్రువపత్రం అవసరమైనా ఆధార్ నంబరే ప్రధానం. దానితో ఖాతా తెరిచి కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లెసైన్‌స, ఆదాయపన్ను ఖాతా వివరాలు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టులతో పాటు భూములకు సంబంధించి సమస్త వివరాలను భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు. ధ్రువపత్రాల నంబర్‌ను నమోదు చేసి నేరుగా పొందవచ్చు. డిజిటల్ పాలనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న శ్రీకారం చుట్టగా, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న ప్రారంభించింది. -వీరఘట్టం డిజిటల్ లాకర్ సదుపాయం వ్యక్తిగత నివాస, విద్యార్హత, ఆదాయ పన్ను ఖాతా, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కుల, నివాస, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు వంటివి తమ అవసరాల కోసం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాల్సి వస్తోంది. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఏ ధ్రువీకరణ పత్రాలు అడుగుతారో తెలియక అన్నీ ఫైల్లో ఉంచుకొని తిరగాల్సి వస్తోంది. వీటిని పోగొట్టుకుంటే అంతే సంగతులు. మళ్లీ పొందాలంటే కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి ప్రదక్షణలు చేయాలి. డిజిటల్ ఇండియా పాలనలో ఈ కష్టాలు ఉండవు. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ ఆన్లైన్ లాకర్లో భద్రపరుచుకోవచ్చు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లాకర్ సదుపాయా న్ని ప్రజల ముగింటల్లోకి తెచ్చాయి. నెట్ సెంటర్లు, మొబైల్ నెట్‌వర్క్‌తో కూడా డిజిటల్ లాకర్లో ధ్రువపత్రాలను భద్రంగా దాచుకొని అవసరమైన సమయాల్లో ఆన్లైన్లో అవసరమైన సంస్థలు, కార్యాలయాలకు పంపుకొనే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఇండియాలో దేశంలో 8,73,079 మంది భాగస్వాములు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 62,462 మంది డిజిటల్ లాకర్ సదుపాయం కలిగి ఉన్నారు. లాకర్ ప్రవేశం ఇలా..... ఆధార్సంఖ్య, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఉండాలి. డిజిటల్ లాకర్ వెబ్సైట్లోకి వెళ్లి సైన్ అప్ క్లిక్ చేసి ఆధార్ సంఖ్య నమోదు చేయగానే ఆధార్‌లో ఉన్న మొబైల్, ఈ-మెయిల్‌కు ఒన్‌టైం పాస్ వర్డు (ఓటీపి) వస్తుంది. వ్యాలిడేట్ ఓటీపీ వద్ద సంఖ్యను నమోదు చేసి వెబ్సైట్లోకి ప్రవేశించవచ్చు. మన దగ్గర ఉన్న ధ్రువపత్రాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేసుకోవడంతో పాటు డిజిటల్ సంతకం తో ఉన్న ఈ ధ్రువీకరణలు ఇందులో భద్రపరుచుకోవచ్చు. అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఆధార్ సంఖ్య జతచేస్తే డిజిటల్ ధ్రువీకరణ జారీ ప్రభుత్వ సంస్థలకు అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన వాటిని దరఖాస్తులు చేసుకొనే సమయంలో కేవలం ఆధార్ నంబరును సంబంధిత సంస్థలకు తెలిపితే వారే నేరుగా ధ్రువపత్రాలను డిజిటల్ లాకర్ ద్వారా ప్రింటు తీసుకుంటారు. దీంతో పత్రాల జిరాక్సు ఖర్చులు మిగులుతాయి. దరఖాస్తు చేసుకునే సమయం మిగులుతుంది. 19 రకాల పౌరసేవలు డిజిటల్ ఇండియాలో భాగంగా 19 రకాల పౌర సేవలతో మీసేవ యాప్‌ను ప్రారంభించారు. మీసేవా కేం ద్రాల్లో లభించే ఆదాయ, కుల, నివాస, నగదు చెల్లింపులు వ్యవసాయ శాఖకు సంబంధించిన అడంగల్, పుట్టిన తేదీ వంటి ధ్రువపత్రాలు పొందవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల ఆధార్ సంఖ్యను కంప్యూటర్లో పొందుపరిచేలా కళాశాలల యాజ మాన్యం చర్యలు తీసుకొంది. తరుచూ ధ్రువపత్రాల సమర్పణ అవసరం లేకుండా డిజిటల్ లాకర్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా కళాశాలల్లో ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మొబైల్‌యాప్‌లు, ఫిర్యాదుల యంత్రాలు,తదితర సాంకేతిక సేవల వినియోగాన్ని పెంచనున్నారు. విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర స్థాయి లో సాంకేతిక కమిటీని నియమించారు. ఇప్పటికే విశాఖపట్టణం రేంజ్ పరిధిలో ఐ క్లిక్, అభయం యాప్‌లను ప్రవేశపెట్టారు. మరోవైపు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా కొన్ని జిల్లాల్లో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను పోలీసులు ఆరంభించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ శ్రీకాకుళం జిల్లాకు సుమారు 1000 ట్యాబ్‌లు సరఫరా చేశారు. వీటిని జిల్లాలోని తహశీల్దార్లు, వీఆర్వోలకు, ఆర్ఐఓలకు వారం రోజుల్లో పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఇందిరాకాంత్రి పథకం మహిళలకు కూడా ట్యాబ్‌లు అందజేయనున్నారు. డిజిటల్ ఇండియాతో సాంకేతిక అభివృద్ధి యువతీ, యువకుల్లో కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్లైన్ సేవలు పెరిగిపోవడంతో ధ్రువపత్రాల అవసరం లేకుండా పోయింది. ప్రజలు సామాజిక మాద్యమాలను వినియోగించుకుంటున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.పనుల్లో జాప్యం లేకుండా క్షణాల్లో జరిగిపోతాయి. -కె.సాల్మన్‌రాజ్, ఆర్డీవో, పాలకొండ -
ఒకే చానల్... జిల్లాకో ప్రసారం!
న్యూస్ చానళ్లలోనూ ప్రాంతీయ, జోనళ్ల వారీగా ప్రసారాలు, ప్రకటనలు ‘మాయా ప్లాట్‌ఫామ్’తో సాధ్యం చేస్తున్న గయాన్ సొల్యూషన్స్ చానళ్లను రోజువారీ అద్దెకిచ్చే సేవలు నెలరోజుల్లో ఆరంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో న్యూస్ పేపర్ చూడండి. పేపర్ ఒకటే అయినా ప్రతి రాష్ట్రానికీ వార్తలు, అడ్వర్టయిజ్మెంట్లు మారిపోతుంటాయి. ఇక ప్రాంతీయ పత్రికలైతే జిల్లా జిల్లాకూ వార్తలు, ప్రకటనలు మారిపోతాయి. ‘సాక్షి’ లాంటి ప్రధాన పత్రికలైతే ఇంకా ముందుకెళ్లి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కూడా జోన్పేజీలు అందిస్తున్నాయి. అదే పత్రికల బలం. మరి టెలివిజన్ చానళ్ల సంగతో!! జాతీయ ఛానెళ్లయినా, ప్రాంతీయ చానళ్లయినా అంతటా ఒకటే ప్రసారాలు. ఎలాంటి తేడా ఉండదు. అదే చానళ్ల బలహీనత. పత్రికలు ఒకేరోజు మొదటి పేజీలో ప్రాంతాల వారీగా జిల్లాకో ప్రకటన ఇవ్వగలవు. దాంతో వాటికి ప్రకటనలే కాక ఆదాయమూ ఎక్కువగానే వస్తుంది. టీవీలకు ఈ సౌలభ్యం లేకే అవి పత్రికలతో పోటీపడే స్థాయికి రాలేకపోతున్నాయన్నది విశ్లేషకుల మాట. ఇదిగో... ఈ లోటు పూడ్చి చానళ్లకూ ఆ అవకాశాన్నిచ్చే సేవలందిస్తోంది గయాన్ సొల్యూషన్స్. నిజానికి గతంలోనూ రెండుమూడు కంపెనీలు ఈ ప్రయోగం చేశాయి. కానీ అవి మెట్రోపాలిటన్ నగరాల్ని విభజించటమో, లేక పెద్ద పెద్ద ఎంఎస్ఓలను హెడ్స్‌గా తీసుకుని విభజించటమో చేశాయి. అవి కూడా ప్రకటనల వరకే పరిమితమయ్యాయి. కానీ, గయాన్ సొల్యూషన్స్ ‘మాయా ప్లాట్‌ఫామ్’ పేరిట రూపొందించిన టెక్నాలజీతో ప్రాంతీయ, జోనళ్ల వారీగా ప్రసారాలను, ప్రకటనలను కూడా కేంద్ర కార్యాలయం నుంచే పంపిణీ చేయొచ్చంటున్నారు సంస్థ సీఈఓ చంద్రా ఎస్ కొటారు. ఈ స్టార్టప్ వివరాలు ఆయన మాటల్లోనే... న్యూస్ చానళ్లకు ప్రాంతీయ పంపిణీ లేకపోవటం వల్ల స్థానిక ప్రకటనలు టీవీలకు రావటం లేదు. మాయా ప్లాట్‌ఫామ్‌తో ఆ లోటును భర్తీ చేయడమే కాక వార్తలనూ స్థానికంగా ప్రసారం చేసే వీలు కలుగుతుంది. కొన్ని చోట్ల ప్రసారాంశాలను మార్చటం, ప్రసార సమయాన్ని కొన్ని చోట్ల వాయిదా వేయటం, ఏకకాలంలో ఒక్కో చోట ఒక్కో కార్యక్రమం, ప్రకటనలు ప్రసారం చేయటం... ఇవన్నీ మాయా ప్లాట్‌ఫామ్‌తో సాధ్యమే. స్థానిక సమాచారాన్ని సమర్థంగా, విస్తృతంగా అందించేందుకు ఇది తిరుగులేని ప్లాట్‌ఫామ్. దాదాపు రూ.30 కోట్ల పెట్టుబడితో ఆరేళ్ల కిందట గయాన్ సొల్యూషన్స్ ఇండియాను స్థాపించాం. రూ.కోటిన్నర పెడితే చాలు మాయా ప్లాట్‌ఫామ్ సేవల్ని వినియోగించుకోవాలంటే రెండు రకాలున్నాయి. ఒకటి... ప్రకటనల విలువలో 15 శాతం సొమ్మును కంపెనీకి చెల్లించటం. రెండు... ఏకమొత్తంగా రూ.కోటిన్నర పెట్టి మాయా ప్లాట్‌ఫామ్‌ను కొనుక్కోవటం. ఇలా కొనుక్కున్న వారు కేంద్ర కార్యాలయం నుంచే ప్రసారాలను, ప్రకటనలను ప్రాంతాల వారీగా పంపిణీ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం 9 ఎక్స్, ఏబీపీ, మున్సిఫ్, ఇండియన్ న్యూస్, 10 టీవీ మీడియాలు ఈ మాయా ఫ్లాట్‌ఫామ్ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఈటీవీ, టైమ్స్, జీ టీవీతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఆల్ ఇండియా రేడి యోలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమౌతోంది. దీన్ని మాయా ద్వారా అన్ని ప్రాంతీయ భాషల్లో ఏకకాలంలో అందించేందుకు అనుమతి కోసం పీఎంఓతో మాట్లాడుతున్నాం. అద్దెకు చానల్... పుట్టిన రోజు, పెళ్లి రోజని స్థానిక పేజీల్లో ప్రకటనలు చూస్తాం. వాటి వీడియో ప్రసారాలను కూడా చేయటానికి వీలుగా... కారును అద్దెకు తీసుకున్నట్లే న్యూస్ చానల్‌నూ అద్దెకు తీసుకునే సరికొత్త సేవల్ని ప్రారంభిస్తున్నాం. రెంట్ ఏ కేబుల్.ఇన్ సేవలను ఢిల్లీలో ప్రారంభించాం. స్పందన బాగుంది. నెలరోజుల్లో హైదరాబాద్‌లోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాం. గయాన్ టీవీ బ్రాండ్‌తో ఒకో ఆపరేటర్ దగ్గర 20 చానళ్లు అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి సంఖ్యను పెంచుతాం. ఇందుకు ఒక రోజుకు అద్దెగా రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. 10 మిలియన్ డాలర్ల టర్నోవర్... గయాన్ సొల్యూషన్స్ ఇండియాకు ఏటా రూ.60 కోట్ల టర్నోవర్ ఉంది. మాయా ప్లాట్‌ఫామ్‌ను రూపొందించేందుకు రెండేళ్లు పట్టింది. సుమారు 100 మంది ఇంజనీర్లు భాగస్వాములయ్యారు. ఈ ప్లాట్ఫామ్లో మొత్తం 14 పేటెంట్లు తీసుకున్నాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రూ. లక్ష కోట్లకు డిజిటల్ కామర్స్ మార్కెట్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల, ఆన్లైన్ షాపింగ్ వృద్ధి వల్ల డిజిటల్ కామర్స్ మార్కెట్ విలువ ఈ ఏడాది రూ.లక్ష కోట్లను అధిగమించనుంది. గతేడాది 53 శాతం వృద్ధితో రూ.81,525 కోట్లగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ ఈ ఏడాది 33 శాతం వృద్ధితో రూ.లక్ష కోట్లను దాటనుందని ఐఏఎంఏఐ, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్‌లు తమ నివేదికలో తెలిపాయి. ఐఏఎంఏఐ, ఐఎంఆర్బీ ఇంటర్నేషనల్‌ల నివేదిక ప్రకారం, 2010లో రూ.26,263 కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ 2012 నాటికి రూ.47,349 కోట్లకు, 2013కి రూ.53,301 కోట్లకు చేరింది. - డిజిటల్ కామర్స్ మార్కెట్లో ఆన్లైన్ ట్రావెలింగ్ వాటా 61 శాతంగా, ఈ-టెయిలింగ్ వాటా 29.4 శాతంగా (2013 నుంచి 1.4 రెట్లు వృద్ధి) ఉంది. - గతేడాది ఈ-టెయిలింగ్‌లో మొబైల్స్, మొబైల్ పరికరాల వాటా 41%(రూ.9,936 కోట్లు), చేనేత, ఫుట్‌వేర్, వ్యక్తిగత వస్తు ఉత్పత్తుల వాటా 20%(రూ.4,699 కోట్లు)గా ఉంది. వంటగది ఉపకరణాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ 14%(రూ.3,404 కోట్లు) వాటాను ఆక్రమించాయి. - ఆన్లైన్లో షాపర్లలో 45% మంది క్యాష్ ఆన్ డెలివరీ వైపు ఆసక్తి కనబరిస్తే, 21% మంది డెబిట్ కార్డులు, 16% మంది క్రెడిట్ కార్డులు, 10% మం ది నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరిపారు. -
విద్యార్థులను ముంచిన నిర్లక్ష్యం
- తహశీల్దార్ కార్యాలయంలో డిజిటల్ కీ ల్యాప్స్ - రెన్యూవల్ చేయించే విషయాన్ని పట్టించుకోని తహశీల్దార్ - నిలిచిపోయిన ఆన్లైన్ ధ్రువపత్రాల జారీ - వేల సంఖ్యలో ఎదురు చూస్తున్న విద్యార్థులు - 2 రోజుల్లో ముగియనున్న స్కాలర్షిప్, ఫీజు రాయితీ దరఖాస్తు గడువు - 4 రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఒక అధికారి నిర్లక్ష్యం వేలాది విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసింది. ప్రభుత్వం అందించే ఆర్థిక ఆసరా కోల్పోయే పరిస్థితిలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన మీ సేవ ఆన్‌లైన డిజిటల్ కీని సకాలంలో రెన్యూవల్ చేయకపోవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి అది ల్యాప్స్ అయిపోయింది. ఫలితంగా శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం పరిధిలో ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. మీ సేవ డిజిటల్ కీ ఉంటే ధ్రువపత్రాలు జారీ చేయడానికి వీలవుతుంది. దాన్ని సకాలంలో రెన్యూవల్ చేయించాలన్న విషయాన్ని తహశీల్దార్ పట్టించుకోకపోవడంతో దాని కాలపరిమితి ముగిసిపోయింది. దాన్ని పునరుద్ధరించడం జిల్లా అధికారుల చేతుల్లో లేదు. రాజధానిలోని ఈ సేవ సాంకేతిక విభాగం మాత్రమే ఈ పని చేయాలి. దాని కోసం తహశీల్దార్ గానీ, కార్యాలయంలో ఆ బాధ్యతలు చూసే ఉద్యోగి గానీ స్వయంగా హైదరాబాద్ వెళ్లి చేయించాలి. ఇవన్నీ జరగడానికి కనీసం నాలుగు రోజులైనా పడుతుంది. కాగా డిజిటల్ కీ గడువు ముగియడానికి కొద్ది రోజుల ముందు నుంచే ఆ విషయం హెచ్చరిక రూపంలో తెలియజేస్తుంది. రెన్యూవల్ చేయించుకోవాలన్న విషయాన్ని సంబంధిత డేటా ఎంట్రీ ఆపరేటర్ ముందుగానే తహశీల్దార్‌కు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. 30తో గడువు పూర్తి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రియింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30తో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేయాలంటే ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే దరఖాస్తులను అన్లైన్లో మాత్రమే పంపాలి. ఈ పాస్ వెబ్సైట్ మీ సేవ నుంచి ఆన్‌లన్‌లో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువపత్రాలనే తీసుకుంటుంది. మెన్యూవల్గా జారీ చేసే ధ్రువపత్రాలను తీసుకోదు. ఈ పరిస్థితుల్లో మీ సేవ డిజిటల్ కీ ల్యాప్స్ కావడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీకాకుళం పట్టణం, రూరల్ మండలం కలిపి శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం నుంచే ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సుమారు 2500 మంది వీటి కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. వారంతా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిజిటల్ కీ ల్యాప్స్ అయిందని, మూడు నాలుగు రోజుల వరకు ధ్రువపత్రాలు జారీ అయ్యే అవకాశం లేదని, ఆక్కడి సిబ్బంది చెబుతున్నారు. ఈలోగా గడువు ముగిసిపోతుందని, ఈ ఏడాది ఉపకార వేతనం, ఫీజ్ రీయింబర్స్మెంట్ నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గడువు పెంచితే తప్ప విద్యార్థులకు నష్టం జరగడం అనివార్యంగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాలకు ఏం చేస్తాం విషయాన్ని తహశీల్దార్ ఎస్.దిలీప్ చక్రవర్తి వద్ద ప్రస్తావించడగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఏం చేస్తామని సమాధానం చెప్పారు. ఆర్డీవో బి దయానిధి వద్ద ప్రస్తావించగా వీలైనంత వేగంగా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో సంబంధిత సాంకేతిక విభాగం అధికారులతో మాట్లాడి డిజిటల్ కీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
డిజిటల్ రూపంలో హంపీ దేవాలయం
న్యూఢిల్లీ: కర్ణాటకలోని యునెస్కో గుర్తిం చిన ప్రపంచ వారసత్వ కట్టడం హంపీ దేవాలయాన్ని ఇకపై మొబైల్ఫోన్లో డిజిటల్ రూ పంలోనూ దర్శించుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ శిథిలమైన విఠల దేవాల యాన్ని కూడా పూర్వపు స్థితిలో చూడవచ్చు. హంపీ దేవాలయాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగేలా 3డీ చిత్రాలతో డిజి టల్ రూపంలో ఆవిష్కరించినట్లు ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ శంతను చౌదరీ వెల్లడించారు. ఐఐటీలు, ఇతర సంస్థల సాంకేతిక సహకారంతో దీనిని రూపొం దించినట్లు తెలి పారు. మంగళవారం ప్రారంభం కానున్న రెండు రోజుల ‘ఇండియా హ్యాబిటాట్ సెంటర్’ ఎగ్జిబిషన్లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరీ ఈ ‘డిజి టల్ హంపీ’ని ఆవి ష్కరిస్తారని పేర్కొన్నారు. -
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
పెన్షన్ కొనసాగింపు ఇక సులువు ‘జీవన్ ప్రమాణ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ: పదవీవిరమణ చేసి, పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగులకో శుభవార్త. పెన్షన్ కొనసాగింపు కోసం ప్రతీ సంవత్సరం నవంబర్‌లో తాము జీవించే ఉన్నామని ధ్రువీకరించే లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత అధికారులకు అందించాల్సిన అవసరం కానీ.. లేదా స్వయంగా అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం కానీ ఇకపై వారికి లేదు. అందుకు ప్రతిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా తాము జీవించే ఉన్నామని నిర్ధారించి వారు పెన్షన్ సదుపాయాన్ని కొనసాగించవచ్చు. ‘జీవన్ ప్రమాణ్’ అనే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం రూపొందించింది. దీని ప్రకారం పెన్షన్ పొందుతున్న ప్రతీ రిటైర్డ్ ఉద్యోగి.. మొదట తన స్మార్ట్ ఫోన్ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి కానీ తన ఆధార్ నంబర్‌ను, వేలిముద్రలు, కనుపాపలు.. మొదలైన బయోమెట్రిక్ వివరాలను రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఆ పెన్షనర్ పూర్తి వివరాలను సెంట్రల్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తారు. అనంతరం.. అవసరమైనప్పుడు తన దగ్గరున్న బయోమెట్రిక్ యంత్రంపై తన బయోమెట్రిక్ వివరాలను ఆ రిటైర్డ్ ఉద్యోగి నమోదు చేసినప్పుడు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షన్‌ను పంపిణీ చేసే సంస్థ పొందగలుగుతుంది. పెన్షన్‌ను కొనసాగిస్తుంది. దీనివల్ల వృద్ధులైన పెన్షనర్లు ఇంటి దగ్గర్నుంచే పెన్షన్ కొనసాగింపు సదుపాయాన్ని పొందవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్ ఫోన్, లేదా కంప్యూటర్లపై పనిచేసే ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్‌ను పెన్షనర్లందరికీ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. అలాగే, తక్కువ ధరకు బయోమెట్రిక్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. గ్రామీణ, సాంకేతికత అందుబాటులో లేని ప్రాంతాల వారికోసం జాతీయ ఈ గవర్నెన్స్ పథకం కింద నిర్వహిస్తున్న కామన్ సర్వీస్ సెంటర్లలోనూ ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా కోటిమందికి పైగా పెన్షన్ పొందుతున్నారు. -
బెస్ట్ 4 నాల్డెజ్
సంకల్పమనే ఇంధనం రగిలితే.. తపన ప్రజ్వలిస్తే.. ఆశయాలు రెక్కలు తొడిగితే.. ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోతుంది. చేతులే తెడ్లుగా కల్లోల కడలిని కూడా అవలీలగా ఈది పారేస్తుంది. అందుకు ఆ నలుగురే నిదర్శనం. తమ కాన్సెప్ట్ ఫార్ములాకు డిజిటల్ అస్త్రం జోడించి మరీ దూసుకుపోతున్నారు వీరు. ‘వింగ్స్ అండ్ ఓర్స్ డాట్ కామ్’ యూట్యూబ్ చానల్ రూపొందించి ‘డిజిటల్ లెర్నింగ్ ’ పేరుతో ఈ తరానికి కావాల్సిన విజ్ఞానాన్ని అందరికీ చేరుస్తున్నారు. విద్యావేత్తల చర్చలు, శాస్త్రజ్ఞుల ప్రసంగాలు, ఆర్థిక మేధావుల కాన్ఫరెన్స్‌లు కొందరికే పరిమితమవుతున్నాయి. వాటిని అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఓ నలుగురు విద్యార్థుల ఆలోచనే ‘వింగ్స్ అండ్ ఓర్స్ డాట్ కామ్’ యూట్యూబ్ చానల్. గౌత మి చల్లగుల్ల, మణికృష్ణ, శ్రీనివాస్, సాగర్‌వర్మ.. అందరూ పీజీ చేసిన వారే. గౌతమి ఇంజనీరింగ్ పూర్తయ్యాక అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో తిరిగి ఇండియాకి వచ్చారు. ఆమె ఆలోచనకు ఈ ముగ్గురు స్నేహితులు తోడయ్యారు. వీడియోగ్రఫీ ఆయుధంగా డిజిటల్ లెర్నింగ్‌పై దృష్టి సారించారు. ఎక్స్ట్రా నాలెడ్జ్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న మిత్ర చతుష్టయం.. అక్కడి నుంచే ఈ కార్యానికి శ్రీకారం చుట్టింది. వర్సిటీలోని అన్ని డిపార్ట్మెంట్లపై డాక్యుమెంటరీలు రూపొందించి యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసింది. వర్సిటీకి వచ్చే ప్రముఖుల ప్రసంగాలు చిత్రీకరించి.. తమ క్రియేటివిటీతో వాటికి అనుబంధంగా ఇతర అంశాలను జోడించి నిండుదనం తెచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మొదలు యానిమేషన్ వరకూ అన్ని రకాల డిజిటల్ సాఫ్ట్వేర్లను వాడారు. ఆల్ యాంగిల్స్.. యూనివర్సిటీల్లో జరిగే ప్రసంగాలు, కాన్ఫరెన్స్‌లతో మొదలైన వీరి కెమెరా పనితనం.. తర్వాత విభిన్న రంగాలపై ఫోకస్ చేసింది. ఇటీవల బిర్లా ప్లానెటోరియంలో జరిగిన సైన్స్ ఎగ్జిబిట్స్‌పై ప్రత్యేక చిత్రాలు రూపొందించారు. శాస్త్రవేత్తల సలహా సూచనలతో వీడియోలు రూపొందించి చానల్లో పోస్ట్ చేశారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తరఫున ప్రముఖ శాస్త్రవేత్తల బయోగ్రఫీలను లఘు చిత్రాలుగా మలి చారు. సిటీలో జరిగే కొన్ని ప్రత్యేక సమావేశాలను షూట్ చేసి.. వాటికి అదనపు సమాచారాన్ని కూర్చి స్పెషల్ స్టోరీలు రూపొందించారు. ఫ్యూచర్లో అన్ని వర్సిటీల్లో తమ టీం ఉంటుందని చెబుతున్నారు. పేషెంట్ వర్షన్.. మృత్యువుతో పోరాడి బయటపడిన ఓ రోగి అనుభవాలు ఎందరికో ధైర్యాన్నిస్తాయి. అందుకే ఈసారి ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేర్ ఆస్పత్రి సెంటర్లకు వెళ్లి.. దాదాపు 300 మంది రోగులను పలకరించింది. వారిలో వంద మంది ఇంటర్వ్యూలను చిత్రీకరించింది. ఈ వీడియోలు కేర్ ఆస్పత్రి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ‘రోగుల ద్వారా జబ్బులపై అవగాహన కల్పించాలని ఈ ప్రాజెక్ట్ చేపట్టాం’ అని చెబుతారు ఆ నలుగురు. షార్ట్ అండ్ షార్ప్ డిజిటల్ లెర్నింగ్ పేరుతో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ఫిల్మ్‌లే కాదు.. అప్పుడప్పుడూ ఇతర అంశాలపైనా షార్ట్‌ఫిల్మ్‌లు తీసి శభాష్ అనిపించుకుంటుంది ఈ టీమ్. చెన్నైలో నటి రేవతి నేతృత్వంలోని ‘ఎబిలిటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వీళ్లు పంపిన లఘుచిత్రం ‘మై బ్రదర్ నవనీత్’ నేషనల్ అవార్డ్ సాధించింది. ఆల్ ఇండియా లెవల్లో ఈ పొట్టి చిత్రం రెండో బహుమతి పొందింది. ‘ఈ చిత్రాన్ని ఎంపిక చేసిన జ్యూరీలో డెరైక్టర్ మణిరత్నం కూడా ఉన్నారు. అది తలుచుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది’ అని అంటుంది గౌతమి అండ్ కో. వీడియోల ద్వారా విజ్ఞానాన్ని సరికొత్తగా అందిస్తున్న వీరికి మనం కూడా హ్యాట్సాఫ్ చెబుదాం. - భువనేశ్వరి ఫొటో: ఎన్.రాజే ష్‌రెడ్డి -
అభిమానులకు బిగ్ బీ బర్త్ డే కానుక
న్యూఢిల్లీ: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తన 72వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నారు. శనివారం బర్త్ డే చేసుకోబోతున్న అమితాబ్ అభిమానుల కోసం వీడియో మెసేజ్, సంతకం చేసిన డిజిటల్ పోస్టర్లు పంపనున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ ఇందుకోసం ట్విట్టర్, డిజిటల్ మీడియా నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనున్నారు. ట్విట్టర్లో అమితాబ్‌ను ఫాలో అయ్యే అభిమానులు బుధవారం నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవచ్చు. వీరికి సంతకం చేసిన డిజిటల్ ఫొటోలు పంపుతారు. అభిమానుల్లో ఒకరికి అమితాబ్ వ్యక్తిగత వీడియో మెసేజ్ పంపుతారు. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమితమైన ప్రేమ చూపుతుంటారని అమితాబ్ అన్నారు. ఈ సారి సోషల్ మీడియా ద్వారా అభిమానులను ప్రత్యేకంగా పలకరిస్తానని అమితాబ్ చెప్పారు. -
సిటీజన్స్ స్క్రీన్ జంకీస్
గ్రేటర్లో సగం మంది రోజుకు ఎనిమిది గంటలపాటు డిజిటల్ స్క్రీన్లకు అతుక్కు పోతారట. ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్, మొబైల్ వీటిల్లో ఏదో ఒక తెరతో కుస్తీపడుతూ... కళ్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తాజా ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే... ఈ విషయంలో మన సిటీ ముంబైతో పోటీపడుతోంది. ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ టైటాన్ ఐవేర్ డివిజన్ ఆన్లైన్లో నిర్వహించిన ‘స్క్రీన్ జంకీ పోల్’లో పలు మెట్రో నగరాలకు చెందిన వెయ్యిమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలిపారు. జాతీయ స్థాయిలో మొత్తంగా 41 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్ల వంటివి వినియోగిస్తున్నట్టు తేలింది. సర్వేలో మరికొన్ని ఆసక్తికర విషయాలు... ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్, టీవీ, ట్యాబ్లెట్ వంటి విభిన్న రకాల తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో కేవలం 11 శాతం మాత్రమే ఉన్నట్లు తేలింది. వారాంతంలో మాత్రం ఇది 41 శాతానికి చేరుకోవడం విశేషం. ఇందులో ట్యాబ్లెట్స్ వినియోగించే వారే అధికం. - ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోవాసుల్లో 25 శాతం మంది మాత్రం రోజులో ఎక్కువ గంటలు టీవీని వీక్షించి కాలక్షేపం చేస్తున్నారు. - ఇక వీకెండ్లో డిజిటల్ తెరలను వీక్షిస్తున్న వారు ఢిల్లీలో 41 శాతం, అహ్మదాబాద్‌లో 68 శాతం, లక్నోలో 64 శాతం మంది. - భువనేశ్వర్‌లో 47 శాతం మంది మొబైల్స్, స్మార్ట ఫోన్లు వినియోగిస్తున్నారు. - లక్నోలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు వినియోగించేందుకు 50 శాతం మంది మక్కువ చూపుతున్నారు. - ట్యాబ్లెట్స్ వినియోగంలో దేశరాజధాని ఢిల్లీ వాసులు టాప్‌లో ఉన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న వారిలో 7 శాతం మంది ట్యాబ్లెట్స్‌పై మనసు పారేసుకోవడం విశేషం. అతిగా వాడితే కళ్లకు చేటే.. గంటల తరబడి ఆయా తెరలతో కుస్తీపడుతున్న వాళ్లకు కళ్లకు సంబంధించిన సమస్యలు తప్పవని కంటి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తెరలపై పనిచేయాల్సి వచ్చినపుడు,వీక్షిస్తున్నప్పుడు కళ్లకు చేటు చేయని నాణ్యమైన కళ్లజోళ్లు ధరించాలని సూచిస్తున్నారు. తరచూ కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. -
హస్తం.. హడావుడి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌లో విజయాలను సాధించే దిశగా తలపెట్టిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించి కొత్తవ్యూహాల రచనే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించారు. దేశంలోనే మొదటగా రాష్ట్రంలో సదస్సు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా భావించి సదస్సును విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేసింది. పార్టీ ఓటమి పాలవ్వడంతో శ్రేణుల్లో నిరుత్సాహం ఉన్నప్పటికీ.. సదస్సుకు భారీగా తరలిరావడం, హడావుడి వాతావరణం కన్పించడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కాగా కొత్తగా తలపెట్టిన ఈ తరహా సదస్సులో ప్రధాన నేతలు మినహా.. ఇతర కీలక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులకు, ఇతర కార్యకర్తలకు ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు. దీంతో సభానంతరం పలువురు నేతలు పెదవి విరిచారు. జట్లుగా విడగొట్టి.. అభిప్రాయాలు సేకరించి.. ప్రధాన నేతల ప్రసంగం అనంతరం సదస్సుకు వచ్చిన శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పార్టీ కొత్త వ్యూహాన్ని రచించింది. సామాజిక అంశాలవారీగా పది బృందాలను ఏర్పాటు చేసి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను ఆయా బృందాలకు బాధ్యులుగా నియమించారు. సదస్సుకు వచ్చిన కార్యకర్తలు వారి మనోభావాలను ఆయా బృందాల వద్ద వ్యక్తపర్చే అవకాశం ఇచ్చారు. ఈ పది బృందాలను సదస్సు జరిగిన ఆవరణలోనే ఇతర బ్లాకుల్లో వినతులు, అభిప్రాయాలు స్వీకరించే ఏర్పాటు చేశారు. దీంతో ఆయా బృందాల వద్దకు కార్యకర్తలు వెళ్లి వారి ఆలోచనలు, సూచనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జెండా రెపరెపలు.. ఇబ్రహీంపట్నం మండలంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సదస్సుకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. సదస్సు జరిగే ప్రాంతమంతా కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. సాగర్ రింగురోడ్డు నుంచి సదస్సు ప్రధాన ద్వారం వరకు పలువురు నాయకులతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిజిటల్ స్క్రీన్లు.. భవిష్యత్ కార్యాచరణ సదస్సు ప్రాంగణం భారీగా ఉండడం.. పెద్ద సంఖ్యలో నాయకగణం హాజరుకావడంతో పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభావేదికలో ఉన్న పెద్దలు.. ప్రసంగించే నాయకులు స్పష్టంగా కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా నేతల ప్రసంగాలను తిలకించారు. ప్రసంగం ప్రారంభం, ముగింపు సమయంలో కరతాలధ్వనులతో సందడి చేశారు. కాగా ఈసదస్సులో జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరెడ్డి, పీసీసీ సీనియర్ నేత ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక సదస్సు రెండవరోజు సోమవారం కూడా కొనసాగుతుంది. ఈసందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. -
చిన్న సినిమాలను బతికించుకుందాం
శాటిలైట్ సంస్థల సహకారం అవసరం షరతులను వెనక్కి తీసుకోవాలి తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం నేతల వినతి వెంగళరావునగర్: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్న సినిమాలను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ సినిమా ప్రొటెక్షన్ ఫోరం నేతలు తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్లోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో గల ఫోరం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడారు. పలు శాటిలైట్ సంస్థలు విధిస్తున్న డిమాండ్లతో చిన్న సినిమాలు ఆడే పరిస్థితులు లేవన్నారు. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని బీ, సీ సెంటర్లు ఇటీవల కాలంలో మూతబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సంస్థల డిమాండ్ల కారణంగా చిన్న సినిమాలు తీసుకుంటే బడ్జెట్ పెరిగిపోతుండటంతో ఆడించలేక పలు థియేటర్లను సైతం కూల్చివేస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్ స్క్రీనింగ్ ప్రొజెక్షన్ యూఎఫ్ఓ, క్యూబ్, పీఎక్స్‌డీ సర్వీసులను వెంటనే తగ్గించాలన్నారు. 28 షోలకు సంబంధించిన నగదును సినిమా ప్రదర్శనకు ముందే చెల్లిస్తున్నా ఆ షోలన్నీ ప్రదర్శించనపుడు వారాల ప్రకారం ఏర్పాటు చేసుకున్న చార్జీలనే ప్రదర్శించిన షోలకు తీసుకోవాలని, మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని వారు కోరారు. ఒకవేళ ఆ నగదును డిస్ట్రిబ్యూటర్‌కు తిరిగి చెల్లించలేకపోతే మరో సినిమాకైనా సర్దుబాటు చేయాలని సూచించారు. కొత్త సినిమాను కనీసం 15 సెంటర్లలో రిలీజ్ చేయాలని క్యూబ్ సంస్థ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యలపై వచ్చే నెల రెండో తేదీన ఏపీ ఫిలిం చాంబర్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. చాంబర్ నేతలు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఫోరం నేతలు ఇన్నారెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణరాము, లింగంగౌడ్, గణేశ్, వెంకటేశ్వర రావు, సజ్జు తదితరులు పాల్గొన్నారు. -
పాలసీ పత్రాలు ఈ-రిపాజిటరీలో పదిలం
మూడేళ్లకోసారి రూ.75 వేల చొప్పున 15 ఏళ్లపాటు ఆదాయమొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని మూర్తి గారు తీసుకున్నారు. తొలి విడత సొమ్ము మామూలుగానే చేతికి అందింది. పాలసీకి సంబంధించిన కీలక పత్రాలను పోగొట్టుకోవడంతో రెండో విడత డబ్బు తీసుకోవడం కష్టమైంది. అతికష్టమ్మీద, ఏడాది తర్వాత ఆ డబ్బు అందింది. దానికోసం ఆయన నానా కష్టాలు పడాల్సి వచ్చింది. క్లెయిమ్‌లను పరిష్కరించుకోవాలన్నా, చెల్లింపులు తీసుకోవాలన్నా పాలసీ డాక్యుమెంట్లన్నీ భద్రంగా ఉంచడం, బీమా కంపెనీలు కోరినపుడు వాటిని సమర్పించడం అత్యవసరం. వీటిలో ఏ డాక్యుమెంటు మిస్సయినా ఆ పెట్టుబడి అంతా నిష్ఫలంగా మారే అవకాశముంది. అదృష్టవశాత్తూ, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఈ-రిపాజిటరీలను బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏ గతేడాది ప్రారంభించింది. ఈ-రిపాజిటరీ ఏమిటంటే... ఖాతాదారులు తమ పాలసీ వివరాలను డిజిటల్ ఫార్మాట్లో భద్రపర్చుకునే సౌకర్యమే ఇ-రిపాజిటరీ. వివిధ బీమా కంపెనీలకు చెందిన పాలసీ డాక్యుమెంట్లను ఒకే ఈ-అకౌంట్లో దాచుకోవచ్చు. అంటే, మీకు హెల్త్ పాలసీ ఒక కంపెనీది, జీవిత బీమా మరో కంపెనీది ఉన్నా ఒకే అకౌంట్లో ఆ వివరాలు భద్రపర్చవచ్చు. క్లెయిమ్ సమయంలో పాలసీదారుడైనా, కంపెనీ అయినా ఒకే క్లిక్‌తో పాలసీ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట. ఈ-కేవైసీ ద్వారా బీమా కంపెనీల సేవలు వేగవంతం కావడంతో పాటు డాక్యుమెంట్ ఫోర్జరీలను, పాలసీదారుల గుర్తింపులో మోసాలను నివారించవచ్చు. డాక్యుమెంట్ల కోసం పాలసీదారును అడగాల్సిన అవసరం లేకుండానే బీమా కంపెనీలు కేవైసీ తనిఖీల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని పొందగలుగుతాయి. ఈ-రిపాజిటరీల ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్లను దాచడానికి స్టోరేజీ అవసరం ఉండదు. అంతా ఉచితమే... బీమా కస్టమర్లందరికీ ఈ-రిపాజిటరీ సేవలను ఉచితంగా అందిస్తారు. యూఐఏడీఐలో నమోదు చేసుకుని, ఆధార్ కార్డు ఉన్న వారందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. బీమా కంపెనీలకు ఈ-రిపాజిటరీ ఏజెంట్లుగా వ్యవహరించడానికి ఐదు కంపెనీలను ఐఆర్డీఏ ఎంపిక చేసింది. ఖాతాదారులు తమకు నచ్చిన కంపెనీకి తమ పాలసీల వివరాలను అందిస్తే సరిపోతుంది. తర్వాత, వాస్తవ కాలానుగుణంగా ఈ డేటాను సదరు కంపెనీ అప్డేట్ చేస్తుంటుంది. ఒక్కో ఖాతాదారునికి ఒక్కో లింక్‌ను కంపెనీ ఇస్తుంది. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే చాలు, తర్వాతి ప్రీమియం చెల్లించాల్సిన తేదీ, ఫండ్ విలువ, మెచ్యూరిటీ డేట్ మొదలైన వివరాలన్నీ కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి. పాలసీదారులకు ఏవైనా సందేహాలుంటే బీమా సంస్థ, ఏజెన్సీ కంపెనీ సమాధానమిస్తాయి. పాలసీల డీమెటీరియలైజేషన్ పుణ్యమా అని బీమా కంపెనీల సేవా ప్రమాణాలు మెరుగవుతాయి. నిర్దిష్ట బీమా అవసరాలు కలిగిన ఖాతాదారులను గుర్తించడం బీమా కంపెనీలకు సులభమవుతుంది. స్నేహిల్ గంభీర్ సీఓఓ, అవీవా లైఫ్ ఇన్సూరెన్స్