హైదరాబాద్లో డిజిటల్ గార్డియన్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డేటా ప్రొటెక్షన్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన డిజిటల్ గార్డియన్ భారత్‌లో తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీకి ఇది 7వ కేంద్రం. సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైస్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సిస్టమ్స్ మేనేజ్‌మెంట్ ఇన్నోవేషన్‌పై ఈ సెంటర్ దృష్టిసారిస్తుందని కంపెనీ తెలిపింది. డ్యూపాంట్, జీఈ వంటి కంపెనీలు ఈ సంస్థకు క్లయింట్లుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ గార్డియన్‌కు 350 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో హైదరాబాద్ కేంద్రంలో 150 మందిని నియమించుకోనుంది.