హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం | Readywhere office in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం

Published Tue, Sep 22 2015 2:17 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం - Sakshi

హైదరాబాద్‌లో రీడ్‌వేర్ కార్యాలయం

హైదరాబాద్: భారత్‌లో అతి పెద్ద డిజిటల్ పబ్లికేషన్స్ ప్లాట్‌ఫామ్‌అయిన రీడ్‌వేర్‌డాట్‌కామ్‌ను నిర్వహించే మీడియాలజీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇటీవలే హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుర్గావ్‌లో ప్రధాన కార్యాలయం ఉందని, దీని తర్వాత వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి కార్యాలయం ఇదేనని మీడియాలజీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ వ్యాప్తంగా ప్రముఖ వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, కామిక్స్, ఇతర పుస్తక ప్రచురణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని మీడియాలజీ వ్యవస్థాపకులు గౌరవ్ భట్నాగర్  పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ.. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తమకు మంచి రీడర్‌షిప్ ఉందని తెలిపారు.  మొబైల్ సీఎంఎస్ సొల్యూషన్‌తో మొబైల్ వినియోగదారులకు సమర్థవంతంగా  కనెక్ట్ కాగలమని మీడియాలజీ సీఈఓ, డెరైక్టర్ మనీష్ థింగ్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement