
ఆధార్ సమర్పణకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఆధార్ సమర్పించాల్సిన తుది గడువును ఉద్యోగ భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) మరో నెల రోజులు పొడిగించింది. ఈనెల 30లోగా తమ ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
అంతేకాకుండా పెన్షన్ ఖాతాలను ఆధార్‌కు అనుసంధానించేందుకు వీలుగా దాదాపు 50 లక్షల మంది పెన్షనర్లు తమ ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల’ను ఈనెల 30లోపు సమర్పించాలని గడువు విధించింది. ఈ సర్టిఫికెట్లను బ్యాంకుల ద్వారా భౌతికంగా స్వీకరించే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు పేర్కొంది. ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల’ను తమ మొబైల్ ఫోన్లు, కామన్ సర్వీస్ సెంటర్లు, లేదా ఈ సేవలను అందించే బ్యాంకు శాఖల ద్వారా సమర్పించాల్సి ఉంటుందంది.