సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ పురస్కారాన్ని అందుకున్నారు. సర్టిపోర్ట్ సంస్థ అంతర్జాతీయ విక్రయాల విభాగం ఉపాధ్యక్షుడు జాన్‌డే చేతుల మీదుగా ఆదివారం బేగంపేటలోని తన నివాసంలో కేటీఆర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జాన్ డే మాట్లాడుతూ హైదరాబాద్ నగర వెలుగులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఈ పురస్కారానికి కేటీఆర్ అన్ని విధాలుగా అర్హులని అన్నారు. ఈ వివరాలను కేటీఆర్ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడానికి ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు సర్టిపోర్ట్ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నది. నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ఏర్పాటుతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేందుకు క్రియాశీల పాత్ర పోషించిన కేటీఆర్ కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇండియా కార్యక్రమ అమలుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపింది. నైపుణ్యాభివృద్ధి కోసం డిజిటల్ తెలంగాణ, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ వంటి కార్యక్రమాలను ఆయన చేపట్టారు.
మంత్రి కేటీఆర్‌కు డిజిటల్ లిటరసీ పురస్కారం
Published Mon, Oct 3 2016 2:35 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM
Advertisement
Advertisement