డిజిటల్ లిటరసీపై ప్రత్యేక దృష్టి
Published Fri, Dec 9 2016 11:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): డిజిటల్లిటరీసీపై ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకు అధికారులకు జిల్లా కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ సూచించారు. ప్రతి గ్రామాన్ని ఈ నెల 25లోగా డిజిటల్ లిటరసీగా మార్చాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సమావేశ మందిరంలో సిండికేట్ బ్యాంకు, ఆంధ్రబ్యాంకుల బ్రాంచీ మేనేజర్లు, బ్యాంకుల ఇన్‌చార్జి అధికారులకు వేర్వేరుగా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రధానంగా 7 బ్యాంకులే జిల్లాలో కీలకంగా ఉన్నాయన్నారు. ఈ బ్యాంకులు తమ పరిధిలోని గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహారావు, సీపీఓ ఆనంద్‌నాయక్, ఆంధ్రబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement