వచ్చే నెలలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు ప్రారంభం | ntr houses starts in next month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు ప్రారంభం

Published Sat, Oct 22 2016 1:22 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

ntr houses starts in next month

కర్నూలు సిటీ: వచ్చే నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పనులు ప్రారంభించాలని ఆ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ విజయమోహన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా ఎన్‌టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద 10,600 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వచ్చే నెల మొదటి వారంలో 1,300, రెండో వారంలో 2,600, మూడో వారంలో 4 వేలు, నాల్గో వారంలో 2,700 గృహ నిర్మాణాలను ప్రారంభించాలన్నారు. వీటిలో ఇప్పటి వరకు 3,437 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద చేపట్టిన  నిర్మాణాలలో ఆదోని, కర్నూలు ఈఈలు వెనుకంజలో ఉన్నారన్నారు. సమావేశంలో పీడీ రాజశేఖర్, ఈఈలు పద్మనాభం, కె.ఎస్‌ ప్రసాద్‌ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement