ntr houses
-
ఇది నారా దేవాన్ష్ కాలనీ..
సాక్షి, అమరావతిబ్యూరో : ప్రభుత్వ సొమ్ముతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీకి సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ అధికారులెవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. గ్రామస్తులు మాత్రం సొమ్మొకరిది.. సోకొకరిది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆ గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కొందరు ఎన్ఆర్ఐలు తమ వంతు సాయం అందించగా.. ఆ పనులు కూడా తామే చేపట్టామని సీఎం కుటుంబసభ్యులు పేర్కొంటుండటం విశేషం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 2015 సెప్టెంబరులో దత్తత తీసుకున్నారు. ఈ గ్రామ జనాభా సుమారు 2,200. ఎన్టీఆర్ భార్య బసవరామతారకం ఈ గ్రామంలోనే జన్మించారు. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించి దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా ఆమె గ్రామాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ఆ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధులతోపాటు గ్రామస్తులు వితరణ ఇచ్చిన డబ్బును కలుపుకుని అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధి అంతా ఆమె చలువే అంటూ.. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత.. ప్రభుత్వ నిధులతోపాటు పామర్రు జెడ్పీటీసీ దంపతుల సొంత నిధులు కలుపుకుని ఆ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించారు. రైతుల కోసం గ్రామంలో ఉన్న డొంకరోడ్లను జేఎస్పీ రహదారులుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం రూ. 45.50 లక్షలు మంజూరు చేసింది. అలాగే భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. 4.40 కోట్లు, అంతర్గత సిమెంటు రోడ్లకు రూ. 2.06 కోట్లు, 1.7 కిలోమీటర్ల పొడవున్న జిల్లా పరిషత్ రోడ్డును సిమెంటురోడ్డుగా మార్చేందుకు రూ. 1.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గ్రామంలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి దేవదాయ శాఖ రూ. 38 లక్షలు మంజూరు చేసింది. అలాగే గ్రామస్తులు మరో రూ. 15 లక్షలు వితరణ ఇచ్చారు. ఇలా.. పంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ. 25 లక్షలు కూడా ప్రభుత్వ నిధులే కావడం విశేషం. అయితే గ్రామంలో ఈ అభివృద్ధి అంతా నారా భువనేశ్వరి వల్లే జరిగిందని ఆమె బంధువులు, అధికారపార్టీ నాయకులు చెప్పుకోవడాన్ని చూసి గ్రామస్తులు విస్తుపోతున్నారు. హౌసింగ్ కాలనీకి దేవాన్ష్ పేరు.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద కొమరవోలు గ్రామానికి గృహనిర్మాణ శాఖ అధికారులు 250 పక్కా గృహాలు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికీ ప్రభుత్వం 1.50 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామంలో చేపట్టిన 150 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో ఒకే చోట 54 ఇళ్లను ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వ నిధులకు అదనంగా లబ్ధిదారులు కూడా కొంత మొత్తం జమ చేసి వాటిని నిర్మించుకోవడం జరిగింది. తమ సొంత నిధులు రూపాయి కూడా వెచ్చించకుండా సీఎం దంపతులు ఆ కాలనీకి తమ ముద్దుల మనవడు దేవాన్ష్ పేరు పెట్టేశారు. ప్రభుత్వ నిధులకు తోడుగా ఎవరైనా దాతలు తమ వంతు సాయం చేస్తే.. వారు కోరినట్లుగా కాలనీలకు గాని, భవనాలకు గాని పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని.. ఈ కాలనీ నిర్మాణం కేవలం ప్రభుత్వ నిధులతో జరిగిందని.. దానికి పథకం పేరు తప్ప వేరే పేరు పెట్టడానికి వీల్లేదని గృహనిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
ఉన్నది పోయే.. సొంతిల్లు రాదాయే..
పేదోడి సొంతింటి కల కలగానే మిగలనుంది. నిర్మాణాలు మొదలు పెట్టి నాలుగు నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుని ఖాతాలో జమకాలేదు.అప్పుతెచ్చి నిర్మాణాన్ని మొదలు పెట్టిన వారు అధికారులచుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రయోజనం లేదు. ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలోని 9 మున్సిపాలిటీల పరిధిలో 2 సెంట్ల సొంత స్థలం ఉన్న వారికి ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం 2017–18 ఏడాదికి 9241 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిల్లో 7894 మంది లబ్ధిదారులకు ఐడీ నంబర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న గృహాలు 3021. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.50 లక్షల సబ్సిడీ, రూ.75 వేలు బ్యాంకు రుణం, రూ.25 వేలు లబ్దిదారుని వాటా కింద రూ.3.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారుని సొంత ఖాతాలో జమచేస్తారని తెలిపారు. ప్రభుత్వం హౌసింగ్‌శాఖ అధికారులను ఒత్తిడి చేయడంతో ఉన్న ఇంటిని తొలగించుకొని ఇంటి పనులను మొదలు పెట్టారు. బిల్లులు త్వరగా వస్తాయన్న నమ్మకంతో అప్పు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొందరేమో డబ్బు లేక పనులు ఎక్కడికక్కడ నిలబెట్టారు. అధికారపార్టీ నేతలు శంకుస్థాపనలకే పరిమితం అధికార పార్టీ నేతలు శంకుస్థాపన మహోత్సవం పేరిట కార్యక్రమాల్లో పాల్గొని ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణ మంజూరు పత్రాన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చినట్లు డప్పు కొట్టుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ దశల్లో పూర్తయిన వాటికి చెల్లించాల్సిన మొత్తం రూ.1083.61లక్షలు. ఒక్క ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రూ.2.76కోట్లు రావాల్సిఉంది. పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలు ప్రభుత్వం గృహాల బిల్లులు మంజూరు చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల స్టీల్ ధరలు జనవరి నెలకు ఇప్పటికి టన్నుకు రూ.13వేలు పెరిగాయి. ఇసుక ట్రాక్టర్ రూ.2,800లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇసుక క్వారీలన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో ఉన్నాయి. దీంతో పేదలకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. సిమెంటు ఇటుకలు వెయ్యి రూ.3,300 నుంచి రూ.4,500లకు పెరిగాయి. సిమెంట్ బస్తా ధర రూ.70 పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.2.50 లక్షల సబ్సిడీతోనే ఇళ్లు నిర్మించు కోవడం సాధ్యం కావడంలేదు. ప్రభుత్వం మొత్తం ఒక్కో ఇంటికి రూ.3.50 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందులో రూ.2.50 లక్షలు సబ్సిడీ పోను లబ్ధిదారుడి వాటాగా రూ.25 వేలు పెట్టుకుంటే రూ. 75 వేలు బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తానన్న ప్రభుత్వం చెప్పింది. రూ.75 వేలు రుణం కావాలంటే లబ్ధిదారుడు తన ఇంటిని మార్టుగేజ్ చేయించి తీసుకోవాలని ఇప్పుడు మాట మార్చింది. దీంతో ఆ డబ్బు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. నిర్మాణాన్ని నిలిపేశాం పునాదుల వరకు వేసి పనులు నిలిపేశాం. ఇప్పటి వరకు ఒక్క బిల్లు ఇవ్వలేదు. బాడుగ ఇంటిలో ఉండి చేనేత పనులు చేసుకుంటున్నాం. బిల్లులు వేయకుండా మాతో పనులు ఎందుకు మొదలు పెట్టించారు. – షేక్ ఖాజా, రామేశ్వరం, ప్రొద్దుటూరు. ఎందుకు ఒత్తిడి తెచ్చారు.. ఉన్న కొట్టంలో బాడుగ లేకుండా కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాం. ఇళ్లు వచ్చింది..పనులు మొదలు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేశారు. రూ.1.50 లక్షలు అప్పుతెచ్చి పునాదులు వేశాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. బాడుగ ఇంటిలో ఉంటున్నాను. పని చేసుకొని జీవనం సాగించే పరిస్థితిలో అప్పునకు వడీ ఎలా చెల్లించాలి. – వంకా రామయ్య, 27వ వార్డు రామేశ్వరం డీఈ ఏమంటున్నారంటే... ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టిన వారికి బిల్లులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలకు రూ.2.70 కోట్ల బిల్లులు రావాలి. అన్ని దశలకు సంబంధించి గృహాల జియోట్యాగ్ చేసి ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపాం. త్వరలో బిల్లులు వస్తాయి. – సుందరరాజు, హౌసింగ్ డీఈ, ప్రొద్దుటూరు -
ఇళ్ల మంజూరులో దోబూచులాట
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో దోబూచులాట ఆడుతోంది. సొంతింటి కలను కల్లలుగా చేస్తూ ప్రజలను అయోమయంలో పడే విధంగా ప్రభుత్వం ఎన్నికల వ్యూహాన్ని రచించినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ‘అందరికీ ఇళ్ల పథకం’ ప్రవేశపెట్టాయి. ఇందులో కొంత భా గం కేంద్ర ప్రభుత్వం, మరికొంత భా గం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రుణాన్ని లబ్ధిదారుడు కట్టుకునే విధంగా చేశారు. అయితే ఇళ్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసాధికారిక సర్వేను అనుసంధానం చేసింది. ఈ క్రమంలో టిడ్కో సంస్థ ప్రజాసాధికార సర్వేను ఆధారంగా చేసుకుని పాలకులు ఇళ్లు మం జూ రు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమా రు 2,750 దరఖాస్తులు రిజెక్ట్ అయ్యా యి. దీంతో ప్రజాసాధికార సర్వేలో ఏ విషయాలను ఆధారం చేసుకుని రిజెక్ట్ చేస్తున్నారనేది అటు ప్రజలకు, అధి కా రులకు కానీ స్పష్టత లేకుండాపోతోం ది. దరఖాస్తులు రిజెక్ట్ అయిన విష యం బయటకు రాకుండా కార్పొరేషన్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, మరోప్రాంతం (ఇంకా స్థలం పరిశీలిస్తున్నారు)లో అందరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం ఇళ్లను నిర్మించనుంది. వెంకటేశ్వరపురం 4,800, అల్లీపురం, అక్కచెరువుపాడులో 20,200, మరో స్థలంలో 10,240 ఇళ్లు నిర్మాణాలు చేపట్టనుంది. మొత్తం 35,240 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఆయా ఇళ్లకు 50వేలకు పైగా దరఖాస్తులు కార్పొరేషన్‌కు చేరాయి. ఇప్పటికే వెంకటేశ్వరపురంలో 4,800 ఇళ్లు మంజూరు చేయగా ఇక్కడ 2,050మంది దరఖాస్తులదారులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే మంజూరు చేసిన మరో 2,750 దరఖాస్తులు రిజెక్ట్ అయినట్లు కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. ప్రజాసాధికారిక సర్వేను అనుసంధానం చేయడంతోనే రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. తప్పులతడకగా సర్వే 2016వ సంవత్సరంలో కార్పొరేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజాసాధికార సర్వేను చేపట్టారు. మొత్తం 1.50లక్షలు కుటుంబాలు ఉండగా కేవలం 44వేలమంది మాత్రమే పేదలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వేలో రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, లైసెన్స్‌లు, టీవీలు, ఫ్రిజ్‌ల వివరాలను నమోదు చేశారు. ఈ వివరాలను ఆధారంగా అందరికీ ఇళ్ల పథకంలో ఇళ్లు కేటాయిస్తున్నారు. ఈ సర్వేను గతంలో సిబ్బంది తప్పులతడకగా చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. కొందరు సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు నమోదు చేశారు. సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2,750 దరఖాస్తుల రిజెక్ట్ ప్రజాసాధికార సర్వేను అనుసంధానం చేస్తూ టిడ్కో సంస్థ అందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ప్రజాసాధికార సర్వేలో కొన్ని లోపాల కారణంగా వెంకటేశ్వరపురంలోని ఇళ్లకు ముందుగా ఎంపికైన 2,7 50 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. దరఖాస్తుదారుడి ఇంటికి కరెంట్బిల్లు రూ. 500 మించినా, 150సీసీలకు మించి బైక్ కలిగి ఉన్నా, కారు ఉన్నా, రేషన్‌కా ర్డులోని సభ్యుల్లో ఎవరికైనా ఇల్లు కానీ, స్థలం కానీ ఉన్నా అందరికీ ఇళ్లు పథకంలో అనర్హుడిగా చేస్తున్నట్లు తెలుస్తో ంది. ప్రజాసాధికార సర్వేను అనుసంధానం చేస్తూ ఇళ్లు మంజూరు చేయడం పేదలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రిజెక్టైన ఇంటి దరఖాస్తులను పరిశీలిస్తున్నాం అందరికీ ఇళ్లు పథకం కింద ధరఖాస్తు చేసుకున్న కొన్ని ఫైల్స్ రిజక్ట్ అయ్యాయి. ఎందుకు రిజక్ట్ అయ్యాయనే దానిపై దరఖాస్తులను పునఃపరిశీలిస్తాం. లబ్ధిదారులకు ఇళ్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం. –అలీంబాషా, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ -
15 నెలల్లో 10 వేల ఇళ్ల నిర్మాణం
- జగన్నాథగట్టుపై స్థలం ఎంపిక - ఈనెల 17న టెండర్ల ప్రక్రియ - వచ్చే సంక్రాంతికి 5 వేల ఇళ్లు ప్రారంభానికి చర్యలు - శాశ్వతంగా మంచినీటి సమస్యకు పరిష్కారం - కర్నూలులో పురపాలక మంత్రి నారాయణ విస్రృత పర్యటన కర్నూలు(టౌన్): ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కర్నూలు నగర శివారులో వచ్చే 15 నెలల్లో 10 వేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. హౌసింగ్ ఫర్ ఆల్, మంచినీటి సమస్యను స్వయంగా పరిశీలించేందుకు మంత్రి శనివారం కర్నూలుకు వచ్చారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న మంత్రిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్, జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. కొద్దిసేపు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ గురించి చర్చించారు. శివారు ప్రాంతాల పరిశీలన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు నగర శివారులోని పలు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, అర్బన్ హౌసింగ్ అధికారులు ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఈ నాగరాజు, కేజే రెడ్డి, నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు ఉన్నారు. ముందుగా స్థానిక జొహరాపురం డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అలాగే టీవీ 9 కాలనీ, రాగమయూరి హిల్స్, జగన్నాథగట్టు, తడకనపల్లె, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు ప్రాంతాలను పరిశీలించారు. వీటన్నింటిని పరిశీలించిన తరువాత స్థానిక నగరపాలక సంస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చర్చించారు. చివరకు జగన్నాథగట్టుపై స్థలాన్ని ఖరారు చేశారు. మంత్రిని కలసిన జేసీ: కర్నూలు నగరంలో మంత్రి పర్యటిస్తున్నట్లు తెలుసుకున్న అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి స్థానిక నగరపాలకలో మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాదు వెళ్తున్న ఆయన మంత్రి ఉన్నట్లు తెలియడంతో పది నిముషాలు కలసి వెళ్లిపోయారు. అనంతరం నగరపాలక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో ఆధునిక టెక్నాలజీ: మంత్రి నారాయణ పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత టెక్నాలజీని ఉపయోగించి ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక జగన్నాథగట్టు వద్ద 100 ఎకరాల్లో అందరికీ ఇళ్లు స్కీమ్‌కు సంబంధించి ఈనెల 17 టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వేగవంతంగా పనులు చేపడతామన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి 5 వేల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు జాప్యం చేస్తే ఫెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణాలకు వినియోగించే స్టీల్, వెర్టిఫైడ్ ఫ్లోరింగ్, కలపతో తయారు చేసిన తలుపులు, కిటికీలు వినియోగిస్తామన్నారు. కర్నూలు నగర ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముచ్చుమర్రి స్కీమ్ ద్వారా నేరుగా మంచినీటి తరలించేందుకు ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం వ్యక్తం చేశారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 10 కోట్లు మంజూరు చేశారన్నారు. సమావేశంలో నగరపాలక అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
మార్చి 31 నాటికి ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు పూర్తి
– రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేకాధికారి మల్లికార్జునరావు కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు మార్చి 31వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి మల్లికార్జురావు కోరారు. శనివారం స్థానిక జిల్లా గృహ నిర్మాణ సంస్థ సమావేశ భవనంలో ఈఈ, డీఈఈ, ఏఈలకు వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణాల పురోగతి ఆశాజనకంగా ఉన్నా.. ఆన్లైన్లో తక్కువగా కనిపిస్తున్నదన్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి వ్యత్యాసాన్ని సరిచేసి.. పురోగతి మరింత పెరగాలన్నారు. హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్ మాట్లాడుతూ.. జిల్లాకు ఈ పథకం కింద 14,750 గృహాలు కేటాయించగా, 10,560 మంజూరు అయ్యాయన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద నంద్యాల మున్సిపాలిటీకి 650 గృహాలను కేటాయించగా..వీటి నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద కర్నూలు నగర పాలక సంస్థకు 10 వేలు, ఆదోని మున్సిపాలిటీకి 4704, ఎమ్మిగనూరుకు 3264, నంద్యాలకు 650 గృహాలను కేటాయించారని చెప్పారు. ఈ పథకం కింద గృహాలను నిర్మించుకునేందుకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోనే 23,824 దరఖాస్తులు రాగా, పూర్తి స్థాయి పరిశీలన అనంతరం 15,282 దరఖాస్తులను అర్హతగా గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశాన్నారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈలు సత్యప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పద్మనాభయ్య, డీఈఈలు వాసుదేవమూర్తి, సీ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు ప్రారంభం
కర్నూలు సిటీ: వచ్చే నెల చివరిలోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ గృహనిర్మాణ పనులు ప్రారంభించాలని ఆ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 10,600 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. వచ్చే నెల మొదటి వారంలో 1,300, రెండో వారంలో 2,600, మూడో వారంలో 4 వేలు, నాల్గో వారంలో 2,700 గృహ నిర్మాణాలను ప్రారంభించాలన్నారు. వీటిలో ఇప్పటి వరకు 3,437 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద చేపట్టిన నిర్మాణాలలో ఆదోని, కర్నూలు ఈఈలు వెనుకంజలో ఉన్నారన్నారు. సమావేశంలో పీడీ రాజశేఖర్, ఈఈలు పద్మనాభం, కె.ఎస్ ప్రసాద్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.