మార్చి 31 నాటికి ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలు పూర్తి
మార్చి 31 నాటికి ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలు పూర్తి
Published Sun, Feb 12 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
– రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేకాధికారి మల్లికార్జునరావు
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్‌టీఆర్ గృహ నిర్మాణాలు మార్చి 31వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రత్యేక అధికారి మల్లికార్జురావు కోరారు. శనివారం స్థానిక జిల్లా గృహ నిర్మాణ సంస్థ సమావేశ భవనంలో ఈఈ, డీఈఈ, ఏఈలకు వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో గృహ నిర్మాణాల పురోగతి ఆశాజనకంగా ఉన్నా.. ఆన్‌లైన్‌లో తక్కువగా కనిపిస్తున్నదన్నారు. ఈ నెల 17వ తేదీ నాటికి వ్యత్యాసాన్ని సరిచేసి.. పురోగతి మరింత పెరగాలన్నారు.
హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్ మాట్లాడుతూ.. జిల్లాకు ఈ పథకం కింద 14,750 గృహాలు కేటాయించగా, 10,560 మంజూరు అయ్యాయన్నారు. ఎన్‌టీఆర్ అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద నంద్యాల మున్సిపాలిటీకి 650 గృహాలను కేటాయించగా..వీటి నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయని చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద కర్నూలు నగర పాలక సంస్థకు 10 వేలు, ఆదోని మున్సిపాలిటీకి 4704, ఎమ్మిగనూరుకు 3264, నంద్యాలకు 650 గృహాలను కేటాయించారని చెప్పారు. ఈ పథకం కింద గృహాలను నిర్మించుకునేందుకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోనే 23,824 దరఖాస్తులు రాగా, పూర్తి స్థాయి పరిశీలన అనంతరం 15,282 దరఖాస్తులను అర్హతగా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశాన్నారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఈఈలు సత్యప్రసాదరెడ్డి, సుధాకర్‌రెడ్డి, పద్మనాభయ్య, డీఈఈలు వాసుదేవమూర్తి, సీ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement