ప్రజాసాధికార సర్వే చేస్తున్న అధికారులు
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో దోబూచులాట ఆడుతోంది. సొంతింటి కలను కల్లలుగా చేస్తూ ప్రజలను అయోమయంలో పడే విధంగా ప్రభుత్వం ఎన్నికల వ్యూహాన్ని రచించినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ‘అందరికీ ఇళ్ల పథకం’ ప్రవేశపెట్టాయి. ఇందులో కొంత భా గం కేంద్ర ప్రభుత్వం, మరికొంత భా గం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన రుణాన్ని లబ్ధిదారుడు కట్టుకునే విధంగా చేశారు. అయితే ఇళ్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసాధికారిక సర్వేను అనుసంధానం చేసింది. ఈ క్రమంలో టిడ్కో సంస్థ ప్రజాసాధికార సర్వేను ఆధారంగా చేసుకుని పాలకులు ఇళ్లు మం జూ రు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమా రు 2,750 దరఖాస్తులు రిజెక్ట్ అయ్యా యి. దీంతో ప్రజాసాధికార సర్వేలో ఏ విషయాలను ఆధారం చేసుకుని రిజెక్ట్ చేస్తున్నారనేది అటు ప్రజలకు, అధి కా రులకు కానీ స్పష్టత లేకుండాపోతోం ది. దరఖాస్తులు రిజెక్ట్ అయిన విష యం బయటకు రాకుండా కార్పొరేషన్ అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, మరోప్రాంతం (ఇంకా స్థలం పరిశీలిస్తున్నారు)లో అందరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం ఇళ్లను నిర్మించనుంది. వెంకటేశ్వరపురం 4,800, అల్లీపురం, అక్కచెరువుపాడులో 20,200, మరో స్థలంలో 10,240 ఇళ్లు నిర్మాణాలు చేపట్టనుంది. మొత్తం 35,240 ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఆయా ఇళ్లకు 50వేలకు పైగా దరఖాస్తులు కార్పొరేషన్‌కు చేరాయి. ఇప్పటికే వెంకటేశ్వరపురంలో 4,800 ఇళ్లు మంజూరు చేయగా ఇక్కడ 2,050మంది దరఖాస్తులదారులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే మంజూరు చేసిన మరో 2,750 దరఖాస్తులు రిజెక్ట్ అయినట్లు కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. ప్రజాసాధికారిక సర్వేను అనుసంధానం చేయడంతోనే రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
తప్పులతడకగా సర్వే
2016వ సంవత్సరంలో కార్పొరేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజాసాధికార సర్వేను చేపట్టారు. మొత్తం 1.50లక్షలు కుటుంబాలు ఉండగా కేవలం 44వేలమంది మాత్రమే పేదలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. సర్వేలో రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, లైసెన్స్‌లు, టీవీలు, ఫ్రిజ్‌ల వివరాలను నమోదు చేశారు. ఈ వివరాలను ఆధారంగా అందరికీ ఇళ్ల పథకంలో ఇళ్లు కేటాయిస్తున్నారు. ఈ సర్వేను గతంలో సిబ్బంది తప్పులతడకగా చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. కొందరు సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు నమోదు చేశారు. సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2,750 దరఖాస్తుల రిజెక్ట్
ప్రజాసాధికార సర్వేను అనుసంధానం చేస్తూ టిడ్కో సంస్థ అందరికీ ఇళ్లు పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. ప్రజాసాధికార సర్వేలో కొన్ని లోపాల కారణంగా వెంకటేశ్వరపురంలోని ఇళ్లకు ముందుగా ఎంపికైన 2,7 50 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. దరఖాస్తుదారుడి ఇంటికి కరెంట్‌బిల్లు రూ. 500 మించినా, 150సీసీలకు మించి బైక్ కలిగి ఉన్నా, కారు ఉన్నా, రేషన్‌కా ర్డులోని సభ్యుల్లో ఎవరికైనా ఇల్లు కానీ, స్థలం కానీ ఉన్నా అందరికీ ఇళ్లు పథకంలో అనర్హుడిగా చేస్తున్నట్లు తెలుస్తో ంది. ప్రజాసాధికార సర్వేను అనుసంధానం చేస్తూ ఇళ్లు మంజూరు చేయడం పేదలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రిజెక్టైన ఇంటి దరఖాస్తులను పరిశీలిస్తున్నాం
అందరికీ ఇళ్లు పథకం కింద ధరఖాస్తు చేసుకున్న కొన్ని ఫైల్స్ రిజక్ట్ అయ్యాయి. ఎందుకు రిజక్ట్ అయ్యాయనే దానిపై దరఖాస్తులను పునఃపరిశీలిస్తాం. లబ్ధిదారులకు ఇళ్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటాం.
–అలీంబాషా, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment