2నాటికి ఓడిఎఫ్ గ్రామాలు సిద్ధం
2నాటికి ఓడిఎఫ్ గ్రామాలు సిద్ధం
Published Thu, Sep 8 2016 12:00 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
కర్నూలు(హాస్పిటల్): గాం«ధీ జయంతి(అక్టోబర్ 2) నాటికి జిల్లాలో రెండు, మూడు గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలు(ఓడీఎఫ్)గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. ఇందుకోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రం కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓడిఎఫ్ గ్రామాల ఎంపికపై ఎంపీడీఓలతో సమీక్షించారు. ఓడీఎఫ్ కింద ఎంపిక చేసిన గ్రామాలకు మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్లను తక్షణం ప్రారంభించడం, నిర్మాణంలో ఉన్నవి పూర్తి చేయడం, పూర్తి చేసిన వాటిని జియోట్యాపింగ్ చేసి బిల్లులు చెల్లింపులు చేయడం వంటి పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్మించి వాటిని సక్రమంగా వినియోగించుకునేలా లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న వెయ్యి గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా ప్రకటిస్తారని, ఇందుకోసం ఈ నెల 31 నాటికే ప్రతి మండలంలో 2 నుంచి మూడు గ్రామాలను ఆ దిశగా అభివద్ధి చేయడంపై దష్టి సారించాలని ఆదేశించారు. ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దిన గ్రామాల్లో బాగా పనిచేసిన వారికి 2వ తేదీ సమావేశంలో ప్రశంసాపత్రాలు అందిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్, డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement