జియో చీర్ కు అనూహ్య స్పందన
జియో చీర్ కు అనూహ్య స్పందన
Published Fri, Jun 2 2017 4:32 PM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM
హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద ఎల్టీఈ నెట్ వర్క్ అయిన రిలయన్స్ జియో... ఆదివారం జరుగబోయే భారత-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో మన క్రికెట్ జట్టులో ఉత్సాహం నింపేందుకు అభిమానులకు స్వాగతం పలుకుతోంది. 'బిగ్గరగా సందడి చేద్దాం.. గర్వంగా నిలుద్దాం' అనే జియో క్రికెట్ థీమ్ తో డిజిటల్ ఉద్యమం ప్రారంభించింది. www.jiocheer.com లైవ్ ప్రొగ్రామ్ ను మొదలుపెట్టింది. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే 'చీర్ ఫర్ ఇండియా, జియ్ ఫర్ ఇండియా' నినాదం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇప్పటికే ఇది దాదాపు 90 లక్షల మంది అభిమానులను చేరింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే భారత్-పాక్ మ్యాచ్ లో అభిమానులు ఆన్ లైన్ ద్వారా తమ బలమైన మద్దతును తెలిపేందుకు ఇది వేదికగా మారింది. జట్టుకు తమ మద్దతు తెలుపుతూ.. ఆటగాళ్లను ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని జియో ప్రారంభించింది.
అంతేకాక, ఫేస్ బుక్ పేజీ, ట్విట్టర్, టంబ్లర్ వంటి వాటిల్లో షేర్ చేయడం ద్వారా మిత్రులకు, సహోద్యోగుల నుంచి మరింత మద్దతును భారత జట్టుకు అందించవచ్చు. ఉత్సాహభరితమైన ఈ డిజిటల్ ఉద్యమంలో కోట్లమంది క్రికెట్ అభిమానులంతా ఏకమై అద్భుతమైన అనుభూతిని పొందేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు భారత్ లో క్రికెట్ ను ప్రాణంగా ప్రేమించే అభిమానులను జియో చేరుకునేలా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. జియో వినియోగదారులు దూరదర్శన్ లో మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసాదం ద్వారా ఆస్వాదించవచ్చని, ప్రయాణంలో జియోటీవీ యాప్ ద్వారా కూడా మ్యాచ్ ను వీక్షించవచ్చని కంపెనీ పేర్కొంది.
Advertisement
Advertisement