
రూ. లక్ష కోట్లకు డిజిటల్ కామర్స్ మార్కెట్
న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్ వినియోగం పెరుగుదల, ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధి వల్ల డిజిటల్ కామర్స్ మార్కెట్ విలువ ఈ ఏడాది రూ.లక్ష కోట్లను అధిగమించనుంది. గతేడాది 53 శాతం వృద్ధితో రూ.81,525 కోట్లగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ ఈ ఏడాది 33 శాతం వృద్ధితో రూ.లక్ష కోట్లను దాటనుందని ఐఏఎంఏఐ, ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌లు తమ నివేదికలో తెలిపాయి. ఐఏఎంఏఐ, ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌ల నివేదిక ప్రకారం, 2010లో రూ.26,263 కోట్లుగా ఉన్న డిజిటల్ కామర్స్ మార్కెట్ 2012 నాటికి రూ.47,349 కోట్లకు, 2013కి రూ.53,301 కోట్లకు చేరింది.
- డిజిటల్ కామర్స్ మార్కెట్‌లో ఆన్‌లైన్ ట్రావెలింగ్ వాటా 61 శాతంగా, ఈ-టెయిలింగ్ వాటా 29.4 శాతంగా (2013 నుంచి 1.4 రెట్లు వృద్ధి) ఉంది.
- గతేడాది ఈ-టెయిలింగ్‌లో మొబైల్స్, మొబైల్ పరికరాల వాటా 41%(రూ.9,936 కోట్లు), చేనేత, ఫుట్‌వేర్, వ్యక్తిగత వస్తు ఉత్పత్తుల వాటా 20%(రూ.4,699 కోట్లు)గా ఉంది. వంటగది ఉపకరణాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ 14%(రూ.3,404 కోట్లు) వాటాను ఆక్రమించాయి.
- ఆన్‌లైన్‌లో షాపర్లలో 45% మంది క్యాష్ ఆన్ డెలివరీ వైపు ఆసక్తి కనబరిస్తే, 21% మంది డెబిట్ కార్డులు, 16% మంది క్రెడిట్ కార్డులు, 10% మం ది నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు జరిపారు.