అరచేతిలోనే అన్ని సేవలు | RTC E Wallet App For Digital Services | Sakshi
Sakshi News home page

అరచేతిలోనే అన్ని సేవలు

Published Thu, Apr 5 2018 9:50 AM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

RTC E Wallet App For Digital Services - Sakshi

సత్తెనపల్లి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీని) లాభాల బాట పట్టించేందుకు, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక చర్యలు చేపడుతోంది. బస్సు ఎక్కడుందో ప్రత్యేక ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకునేందుకు డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బస్సులు మరమ్మతులు చేసే నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు ఇ–వాలెట్‌ (ఎలక్ట్రానిక్‌ పర్స్‌)ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు కంప్యూటర్‌ ద్వారా సెల్‌ఫోన్‌లోనూ సేవలు పొందవచ్చు. ఈ యాప్‌ ద్వారా త్వరితగతిన టికెట్‌ బుకింగ్, ప్రచార రాయితీలు, ఒక ఇ–వాలెట్‌ నుంచి వేరొక ఈ – వాలెట్‌కు అదనపు ఖర్చు లేకుండా వేగంగా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఇ–వాలెట్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. అడ్వాన్సుడు రిజర్వేషన్, టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌ కార్డుల ద్వారా యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

ఈ– వ్యాలెట్‌  ఇలా..
గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి వ్యాలెట్‌ యాప్‌నును డౌన్‌లోడ్‌ చేసుకొని సైన్‌అప్‌ అయి మీ ఖాతాను ప్రారంభించాలి. జీరో బ్యాలెన్స్‌తో కూడా ఈ–వ్యాలెట్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. వ్యాలెట్‌ ఖాతా కలిగి టికెట్‌ కొనుగోలు చేస్తే టికెట్‌ ధరపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ప్రయాణికులు ఆర్టీసీకి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలనుకుంటే ఫేస్‌బుక్, ట్విట్టర్‌ పేజీల ద్వారా నేరుగా తెలియజేయవచ్చు.

మొబైల్‌ యాప్‌
ఆర్టీసీ మొబైల్‌ యాప్‌ ఎంతో ముఖ్యమైంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఆర్టీసీ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా సీటు రిజర్వేషన్, రద్దు, ప్రయాణ తేదీ  మార్చుకునే అవకాశాలు  ఉంటాయి. మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. లైవ్‌ ట్రాక్‌ ఆప్షన్‌లో ఎక్కాల్సిన బస్‌ సర్వీస్‌ నెంబర్‌ ప్రెస్‌ చేయడం ద్వారా ఆ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

ఏపీఎస్‌ ఆర్టీసీ మొబైల్‌ యాప్‌ ఇలా..
n    గూగుల్‌ ప్లే స్టోర్‌ / యాప్‌ స్టోర్‌ నుంచి ఏపీఎస్‌ఆర్‌టీసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
n    ఈ యాప్‌ ద్వారా సీటు రిజర్వేషన్‌ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, ప్రయాణ తేదీ మార్చుకోవడం తదితర సేవలు పొందవచ్చు.  
n    బస్సుల నిజ సమయం తెలుసుకునేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ (సిటి బస్సులు మినహా), ఏపీఎస్‌ ఆర్టీసీ సిటీ బస్సుల ట్రాక్‌లను ఏపీఎస్‌ఆర్‌టీసీ మొబైల్‌ యాప్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా ఏపీఎస్‌ఆర్టీసీ లైవ్‌ ట్రాక్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
n    అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికుల రక్షణ కోసం కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement