సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులకు డిజిటల్ పాస్‌లు ఇవ్వనున్నట్లు ఛీఫ్ రిసెప్షన్ ఆఫీసర్(సీఆర్‌వో) బంగార్రాజు పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ ఫోటో ఐడీ పాస్ విధానాన్ని సాధారణ పరిపాలన అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటలకు ప్రారంభించనున్నట్లు సీఆర్వో తెలిపారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా తమవెంట ఆథార్‌కార్డు లేదా ఏదేని ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని సూచించారు.
సెక్రటేరియట్ సందర్శకులకు ఇక డిజిటల్ పాస్
Published Thu, Jun 2 2016 10:42 PM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM
Advertisement
Advertisement