N. Sankar
-
సెక్రటేరియట్ సందర్శకులకు ఇక డిజిటల్ పాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులకు డిజిటల్ పాస్లు ఇవ్వనున్నట్లు ఛీఫ్ రిసెప్షన్ ఆఫీసర్(సీఆర్వో) బంగార్రాజు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన డిజిటల్ ఫోటో ఐడీ పాస్ విధానాన్ని సాధారణ పరిపాలన అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటలకు ప్రారంభించనున్నట్లు సీఆర్వో తెలిపారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా తమవెంట ఆథార్కార్డు లేదా ఏదేని ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని సూచించారు. -
‘ఆదర్శ’కు అండగా ఉండండి
సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్కు వినతి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షులు ఎన్. శేఖర్ తెలిపారు. ఆదర్శ రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ అండగా ఉండాలని కోరుతూ సోమవారం ఆదర్శ రైతుల ప్రతినిధి బృందం వైఎస్సార్ సీపీ శాసన సభా పక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆదర్శ రైతులకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు.