
వైద్యుల చేతిలో డిజిటల్ ప్రిస్కిప్షన్లు!
♦ ర్యాపిడ్‌ఆర్ యాప్‌ను విడుదల చేసిన సెయిన్స్ హెల్త్‌టెక్
♦ ఈ ఏడాది చివరినాటికి 25 వేల డాక్టర్ల నమోదు లక్ష్యం
♦ సెయిన్స్ హెల్త్‌టెక్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ రఘువీర్ వేదాంతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘ఎవరికీ అర్థంకానీ చేతి రాతతో రాసే ప్రిస్కిప్షన్ల వల్ల ఒక మందుకు బదులు మరో మందులేసుకుంటూ కొంతమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటే.. మరికొంత మంది మరణించిన సందర్భాలూ ఉన్నాయి. వీటికి పరిష్కారం చూపించాలంటే చేతిరాతకు బదులు డిజిటల్ ప్రిస్కిప్షన్లను వైద్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. అదే మా లక్ష్యం కూడా’’ అని సెయిన్స్ హెల్త్‌టెక్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ రఘువీర్ వేదాంతం చెప్పారు. దీనికోసం ర్యాపిడ్‌ఆర్ పేరుతో యాప్‌ను రూపొందించామని, డిజిటల్ ప్రిస్కిప్షన్ల వల్ల ఎలాంటి పొరపాట్లు జరగవని.. పెపైచ్చు పూర్తి సురక్షింతంగా ఉంటుందని బుధవారమిక్కడ విలేకరులతో చెప్పారాయన. ‘‘రిజిస్టర్ చేసుకున్న వైద్యులు ఈ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో ప్రిస్కిప్షన్స్ ఇస్తారు.
దీన్ని మెడికల్ షాపులు, రోగులు వినియోగించుకునే వీలుంటుంది. అవసరమైన మందులు, వేసుకోవాల్సిన సమయాలను పేషెంట్లకు ఎస్‌ఎంఎస్ రూపంలోనూ పంపిస్తాం’’ అంటూ పనితీరును వివరించారు. పేషెంట్లకు తమ మెడికల్ రికార్డులను, రిపోర్టులను, ప్రిస్కిప్షన్స్‌ను, డాక్టర్ సమ్మరీలను భద్రపరుచుకునే వీలు కూడా ఈ యాప్‌లో ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో 10 లక్షల మంది లెసైన్స్‌డ్ డాక్టర్లుండగా.. ఏటా 3-3.5 బిలియన్ల ప్రెస్కిప్షన్లు రాస్తున్నారని చెప్పారు.
ఈ ఏడాది ముగింపు నాటికి 25 వేల మంది వైద్యులను యాప్‌లో నమోదు చేయాలని లక్ష ్యంగా పెట్టుకున్నామని చెప్పారు. యాప్ వినియోగానికి ఎలాంటి చార్జీలు ఉండవని, ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటామని చెప్పారు. అట్లాంటా ప్రధాన కేంద్రంగా వైద్య రంగంలో డిజిటల్ ఇమేజింగ్ సొల్యూషన్స్ సేవలందిస్తున్న సెయిన్స్ హెల్త్‌టెక్ అనుబంధ సంస్థే ఇది.