అభిమానులకు బిగ్ బీ బర్త్ డే కానుక | For 72nd birthday, Amitabh Bachchan plans digital gift for fans | Sakshi
Sakshi News home page

అభిమానులకు బిగ్ బీ బర్త్ డే కానుక

Published Wed, Oct 8 2014 5:31 PM | Last Updated on Fri, Sep 28 2018 4:10 PM

అభిమానులకు బిగ్ బీ బర్త్ డే కానుక - Sakshi

అభిమానులకు బిగ్ బీ బర్త్ డే కానుక

న్యూఢిల్లీ: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తన 72వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నారు. శనివారం బర్త్ డే చేసుకోబోతున్న అమితాబ్ అభిమానుల కోసం వీడియో మెసేజ్, సంతకం చేసిన డిజిటల్ పోస్టర్లు పంపనున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమితాబ్ ఇందుకోసం ట్విట్టర్, డిజిటల్ మీడియా నెట్వర్క్ను ఉపయోగించుకోనున్నారు.

ట్విట్టర్లో అమితాబ్ను ఫాలో అయ్యే అభిమానులు బుధవారం నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవచ్చు. వీరికి సంతకం చేసిన డిజిటల్ ఫొటోలు పంపుతారు. అభిమానుల్లో ఒకరికి అమితాబ్ వ్యక్తిగత వీడియో మెసేజ్ పంపుతారు. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమితమైన ప్రేమ చూపుతుంటారని అమితాబ్ అన్నారు. ఈ సారి సోషల్ మీడియా ద్వారా అభిమానులను ప్రత్యేకంగా పలకరిస్తానని అమితాబ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement