'హ్యాపీ బర్త్‌ డే అశ్వత్థామ'.. కల్కి టీమ్ స్పెషల్ వీడియో! | Kalki Team Special Video On Amitabh Bachchan Birthday Occasion | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: హ్యాపీ బర్త్‌ డే అశ్వత్థామ.. అమితాబ్‌కు కల్కి టీమ్ స్పెషల్ వీడియో!

Published Fri, Oct 11 2024 4:12 PM | Last Updated on Fri, Oct 11 2024 4:18 PM

Kalki Team Special Video On Amitabh Bachchan Birthday Occasion

బాలీవుడ్‌ స్టార్, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్‌ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హిందీలో మాత్రమే ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

అమితాబ్ బర్త్ డే కావడంతో కల్కి టీమ్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఆయన కల్కి మూవీలోని సీన్స్‌తో వీడియోను రూపొందించింది. కల్కి షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో మెప్పించారు. హ్యాపీ బర్త్‌డే అశ్వత్థామ.. త్వరలోనే సెట్స్‌లో కలుసుకుందాం అంటూ బిగ్‌ బీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అమితాబ్ కల్కి-2 మూవీలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement