
డిజిటల్ రంగం @రూ.20,000 కోట్లు
ఎర్నస్ట్ అండ్ యంగ్ నివేదిక
ముంబై: భారత డిజిటల్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని ఎర్నస్ట్ యంగ్ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.8,490 కోట్లుగా ఉన్న ఈ రంగం 2020 నాటికి రూ.20,000 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. డిజిటల్ అడ్వర్జైజింగ్, ఓటీటీ(ఓవర్ ద టాప్) దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...,
⇔ మొబైల్ ఫోన్ల వాడకం విస్తృతంగా పెరిగిపోతుండటంతో, సంప్రదాయ ఇంటర్నెట్, టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, భారత డిజిటల్ మీడియా మార్కెట్‌లో అవకాశాలు అపారంగా ఉండనున్నాయి.
⇔ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020 నాటికి వీరి సంఖ్య 74.6 కోట్లకు పెరుగుతుంది.
⇔ భారీ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తారు.
⇔ ఓటీటీ, డిజిటల్ అడ్వర్టైజింగ్, వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, మ్యూజిక్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, గేమింగ్– ఈ రంగాల నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది.
⇔ 2015లో 31%గా ఉన్న స్మార్ట్‌ఫోన్ల వినియోగం 2020 కల్లా 59%కి పెరుగుతుంది.
⇔ డిజిటల్ ప్రకటనల వ్యయం 2020 కల్లా రూ.18,500 కోట్లకు చేరుతుంది.
⇔ భారత్‌లో 2020 కల్లా ఆన్‌లైన్ వీడియో వీక్షకుల సంఖ్య 45 కోట్లకు పెరుగుతుంది. ఆన్‌లైన్ వీడియో వీక్షకుల పరంగా రెండో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ అవతరిస్తుంది. మొదటి స్థానంలో చైనా ఉంది.