భారత్లో జోరుగా ఐపీఓలు | IPO stocks record strong debuts in 3Q, report says | Sakshi
Sakshi News home page

భారత్లో జోరుగా ఐపీఓలు

Published Thu, Sep 29 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

భారత్లో జోరుగా ఐపీఓలు

భారత్లో జోరుగా ఐపీఓలు

ఊతమిచ్చిన సంస్కరణలు
పెరిగిన ఇన్వెస్టర్ల విశ్వాసం
ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక

 న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్(ఐపీఓ)కు ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు అనుకూలంగా వున్నాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక వెల్లడించింది. యూరప్, మధ్య ఆసియా, భారత్, ఆఫ్రికా ప్రాంతాల్లో(ఈఎంఈఐఏ) భారత్‌లోనే ఎక్కువగా ఐపీఓలు వచ్చాయని ఈవై గ్లోబల్ ఐపీఓ ట్రెండ్స్: 2016 త్రైమాసిక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు....

భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడం, కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలను తేవడం వల్ల భారత్‌లో ఐపీఓల సంఖ్య పెరుగుతోంది.

భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉండడం, మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ పలు సంస్కరణలు తీసుకు రావడం ఐపీఓలకు సానుకూలం.

ఈ ఏడాది ఇప్పటివరకూ భారత్‌లో 56 ఐపీఓలు 180 కోట్ల డాలర్ల నిధులు సమీకరించాయి. ఈఎంఈఐఏ ప్రాంతంలో ఇన్ని ఐపీఓలు రావడం, ఇంత భారీగా నిధులు సమీకరించడం భారత్‌లోనే అధికం.

కొన్ని భారీ ఐపీఓల కారణంగా ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ 500 కోట్ల డాలర్లకు చేరే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement