పేటీఎంలో క్యాష్‌బ్యాక్‌గా డిజిటల్ బంగారం ఆఫర్
న్యూఢిల్లీ: మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం తాజాగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను డిజిటల్ బంగారం రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ ప్లాట్‌ఫాం ద్వారా లావాదేవీలు జరిపే వారు ఇకపై తామిచ్చే క్యాష్‌బ్యాక్‌ను డిజిటల్ పసిడి రూపంలోనూ పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే యూజర్లు ప్రస్తుతం తమ వాలెట్లలో ఉన్న క్యాష్‌బ్యాక్‌ను సైతం పేటీఎం గోల్డ్ కింద మార్చుకునేందుకు ప్రత్యేక ప్రమోషనల్ కోడ్‌ను కూడా ఇవ్వనున్నట్లు వివరించింది.
ఈ విధంగా జమయిన డిజిటల్ బంగారాన్ని డెలివరీ తీసుకోవచ్చని, లేదా పసిడి రిఫైనరీ సంస్థ ఎంఎంటీసీ–పీఏఎంపీకైనా విక్రయించుకోవచ్చని పేటీఎం తెలిపింది. అత్యంత తక్కువగా రూ.1కే డిజిటల్ బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలు కల్పించేందుకు ఎంఎంటీసీ–పీఏఎంపీతో పేటీఎం జట్టు కట్టిన సంగతి తెలిసిందే.