సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. వారం రోజులపాటు నిర్వహించనున్న అప్‌కమింగ్ ఆన్‌లైన్ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్‌ట్లను , క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం వివిధ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపింది.
శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లో క్రిస్మస్ కార్నివాల్‌ను ప్రకటించింది. డిసెంబరు 8నుంచి 15 వరకు ‘శాంసంగ్‌షాప్’ పేరుతో ఆన్‌లైన్ సేల్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సేల్‌లో పేటీఎం, బజాజ్, కేషీ ఫై, మొబీ క్విక్ లాంటి ఇతర సంస్థల ద్వారా క్యాష్‌బ్యాక్, ఎక్సేంజ్ ఆఫర్, డిస్కౌంట్లు, నో కాస్ట్ ఐఎంఐ ఆఫర్లు అందిస్తోంది.
రూ.10వేలకు పైన అన్ని ఉత్పత్తుల కొనుగోళ్లపై బజాజ్ ఫిన్ నో కాస్ట్ ఇఎంఐ అందిస్తోంది. పేటీఎం ద్వారా గెలాక్సీ ఎస్8 , ఎస్8 ప్లస్ , గెలాక్సీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తే రూ. 8వేల క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదేవిధంగా మొబీక్విక్ వాలెట్ ద్వారా ఫ్లాట్ 10 శాతం డిస్కౌంట్. కేషీ ఫై శాంసంగ్ డివైస్‌లపై 40శాతం బై బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. వీటితో పాటు ఇతర శాంసంగ్ మొబైల్ ఫోన్లు, స్పీకర్లు, ఆడియో యాక్సెసరీస్, టెలివిజన్లు లాంటి ఇతర పరికరాలు తగ్గింపు ధరలతో ఈ శాంసంగ్ షాప్ సేల్ లభిస్తాయని కంపెనీ తెలిపింది. శాంసంగ్ షాప్ ద్వారా ఒక వారం పాటు విక్రయాలను ఈ పండుగ సీజన్లో ఆనందించడానికి సంతోషిస్తున్నామని శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ ఉపాధ్యక్షుడు సందీప్ సింగ్ అరోరా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment