సామర్ధ్యం ఉండి.. ఐఫోన్‌ను కొనలేకపోయామే అని బాధపడుతున్న ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త. గతేడాది మార్కెట్‌లో యాపిల్ శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర సంస్థలు భారీ ఎత్తున ఫోన్‌లను విడుదల చేశాయి. ఏ సంస్థ నుంచి ఎన్ని ఫోన్‌లు విడుదలైన అందులో ఐఫోన్‌కు ప్రత్యేకత వేరే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్‌ను వినియోగించాలని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ధర కారణంగా వెనక్కి తగ్గుతుంటారు.
ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈకామర్స్ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ అమ్మకాలపై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. 2022 ఆగస్ట్ నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఆ సిరీస్‌లోని ఐఫోన్ 14 పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రీటైల్ మార్కెట్‌లో ఆఫోన్ ధర రూ.80 వేలు ఉండగా.. ఇప్పుడు అదే ఫోన్ పై రూ.5,910 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఇలా ఫ్లిప్ కార్ట్‌తో పాటు ఇతర డిస్కౌంట్‌లతో ఆ ఫోన్ ధర రూ.50,990కి తగ్గింది. ఒకవేళ మీరు 128 జీబీ వేరీయంట్ ఐఫోన్ 14ను ఎక్ఛేంజీలో సైతం కొనుక్కోవచ్చు. ఫోన్ కండీషన్ బాగుండి, మేజర్ సమస్యలు లేకపోతే ట్రేడ్- ఇన్ డిస్కౌంట్ వ్యాల్యూ ఆధారంగా క్యాలిక్లేట్ చేసి మీ ఫోన్ పై ఎంత ఎక్ఛేంజీ ఇవ్వాలో నిర్ధారిస్తారు ఐఫోన్ ప్రతినిధులు.
ఆఫోన్‌పై ఎక్ఛేంజ్‌తో రూ.23వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎగ్జిస్టింట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కింద 7శాతం డిస్కౌంట్, ఇతర బ్యాంక్‌లు ఇచ్చే ఆఫర్లు ఇలా మొత్తం కలిపితే రూ.40వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చని ప్లిప్ కార్ట్ తెలిపింది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
చదవండి👉‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment