సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్‌పాడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌పై ఓ లుక్కేయాల్సిందే. తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో యాపిల్ ఎయిర్ పాడ్‌లు కేవలం రూ. 549కి అందుబాటులో ఉన్నాయి.
Apple AirPod (2nd Gen) లు కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నట్టే, ఫ్లిప్‌కార్ట్‌సేల్‌లో ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలంటే పాతస్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. తద్వారా నిబంధనల మేరకు రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో సుమారు పది వేల రూపాయల యాపిల్ ఇయర్ బడ్స్‌ను రూ.549కి సొంతం చేసుకోవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు)
Comments
Please login to add a commentAdd a comment