
మీరు టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువార్ణావకాశం. 40అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.30వేలు ఉండగా ఎక్ఛేంజ్ ఆఫర్‌లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది.
40అంగుళాల ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్
ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ 40అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎంఐ టీవీ ధరపై 23శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే అందిస్తుంది. ఇక అదనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ తో టీవీ ధర రూ.21,499కి చేరుతుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్
మీరు కోరుకున్న టీవీపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు 40అంగుళాల టీవీపై ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు పొంద వచ్చు. దీంతో టీవీ ధర రూ.10,499లకే అందుబాటులోకి వస్తుంది.