horizon
-
G7 Summit 2024: ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో చర్చలు
జీ7 సమావేశం కోసం విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తోనూ మోదీ చర్చలు జరిపారు. ‘మా ఇద్దరి మధ్య ఏడాదికాలంలో జరిగిన నాలుగో భేటీ ఇది. అద్భుతంగా జరిగింది. ఇండో–పసిఫిక్ రోడ్‌మ్యాప్, హారిజాన్ 2047 సహా రక్షణ, అణు, అంతరిక్షం, సముద్రమార్గంలో వాణిజ్యం, విద్య, వాతావరణ మార్పులు, డిజిటల్ మౌలిక వసతులు, కనెక్టివిటీ, కృత్రిమ మేథ రంగాల్లో పరస్పర తోడ్పాటుపై చర్చలు జరిపాం. యువతలో ఆవిష్కరణలు, పరిశోధనలపై మరింత మక్కువ పెంచేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేదీ మాట్లాడుకున్నాం’ అని మోదీ చెప్పారు. శుక్రవారం ఇటలీకి చేరుకున్నాక మోదీ తొలుత మేక్రాన్‌ను కలిశారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఒక అంతర్జాతీయ నేతతో మోదీ సమావేశంకావడం ఇదే తొలిసారి. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో మేక్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్‌కు సీక్వెల్‌గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్‌ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్‌తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్‌ను కంబాట్‌లో ఉపయోగించవచ్చు. ప్లాట్‌ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్‌మేకర్! -
వారేవ్వా:రూ.10వేలకే!! రూ.30వేల ఖరీదైన 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ!
మీరు టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువార్ణావకాశం. 40అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.30వేలు ఉండగా ఎక్ఛేంజ్ ఆఫర్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. 40అంగుళాల ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ 40అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎంఐ టీవీ ధరపై 23శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే అందిస్తుంది. ఇక అదనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ తో టీవీ ధర రూ.21,499కి చేరుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీరు కోరుకున్న టీవీపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు 40అంగుళాల టీవీపై ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు పొంద వచ్చు. దీంతో టీవీ ధర రూ.10,499లకే అందుబాటులోకి వస్తుంది. -
ఫేస్బుక్ సమర్పించు.. వరల్డ్రూమ్
కరోనా భయం నీడలా వెంటాడుతూనే ఉన్న నేపథ్యంలో ప్రముఖ సంస్థలు కొన్ని ‘ఫిజికల్ వర్క్‌స్పేస్ ముఖ్యం కాదు’ అంటున్నాయి. ‘వర్చువల్ మీటింగ్’కు జై కొడుతున్నాయి. వర్చువల్ మీటింగ్ సాఫ్ట్వేర్లకు మంచి మార్కెట్ ఉన్న ఇలాంటి సమయంలో ‘నేనున్నానని’ అంటూ హరైజన్ వర్క్‌రూమ్స్ బీటాతో ముందుకు వచ్చింది బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్. చాలా కాలంగా వీఆర్ (వర్చువల్ రియాలిటీ) –ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) మీద దృష్టి పెట్టిన ఫేస్‌బుక్‌కు ‘హరైజన్ రూమ్స్’ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. ‘ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం చూపించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు సీయివో మార్క్ జుకర్ బర్గ్. హరైజన్ వర్క్‌రూమ్స్ ఉపయోగించడానికి ‘వర్క్‌రూమ్’ ఎకౌంట్‌తో పాటు ఓకులస్ క్వెస్ట్ హెడ్సెట్ తప్పనిసరి. అవతార్ వెర్షన్లో గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించుకోవచ్చు. ఎక్కడో ఉన్నవారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నట్లు కాకుండా అందరూ ఒకేచోట, ఒకేగదిలో ఉన్నట్లుగా ఉంటుంది. జర్నలిస్ట్ ఎలెక్స్ హీత్ హరైజన్ రూమ్స్ గురించి ఇలా అంటున్నారు... ‘మార్క్ జుకర్‌బర్గ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాను. అయితే ఇది వీఆర్ కాన్ఫరెన్స్. యు–ఆకారంలోని టేబుల్ చుట్టూ నాతో పాటు ఎందరో రిపోర్టర్లు కూర్చున్నారు. జుకర్‌బర్గ్ అవతార్ మా ముందు ప్రత్యక్షమయ్యాడు. హరైజన్ వర్క్‌రూమ్స్ న్యూ యాప్‌ను పరిచయం చేశాడు. అందరం ఒకేదగ్గర, ఒకే చోట ఉన్నట్లుగా అనిపించింది. ఇదొక అద్భుతమైన అనుభవం. వీఆర్ ఎక్స్పీరియన్స్ కిక్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో వీఆర్ ప్రేమికులను మాత్రమే కాదు దాని గురించి అంతగా తెలియని వారిని కూడా ఈ సాఫ్ట్వేర్ ఆకట్టుకుంటుంది’ ‘ప్రపంచంలో ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు ఉండవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న అందరినీ ఒకే రూమ్‌లోకి తీసుకువస్తున్నాం. ఇది సృజనాత్మక ఆలోచనలకు విశాలమైన వేదిక. ప్రయోగాల కేంద్రం’ అంటుంది ఫేస్బుక్ ప్రచార వీడియో.‘ఏ ప్లేస్ టు ట్రై సమ్‌థింగ్ న్యూ’ అని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కొత్తదనం అనుభవంలోకి రావడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందేమోగానీ... హరైజన్ వర్క్రూమ్స్పై చాలా అంచనాలే ఉన్నాయి. స్పెషియల్ హలిగ్రాఫిక్ కొలబొరేషన్ ప్లాట్‌ఫా మ్కు ఇది ఏ రకంగా భిన్నమైనదో వేచిచూద్దాం. మెటవర్స్ అంటే? జుకర్‌బర్గ్ మాటల్లో ‘మెటవర్స్’ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇంతకీ ఏమిటీ మెటవర్స్? స్థూలంగా చెప్పాలంటే... కలెక్టివ్ వర్చువల్ షేర్డ్ స్పేస్. నీల్ స్టీఫెన్సన్ తన సైన్స్–ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ నవలలో మనుషులు ‘అవతార్’ల ఆకారంలో ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతుంటారు. గ్రీకు పదం ‘మెటా’ (అవతలి వైపు)కు ప్రత్యామ్నాయం మెటవర్స్. ఇక ఫేస్బుక్ విషయానికి వస్తే... మెటవర్స్కు కంటెంట్ సర్వీసెస్, ఇంటర్‌ఛేంజ్ టూల్స్, స్టాండర్డ్స్, వర్చువల్ ప్లాట్‌ఫామ్స్, నెట్వర్కింగ్ కంప్యూట్, హార్డ్‌వేర్... అనేవి మూలస్తంభాలు. చదవండి : గాడ్జెట్స్ మార్కెట్ జోరు,ఎక్కువగా ఏం కొంటున్నారంటే? -
రెడ్ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే
వాషింగ్టన్: న్యూహారిజన్స్ అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను గురువారం నాసాకు పంపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్ ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా జనవరి 1న అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ను పంపిన సంగతి తెలిసిందే. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు. న్యూహారిజన్స్ అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్ హాఫ్కిన్స్ వర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లేబొరేటరీ (ఏపీఎల్) ట్వీట్ చేసింది. తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీ. సమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది. రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన న్యూ హారిజాన్!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలోకి పంపిన న్యూ హారిజాన్ అంతరిక్ష నౌక నూతన సంవత్సరం ప్రారంభంలో కొత్త చరిత్ర సృష్టించింది. మన సౌర కుటుంబంలో దాదాపు చివరన ఉన్న ‘అల్టిమా టూలే’ అనే చాలా చిన్న గ్రహానికి చాలా దగ్గరి నుంచి వెళ్లింది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక చేరని, దూరాన్ని ఈ న్యూహారిజాన్ ఛేదించింది. అంతేకాదు దాదాపు చాలా పురాతనమైన ఖగోళ వస్తువును ఈ హారిజాన్ తొలిసారిగా సందర్శించి, దాని ఫొటోలు తీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అల్టిమా ద్వారా మన సౌర వ్యవస్థ రహస్యాలను చేధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడికి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఈ అల్టిమా.. నెప్ట్యూన్‌కు ఆవల మన సౌర వ్యవస్థలోని క్యూపర్ బెల్టులో ఉంది. దీని అసలు పేరు 2014 ఎంయూ69 కాగా, ముద్దుగా అల్టిమా టూలే అని పిలుచుకుంటున్నారు. లాటిన్ పదమైన దీనర్థం ‘మన ప్రపంచానికి చాలా దూరం’. అన్ని గ్రహాల మాదిరిగా కాకుండా సూర్యుడి చుట్టూ అల్టిమా దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని నాసా పేర్కొంది. -
ఏకంగా విమానాన్నే దొంగలించాడు
-
రూ.30 లక్షల గంజాయి స్వాధీనం
రేణిగుంట(చిత్తూరు): కారులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.30 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లను చిత్తూరు జిల్లా రేణిగుంట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్ మలైరాజన్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ నంజుండప్ప ఈ ఘటన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన పరమన్ కారులో రాజమండ్రి నుంచి రూ.30 లక్షల విలువ చేసే 220 కిలోలున్న 100 ప్యాకెట్ల గంజాయిని ఈరోడ్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు. వడమాలపేట ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద కారు ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంబడించారు. వడమాలపేట టోల్ ప్లాజా నుంచి వెనుదిరిగిన కారు మళ్లీ రేణిగుంట వైపు మళ్లింది. గాజులమండ్యం సమీపంలోని ఎస్వీ షుగర్స్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ముళ్ల చెట్లలోకి వెళ్లింది. ఆ సమయంలో ప్రధాన నిందితుడు పరమన్ పరారయ్యాడు. వడమాలపేట ఎస్ఐ రాజశేఖరరెడ్డి, సిబ్బంది డ్రైవర్ మలైరాజన్‌ను పట్టుకున్నారు. తనది మధురై అని, పరారీలో ఉన్న పరమన్, రాజమండ్రికి చెందిన మరి కొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ నంజుండప్ప చెప్పారు.