రెడ్‌ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే | Ultima Thule is snowman-shaped | Sakshi
Sakshi News home page

రెడ్‌ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే

Published Fri, Jan 4 2019 5:41 AM | Last Updated on Fri, Jan 4 2019 5:41 AM

Ultima Thule is snowman-shaped - Sakshi

వాషింగ్టన్‌: న్యూహారిజన్స్‌ అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను గురువారం నాసాకు పంపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్‌ బెల్ట్‌ ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా జనవరి 1న అంతరిక్షంలోకి న్యూహారిజన్స్‌ను పంపిన సంగతి తెలిసిందే. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్‌బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు. న్యూహారిజన్స్‌ అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్‌ హాఫ్‌కిన్స్‌ వర్సిటీ అప్లైడ్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీ (ఏపీఎల్‌) ట్వీట్‌ చేసింది.

తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీ.  సమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్‌ స్నోమ్యాన్‌ ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది. రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్‌ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement