ఏకంగా విమానాన్నే దొంగలించాడు | Alaska Airlines plane stolen from SeaTac airport | Sakshi
Sakshi News home page

ఏకంగా విమానాన్నే దొంగలించాడు

Published Sat, Aug 11 2018 11:42 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

వాషింగ్టన్‌లోని సీటెల్‌-టాక్ అంతర్జాతీయ విమానశ్రయంలో ఉన్న అలస్కా విమానయాన సంస్థకు చెందిన విమానం హారిజన్‌ ఎయిర్‌ క్యూ400ను ఆ ఎయిర్‌లైన్‌ మెకానిక్‌ దొంగలించాడు. ఎయిర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌కు కన్నుగప్పి, ప్రయాణికులెవరూ ఆ విమానం ఎక్కకముందే, అక్కడి నుంచి గాలిలో ఎగిరిపోయాడు. ఆ మెకానిక్‌కు సరిగ్గా విమానం నడపడం రాకపోయే సరికి, కొంత దూరం వెళ్లగానే, ఆకాశంలోనే స్టంట్లు వేయడం ప్రారంభించాడు. ఆ అనంతరం విమానం పెద్దఎత్తున పొగలు గ్రక్కుతూ క్రాష్‌ అయి సముద్రంలోకి కూలిపోయింది. ఈ విషయాన్ని పియర్స్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఇది ఉగ్రవాద చర్య కాదని ధృవీకరించింది.  ఇది కేవలం ఓ వ్యక్తి చేసిన పన్నాగంగా పేర్కొంది. అతనెవరో మన అందరికీ తెలుసని పేర్కొంది. ఇతరులు ఎవరికి ఈ సంఘటనతో సంబంధం లేదని వెల్లడించింది. విమానాన్ని ఆపరేట్‌ చేసే ఆ మెకానిక్‌ తప్ప క్రూ సిబ్బంది ఎవరూ దానిలో లేడని పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement