రషీద్‌ ఖాన్‌కి బదులుగా... | Hilarious Exchange Offer on Rashid Khan to Afghan President | Sakshi
Sakshi News home page

May 26 2018 7:18 PM | Updated on Mar 28 2019 6:10 PM

Hilarious Exchange Offer on Rashid Khan to Afghan President - Sakshi

సన్‌రైజర్స్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌

సన్‌రైజర్స్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మారుమోగిపోతోంది. గత రాత్రి సన్‌రైజర్స్‌ విక్టరీలో కీ రోల్‌ పోషించిన రషీద్‌పై ప్రశంసల కురుస్తోంది. అతనికి భారతీయ పౌరసత్వం ఇవ్వాలంటూ కొందరు విజ్ఞప్తులు చేశారు కూడా. అయితే అఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు ఆష్రఫ్‌ ఘని అయితే రషీద్‌ను తమ దేశ జాతి సంపదగా అభివర్ణించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తే లేదంటూ ఓ ట్వీట్‌ కూడా చేయటం విశేషం. దీంతో ఆయనకు పలువురు ట్విటర్‌ వేదికగా ఎక్సేంజ్‌ ఆఫర్‌ ఇస్తున్నారు. 

‘రషీద్‌ ఖాన్‌ను ఇచ్చి.. బదులుగా మా కమాల్‌ రషీద్‌ ఖాన్‌కు తీసుకోండి’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్‌ చేశాడు. సినీ సెలబ్రిటీలపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ, ఆయా సెలబ్రిటీ ఫ్యాన్స్‌తో తిట్లు తింటూ తరచూ వార్తల్లో నిలిచే కమాల్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో వ్యక్తయితే ఏకంగా బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ తీసుకుని, రషీద్‌ ఖాన్‌ను ఇచ్చేయండి అని రిక్వెస్ట్‌ చేశాడు. ‘సర్‌ రషీద్‌ను ఇవ్వండి. కేజ్రీవాల్‌ను తీసేసుకోండి. ఆయన(కేజ్రీవాల్‌) యూ టర్న్‌ సెలబ్రిటీ’ మరొకతను రీట్వీట్‌ చేశాడు. ‘జడేజా బదులుగా రషీద్‌ను ఇచ్చేయండి, ఫ్రీగా శ్రీశాంత్‌ను కూడా తీసుకోండి ఘని సాబ్‌’ అంటూ మరో వ్యక్తి రీట్వీట్‌ చేశాడు. ఈ ఎక్సేంజ్‌ ఆఫర్‌పై సరదా ట్వీట్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement