ఫ్లిప్కార్ట్లో ఈ ఐఫోన్ రూ.1999లే | Now, Buy An iPhone For Rs. 1,999 Under Flipkart's Exchange Offer | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్లో ఈ ఐఫోన్ రూ.1999లే

Published Wed, Mar 29 2017 4:20 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్కార్ట్లో ఈ ఐఫోన్ రూ.1999లే - Sakshi

ఫ్లిప్కార్ట్లో ఈ ఐఫోన్ రూ.1999లే

ఆన్ లైన్ రీటైలర్  దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి ఐఫోన్ మోడల్స్పై భారీ  ఎక్స్చేంజ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద కేవలం రూ.1999కే ఐఫోన్ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.17,999 రూపాయలుగా ఉన్న ఐఫోన్ 5 ఎస్ (16 జీబీ వేరియంట్-సిల్వర్, స్పేస్ గ్రే)పై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఆ ఆఫర్ వల్ల రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది.
 
ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ వేరియంట్ - రోజ్ గోల్డ్)లకు కూడా వర్తిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ప్రస్తుతం లిస్టెడ్ ధర రూ.40,999గా ఉండగా, దానిపై ఫ్లిప్ కార్ట్ 16 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది.
 
ఇలావుండగా, గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 (32 జీబీ వేరియంట్ - సిల్వర్, రోజ్ గోల్డ్, గోల్డ్)ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో తక్కువగా 37 వేల రూపాయలకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 7 అసలు ధర 57 వేల రూపాయలు. దాంతో పాటు ఐఫోన్ 7 ప్లస్ ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో అందించనుంది. బేస్ ధర రూ.68,4000 గా ఉన్న ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్ లో 48,4000 రూపాయలకు లభిస్తుంది. 
 
ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ల (128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై) 20 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంచుతున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. గూగుల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందించనున్నట్టు తెలిపింది. గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లపై రూ.16వేల వరకు ధర తగ్గించనున్నట్టు పేర్కొంది. అయితే ఏ ఫోన్ల ఎక్స్చేంజ్తో ఐఫోన్ల ధర తగ్గించనుందో ఫ్లిప్ కార్ట్ వెల్లడించలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement