షావోమి స్మార్ట్‌ఫోన్లకు 'నోట్' ట్యాగ్ చాలా ఫేమస్. రెడ్‌మి నోట్, రెడ్‌మి నోట్ 2, రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 ఇలా పలు స్మార్ట్‌ఫోన్లను షావోమి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే తాజాగా స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగిస్తున్న ఈ 'నోట్' ట్యాగ్‌ను షావోమి తీసివేయాలని చూస్తుందట. షావోమి 'నోట్' పేరుకు స్వస్తి చెప్పబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు కూడా విడుదలయ్యాయి. అంతేకాక రెడ్‌మి నోట్4కు సక్ససర్‌గా షావోమి రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడం ఈ రిపోర్టులకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎంఐ ఫోరమ్ 'సూపర్ మోడరేటర్' మిచ్002 ఈ విషయాన్ని తొలిసారి రివీల్ చేసింది. కానీ ఇప్పటి వరకు షావోమి నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రెడ్‌మి 5 ప్లస్‌తో పాటు రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను కూడా షావోమి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు హ్యాండ్‌సెట్లు ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, రెండు స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి కూడా రాబోతున్నాయి.
రెడ్‌మి 5 ప్లస్
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్‌మి 5 ఫీచర్లు
2జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
3జీబీ ర్యామ్, 32జీబీ వెర్షన్
5.7 అంగుళాల ఫుల్‌హెచ్డీ ప్లస్ స్క్రీన్
3300 ఎంఏహెచ్ బ్యాటరీ
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
Comments
Please login to add a commentAdd a comment