
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి తన కస్టమర్లకు మరోసారి డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. డిస్కౌంట్ సేల్స్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో మొబైల్ మార్కెట్‌లో దూసుకుపోతున్న షావోమి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘న్యూ ఇయర్ ' సేల్‌ను ప్రకటించింది. ‘ఎంఐ ఫ్యాన్ సేల్’ ఆఫర్ కింద దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లోని 15 ఎంఐ హోమ్‌లలో డిస్కౌంట్ ధరలలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 23న లాంచ్ చేసిన ఈ ఆఫర్ జనవరి 1, 2018 వరకూ ఈ ఆఫర్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.
ముఖ్యంగా ఇప్పటివరకూ ఆన్‌లైన్ ఆఫర్లతో అలరించిన షావోమి తాజాగా ఆఫ్‌లైన్ వేదికగా కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది. ముఖ‍్యంగా పాపులర్ మోడల్స్ ఏ 1, రెడ్‌మీనోట్ 4, ఎం ఐ మిక్స్ 2, మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ప్రకటించింది.
ఎంఐ ఏ1, ఎంఐ మ్యాక్స్ 2 (32జీబీ వేరియంట్) ధరలు రూ.12,999కే లభ్యం( అసలు ధర రూ.13,999). ఇక రూ.15,999గా ఉన్న ఎంఐ మ్యాక్స్ 2(64జీబీ)ను రూ.14,999కు అందుబాటులో ఉంచింది. అలాగే ఎంఐ మిక్స్2పై మూడు వేల తగ్గింపు అనంతరం రూ.32,999కు లభ్యం కానుంది.
వీటితో పాటు రెడ్‌మి నోట్4 4జీజీ వేరియంట్ రూ.10,999 (అసలు ధర రూ.11,999), రెడ్‌మి4 32జీబీ వేరియంట్ రూ.8,499(ఎంఆర్‌పీ రూ.8,999) రెడ్‌మి4 64జీబీ వేరియంట్ రూ.9,999(అసలు ధర రూ.10,999) విక్రయిస్తోంది. వీటితో పాటు వివిధ యాక్ససరీస్‌పైనా కూడా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది.