ఇండిగో న్యూ ఇయర్‌ సేల్‌ | IndiGo Airline Offers Flight Tickets From Rs. 1,005 In New Year Sale. Details Here | Sakshi
Sakshi News home page

ఇండిగో న్యూ ఇయర్‌ సేల్‌

Published Mon, Jan 1 2018 3:38 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

IndiGo Airline Offers Flight Tickets From Rs. 1,005 In New Year Sale. Details Here - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ  ఇండిగో  నూతన సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై ఆఫర్‌ ప్రకటించింది.  ముఖ్యంగా న్యూ ఇయర్‌, హాలిడే డిమాండ్‌ను  క్యాష్‌ చేసుకునే  లక్ష్యంతో, విని యోగదారులను ఆకట్టుకునేలా తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్‌ ధరల్లో ఈ  టికెట్లను  ఆఫర్‌ చేస్తోంది.  ఇండిగో వెబ్‌సైట్‌ సమాచారం  జనవరి నెలలో అత్యధికంగా బుకింగ్ కోసం ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.  

బుకింగ్‌ పోర్టల్‌లోని ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.1030గా ఉంది. అలాగే  బాగ్డోగ్రా నుంచి  గౌవహటికి ప్రారంభ ధర రూ.1005గానూ, కోయంబత్తూర్‌ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఆన్‌లైన్‌ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్‌ కన్వీనియన్స్‌ ఫీజుగా  (నాన్‌ రిఫెండబుల్‌)రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది.  మరికొన్ని విమాన సర్వీసుల టిక్కెట్‌ ధరల విషయానికి వస్తే... చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా  ఇండిగో నిర్ణయించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement