నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్!
నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్!
Published Thu, Mar 23 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇటీవల ప్రవేశపెడుతున్న స్మార్ట్ ఫోన్లకు ఆన్ లైన్ లో అనూహ్య స్పందన వస్తోంది. సంచలన విక్రయాలు నమోదుచేసిన రెడ్ మి నోట్ 4 అనంతరం, నేడు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్ఫామ్పై తీసుకొచ్చిన తన లేటెస్ట్ మోడల్ రెడ్ మి4 ఏ ఫోన్కు భలే గిరాకి వచ్చింది. అమెజాన్ ప్లాట్ఫామ్ పైకి విక్రయానికి వచ్చిన ఆ ఫోన్, నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయింది. రెడ్మి 4ఏ తొలి సేల్ కూడా నేడే కావడం విశేషం. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది.
రెడ్ మి3 విజయంతో రెడ్మి 4ఏ ను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ కొన్నవారికి లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్(720పీ), క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 425 64-బిట్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ప్రత్యేకతలు. దీని ధర కూడా రూ.5,999లే కావడం విశేషం.
Advertisement
Advertisement