సాక్షి, సిటీబ్యూరో :
పేరుకే మహానగరం.. ఏ రోడ్డు చూసినా గోతుల మయం.. అడుగుకో మ్యాన్‌హోల్.. హడలగొట్టే రంధ్రం.. ఎప్పుడే రహదారి కుంగుతుందో.. ఏ రోడ్డు కింద నాలా, పైప్‌లైన్ ఉన్నాయో తెలియని అయోమయ స్థితి.. పట్టుమని కిలోమీటర్ ప్రయాణం కూడా సాఫీగా సాగించలేని దుస్థితి. ఈ నేపథ్యంలో రహదారుల స్థితిగతులను మార్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ఇకపై నిర్మించే రోడ్లు పక్కాగా ఉండేందుకు అధికారులు పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రహదారుల నిర్మాణంతోపాటే తగిన కేంబర్, పేవ్‌మెంట్ వరకు రీకార్పెటింగ్, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతులు, నీటినిల్వ ప్రాంతాల్లో దిద్దుబాట్లు, మురుగునీరు, పొంగిపొర్లే నీటిని అరికట్టడం, రోడ్డు కటింగ్‌లు పూడ్చివేయడం, భవిష్యత్‌లో నాలుగైదేళ్లపాటు తిరిగి కటింగ్‌లు లేకుండా చూడటం, టేబుల్ డ్రెయిన్ మరమ్మతులు, రోడ్డుకు సమతలంగా మ్యాన్‌హోళ్లు ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీలో ఇంజనీర్ల కొరత ఉండటంతో.. ఈ పనులన్నీ కాంట్రాక్టుకు ఇవ్వడంతోపాటు.. ఒప్పందం మేరకు నిర్ణీత కాలం వరకు రోడ్ల నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు పొందే సంస్థకే ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా తరచూ దెబ్బతినే రహదారుల సమస్యలకు పరిష్కారం దొరకుతుందని భావిస్తున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా రద్దీ ఎక్కువగా ఉండే 53 రహదారులను తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఆయా మార్గాల్లో అవసరమైన పనులకు రూ. 229 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అవసరాల్ని బట్టి వీటిలో మార్పుచేర్పులు చేయనున్నారు. స్టాండింగ్‌కమిటీ ఆమోదం పొందాక వీటికి టెండర్లు పిలవనున్నారు. అధికారుల అంచనాలు ఫలిస్తే.. ఈ ఏడాది నగర ప్రజలకు రహదారుల ఇక్కట్లు తప్పుతాయి.
ఎంపిక చేసిన మార్గాలు..
ఈస్ట్‌జోన్ పరిధిలో..
1.కాప్రా సర్కిల్‌లో శ్రీనివాసనగర్ చౌరస్తా - కంది గూడ చౌరస్తా 2.జ్యోతిరావు పూలే విగ్రహం- డిఫెన్స్ కాలనీ 3.ఎల్‌బీనగర్ సర్కిల్‌లో సిరీస్‌రోడ్డు, బిగ్‌బజార్-మన్సూరాబాద్ 4.ఎన్‌హెచ్-65 ప్రధాన రహదారుల నిర్వహణ, వనస్థలిపురం కమాన్-బీఎన్‌రెడ్డి కాలనీ చౌరస్తా, ఎన్జీవోల కాలనీ, ఎస్‌కేడినగర్ 5. హుడా కాంప్లెక్స్-ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డు 6.సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్ రోడ్డు 7. విరాట్‌నగర్ బస్టాప్-ఇన్నర్ రింగ్‌రోడ్డు మసీదు జంక్షన్.
సెంట్రల్‌జోన్ పరిధిలో..
8. అశోక్‌నగర్ బ్రిడ్జి-పీపుల్ స్కూల్ 9. సబర్మతి బ్రిడ్జి- అశోక్‌నగర్ బ్రిడ్జి 10.కవాడిగూడ రోడ్డు 11.లోయర్‌ట్యాంక్‌బండ్ (తెలుగుతల్లి వరకు) 12.వీఎస్‌టీ చౌరస్తా- రామ్‌నగర్ చౌరస్తా 13.బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా 14.శివం రోడ్డు(చే నెంబర్ చౌరస్తా-ఓయూ చౌరస్తా) 15.టూరిస్ట్‌హోటల్-బర్కత్‌పురా చౌరస్తా 16. శ్రీరమణ థియేటర్- సీపీఎల్ రోడ్డు 17. హిమాయత్‌నగర్ చౌరస్తా- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ చౌరస్తా 18. జిందా తిలిస్మాత్- గోల్నాక (చేనెంబర్ జంక్షన్ రోడ్డు) 19. కోఠి ఆంధ్రాబ్యాంకు- పుత్లిబౌలి 20. నాంపల్లి టి జంక్షన్- యూసుఫైన్ దర్గా 21. మాసాబ్‌ట్యాంక్-రియాన్‌కేఫ్ 22. లంగర్‌హౌస్ గాంధీ విగ్రహం-పిల్లర్‌నెంబర్ 102 వరకు 23.మిరాజ్‌కేఫ్-బోయిగూడ కమాన్ 24. మిరాజ్‌కేఫ్-తాళ్లగడ్డ 25.అయోధ్య జంక్షన్- బజార్‌ఘాట్ 26.ఎస్సార్‌నగర్ మెయిన్‌రోడ్డు 27. బల్కంపేట మెయిన్‌రోడ్డు 28. ఎస్సార్‌నగర్ చౌరస్తా- రాజీవ్‌నగర్ చౌరస్తా 29.యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు- మోతీనగర్ 30. ఏజీకాలనీ రోడ్డు 31. ఫిల్మ్‌నగర్ రోడ్డునెం.78- విస్పర్‌వ్యాలీ 32. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్లు 2, 3, 14, 9 ఇతరత్రా 33. గ్రీన్‌బావర్చి(శ్రీనగర్‌కాలనీ)-షాలిమార్ చౌరస్తా.
వెస్ట్‌జోన్‌లో..
34.ఐఐటీ చౌరస్తా- హోటల్ ఆదిత్య సరోవర్ 35. మెరిడియన్ స్కూల్- జూబ్లీహిల్స్ రోడ్డునెం.36, జూబ్లీహిల్స్ 36. పటాన్‌చెరు ఈఎస్‌ఐ, అన్నమయ్య ఎన్‌క్లేవ్ 37. జేఎన్‌టీయూ- హైటెక్‌సిటీ రోడ్డు ఇతరత్రా ప్రాంతాల్లో రీకార్పెటింగ్.
నార్త్‌జోన్‌లో..
38.సుచిత్రా చౌరస్తా- జీహెచ్‌ఎంసీ కుత్బుల్లాపూర్ కార్యాలయం 39. సెలెక్ట్ టాకీస్- ఈఎల్‌ఎస్సార్(మచ్చబొల్లారం), ఓల్డ్‌అల్వాల్ ఇందిరాగాంధీ విగ్రహం- ఈసేవ 40. సఫిల్‌గూడ రైల్వేస్టేషన్-జ్యోతినగర్ ఆర్‌యూబీ 41. హరిహర కళాభవన్- బైబిల్‌హౌస్ 42. సంగీత్- ప్యారడైజ్ 43. సన్‌షైన్ హాస్పిటల్-మినిస్టర్‌రోడ్డు 44. రసూల్‌పురా- రాణిగంజ్ 45.చిలకలగూడ- తార్నాక 46. సీతాఫల్‌మండి- జామైఉస్మానియా రైల్వేస్టేషన్ సౌత్‌జోన్‌లో..
47.టీవీ టవర్- అంబర్‌పేట కాజ్‌వే 48. ఉప్పర్‌పల్లి- హైదర్‌గూడ 49. అత్తాపూర్ నెం.9 చౌరస్తా- హుడాకాలనీ 50 మైలార్‌దేవ్‌పల్లి- సెయింట్ ఫియాజ్‌స్కూల్. వీటితోపాటు మరో మూడు మార్గాలు.
రోడ్లకు కొత్తరూపు
Published Wed, Jan 8 2014 3:17 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM
Advertisement
Advertisement