కింద ఫ్లై ఓవర్, పైన రైలుమార్గం
ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్
సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, హైదరాబాద్: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద నిర్మంచబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రోరైలు వచ్చే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరపనున్నారు. హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల విస్తరణ తదితర పనులకు ప్రభుత్వం రూ.7,032 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు.
వాటిల్లో విప్రో సర్కిల్ దగ్గర రెండు మార్గాల్లో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. విప్రో గేట్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ ‘యాక్సెంచర్’కు ముందుగా దిగనుంది. ఇదే మార్గంలో మెట్రో రైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వెళ్లే మార్గం రానుంది. ఈ నేపథ్యంలో హై సిటీ పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం, మెట్రో అధికారులు జంక్షన్ వద్ద మెట్రోరైలు మార్గాన్ని ఫ్లై ఓవర్ పైనుంచి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అందుకనుగుణంగా డిజైన్లు రూపొందించనున్నారు. అలాగే క్రాస్‌రోడ్, మియాపూర్ జంక్షన్ల మధ్య 2.28 మీటర్ల మేర ఆరులేన్ల ఫ్లై ఓవర్, లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వైపు 800 మీటర్ల మేర మూడు లేన్ల అండర్‌పాస్ రానుంది. ఈ పనుల కోసం రూ.530 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి.
ఇక్కడ ఫ్లై ఓవర్ మార్గంలోనే మియాపూర్ నుంచి పటాన్‌చెరు వెళ్లే మెట్రో మార్గం రానుంది. దీంతో ఇక్కడ కూడా మొదటి వరుసలో ఫ్లై ఓవర్, రెండో వరుసలో మెట్రోమార్గం నిరి్మంచాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాగోల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లే మెట్రో మార్గంలోనూ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాల్లో డబుల్‌డెక్కర్‌గా నిర్మాణాలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇలా మెట్రో రెండోదశ మార్గాల్లో జీహెచ్‌ఎంసీ కొత్త ఫ్లై ఓవర్లు నిరి్మంచాల్సిన ప్రాంతాల్లో ‘డబుల్’ డెక్కర్ ఆలోచనలు చేస్తున్నారు.
ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్
నగరంలో ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే జంక్షన్లలో ఒకటైన పంజగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఐటీ కారిడార్ల నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో వేగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు వస్తున్న వాహనాల వేగం అక్కడి నుంచి మందగిస్తోంది. ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్దకొచ్చేటప్పటికి ఇది మరింత తీవ్రమవుతోంది. దీంతో ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చట్నీస్ దగ్గర నుంచి జలగం వెంగళ్రావు పార్కు వరకు వన్‌వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్ల నుంచి బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నంల వైపు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ వల్ల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment