double-decker
-
గ్రేటర్..డబుల్ డెక్కర్!
సాక్షి, సిటీబ్యూరో: నార్త్‌సిటీకి డబుల్ డెక్కర్ కారిడార్లపైన స్పష్టత వచ్చింది. మొదట ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.32 కిలోమీటర్ల వరకే ప్రతిపాదించారు. తాజాగా జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ మార్గంలోనూ డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కారిడార్లు వినియోగంలోకి వస్తే దేశంలోనే అతిపెద్ద డబుల్‌డెక్కర్ నెట్వర్క్ కలిగిన నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించనుంది. ప్రస్తుతం నాగ్‌పూర్‌లో మాత్రమే 5.6 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఉంది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించిన 22 కిలోమీటర్ల మెట్రో మార్గంలో సుమారు 18 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ రానుంది. దీంతో నేలపైన, మొదటి అంతస్తు ఎలివేటెడ్‌లో వాహనాలు రాకపోకలు సాగించనుండగా, రెండో అంతస్తులో మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ప్రతిపాదిత 23 కిలోమీటర్ల మెట్రో రూట్లో ఇంచుమించు సుచిత్ర వరకు డబుల్ డెక్కర్ ఉంటుంది. అక్కడి నుంచి మేడ్చల్ వరకు ఎలివేటెడ్ మెట్రో కారిడార్ వస్తుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో ఈ రెండు మార్గాల్లో మెట్రో నిర్మాణ వ్యయం 30 శాతం వరకు తగ్గనున్నట్లు అంచనా. మెట్రో కోసం భూసేకరణ అవసరం లేదు.. ప్రస్తుతం నాగ్‌పూర్ కాంప్టీరోడ్డులో ఎల్ఐసీ స్క్వేర్ నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ వరకు 5.6 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఉంది.సుమారు రూ.573 కోట్లతో దీనిని నిర్మించారు.అంత కంటే ముందు వార్ధా రూట్లో నిర్మించిన 3.14 కిలోమీటర్ల కంటే ఇది ఎక్కువ. ఈ డబుల్ డెక్కర్‌ను ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తారు. రైలు, రోడ్డు, మెట్రో ఒకదానిపైన మరొకటి రాకపోకలు సాగిస్తున్నట్లుగా ఉంటాయి. నగరంలో ఉత్తరం వైపు నిరి్మంచనున్న డబుల్ డెక్కర్ మరో అద్భుతంగా ఆవిష్కృతం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎలివేటెడ్ కారిడార్ల కోసం హెచ్ఎండీఏ భూసేకరణ చేపట్టిన దృష్ట్యా మెట్రో కోసం ప్రత్యేక సేకరణ అవసరం లేదు.మెట్రో అలైన్మెంట్ల కోసం ఎలివేటెడ్ కారిడార్ పియర్స్ ఎత్తును పెంచుతారు. ఈ పియర్స్పైనే మెట్రో లైన్లు నిరి్మస్తారు. ఈ రెండు మార్గాలపైన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ త్వరలో డీపీఆర్ రూపొందించనున్న దృష్ట్యా అప్పుడే డిజైన్లపైన మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు రూట్లలో హెచ్ఎండీఏ భూసేకరణ కొనసాగిస్తోంది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దాంతో ఎలివేటెడ్ కారిడార్ టెండర్లకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డెయిరీఫామ్ నుంచి ఎలివేటెడ్ మెట్రో.. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గంలో మెట్రో కారిడార్లను నిరి్మంచనున్నారు. మేడ్చల్ రూట్లో తాడ్ బంండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు మెట్రో రానుంది. ఇదే మార్గంలో డెయిరీఫామ్ వరకు 5.32 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ ఉంటుంది. అలాగే జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్ పేట్ కు 22 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ విస్తరించి ఉంటుంది.ఈ రూట్లో దాదాపు పూర్తిస్థాయిలో డబుల్ డెక్కర్ వచ్చే అవకాశం ఉంది. ఫోర్త్‌సిటీకి కూడా డబుల్ డెక్కరే.. నార్త్‌సిటీ తరహాలో ఫోర్త్‌సిటీకి కూడా డబుల్ డెక్కర్ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మెట్రో రెండో దశలో రూ.6000 కోట్ల అంచనాలతో సుమారు 41 కిలోమీటర్లు పొడిగించనున్న సంగతి తెలిసిందే.రెండో దశలో 5 కారిడార్లకు మాత్రమే డీపీఆర్ పూర్తి చేసి రాష్ట్రప్రభుత్వ ఆమోదం అనంతరం కేంద్రం అనుమతికి పంపించారు. తాజాగా నార్త్‌సిటీకి 3 నెలల్లో డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే.అదేవిధంగా ఫోర్త్‌సిటీ మెట్రోపైన కూడా దృష్టి సారించనున్నారు. -
మెట్రో మార్గాల్లో ‘డబుల్ డెక్కర్లు’
సాక్షి, హైదరాబాద్: హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద నిర్మంచబోయే ఫ్లై ఓవర్ల మార్గాల్లో మెట్రోరైలు వచ్చే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు జరపనున్నారు. హై సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, రహదారుల విస్తరణ తదితర పనులకు ప్రభుత్వం రూ.7,032 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల పనులకు రూ.837 కోట్లు పరిపాలన అనుమతులు జారీ చేశారు. వాటిల్లో విప్రో సర్కిల్ దగ్గర రెండు మార్గాల్లో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. విప్రో గేట్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ ఫ్లై ఓవర్ ‘యాక్సెంచర్’కు ముందుగా దిగనుంది. ఇదే మార్గంలో మెట్రో రైలు రెండో దశలో భాగంగా రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వెళ్లే మార్గం రానుంది. ఈ నేపథ్యంలో హై సిటీ పనులు చేస్తున్న జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం, మెట్రో అధికారులు జంక్షన్ వద్ద మెట్రోరైలు మార్గాన్ని ఫ్లై ఓవర్ పైనుంచి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అందుకనుగుణంగా డిజైన్లు రూపొందించనున్నారు. అలాగే క్రాస్‌రోడ్, మియాపూర్ జంక్షన్ల మధ్య 2.28 మీటర్ల మేర ఆరులేన్ల ఫ్లై ఓవర్, లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వైపు 800 మీటర్ల మేర మూడు లేన్ల అండర్‌పాస్ రానుంది. ఈ పనుల కోసం రూ.530 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ ఫ్లై ఓవర్ మార్గంలోనే మియాపూర్ నుంచి పటాన్చెరు వెళ్లే మెట్రో మార్గం రానుంది. దీంతో ఇక్కడ కూడా మొదటి వరుసలో ఫ్లై ఓవర్, రెండో వరుసలో మెట్రోమార్గం నిరి్మంచాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్లే మెట్రో మార్గంలోనూ ఫ్లై ఓవర్లు వచ్చే ప్రాంతాల్లో డబుల్డెక్కర్గా నిర్మాణాలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇలా మెట్రో రెండోదశ మార్గాల్లో జీహెచ్ఎంసీ కొత్త ఫ్లై ఓవర్లు నిరి్మంచాల్సిన ప్రాంతాల్లో ‘డబుల్’ డెక్కర్ ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే జంక్షన్లలో ఒకటైన పంజగుట్ట ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఐటీ కారిడార్ల నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో వేగంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు వస్తున్న వాహనాల వేగం అక్కడి నుంచి మందగిస్తోంది. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్దకొచ్చేటప్పటికి ఇది మరింత తీవ్రమవుతోంది. దీంతో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చట్నీస్ దగ్గర నుంచి జలగం వెంగళ్రావు పార్కు వరకు వన్‌వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్ల నుంచి బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నంల వైపు వెళ్లే వారికి ఈ ఫ్లైఓవర్ వల్ల సాఫీ ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. -
గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్
డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లు చూశాం. కానీ డబుల్ డెక్కర్ విమానాల గురించి ఎప్పుడైనా విన్నారా? తాజాగా విమానంలో డబుల్ డెక్కర్ సీటు ఫొటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ సరికొత్త సీటు డిజైన్‌పై ప్రయాణికుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అలెజాండ్రో నూనెజ్ విసెంట్ అనే 23 ఏళ్ల డిజైనర్ ఈ డబుల్ డెక్కర్ సీట్లను రూపొందించారు. ‘చైస్ లాంజ్’ ఎయిర్‌ప్లేన్ సీట్ ప్రోటోటైప్ ఫొటో మొదటగా 2022లో విడుదలైంది. జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ డెక్కర్ సీట్లపై రెడిట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒక్కో యూజర్ ఒక్కోలా స్పందించారు. ఈ మిశ్రమ స్పందనలపై డిజైనర్ నూనెజ్ విసెంట్ మాట్లాడుతూ డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని సీఎన్ఎన్ వార్తా సంస్థతో ఆయన పేర్కొన్నారు. The double-decker airplane seat is back https://t.co/CK2nnh12kC pic.twitter.com/OKqgpmxiCn — CNN (@CNN) June 9, 2023 -
ప్రయోగాత్మక పరుగు విజయవంతం
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)-రోహాల మధ్య శనివారం నిర్వహించిన డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రయోగాత్మక పరుగు విజయవంతమైంది. త్వరలో రోహా నుంచి మడ్గావ్ వరకు ప్రయోగాత్మక పరుగును నిర్వహించనున్నారు. అది కూడా సఫలీకృతమైతే కొంకణ్ మార్గంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలును నడిపేందుకు మార్గం సుగమం కానుంది. గత కొన్నేళ్లుగా ఈ రైలు కోసం ఇటు ముంబైకర్లు, అటు కొంకణ్వాసులు ఎదురుచూస్తున్నారు. ప్రయోగాత్మక పరుగు విజయవంతమైన నేపథ్యంలో ఇక ఈ రైలు పట్టాలపై పరుగులు తీయడమే తరువాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైలుకు సంబంధించిన 10 బోగీలు ఇటీవల కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) యార్డుకు చేరుకున్నాయి. నిర్వహణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరికొన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. కాగా ప్రారంభంలో సీఎస్టీ నుంచి రోహా వరకు తాత్కాలికంగా నిర్దేశించిన వేగంతోనే నడపనున్నారు. ఇటీవల దీవా-సావంత్వాడి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వేగ నియంత్రణను తొలగిస్తారు. కాగా ప్రయోగాత్మక పరుగులో కొంకణ్ రైల్వే భద్రతా విభాగానికి సాంకేతిక సిబ్బంది, రైల్వే బోర్డు అధికారులు, ఇతర సాంకేతిక నిపుణు లు ప్రయాణించారు. ఈ రైలులో ప్రయాణికుల బరువుకు సమానంగా ప్రతి బోగీలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు ఉంచారు. బోగీ, రైల్వే పట్టాల సామర్థ్యం తదితరాలను పరిశీలించా రు. మరికొద్దిరోజుల్లో రోహా నుంచి మడ్గావ్ వర కు ప్రయోగాత్మక పరుగు నిర్వహిస్తారు. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తని పక్షంలో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధం చేస్తా రు. ప్రయోగాత్మక పరుగును సొరంగ మార్గాలు, ప్రమాదకర మలుపుల్లో నిర్వహించారు. రైల్వే భద్ర తా కమిషనర్ ద్వారా తుది పరీక్షలు నిర్వహిస్తారు. భద్రతాపత్రం జారీ కాగానే సేవలకు సిద్ధం చేస్తారని సెంట్రల్ రైల్వే రీజినల్ కమిషనర్ ముకేశ్ నిగం చెప్పారు. -
డబుల్‌డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరుకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచి గూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచి గూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. - సాక్షి, నల్లగొండ రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. నల్లగొండ నుంచి ప్రతిరోజూ పలుఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం రద్దీ ఉంటుంది. ప్రతిరోజు చాలా మంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వయా నల్లగొండ ద్వారా డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్, నర్సాపూర్, చెన్నై సూపర్‌ఫాస్ట్, నారాయణాద్రి, విశాక, పుష్పుల్, ఫలక్‌నుమా, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్, పల్నాడు, శబరి, భావనగర్, రేపల్లె, జన్మభూమి, భువనేశ్వర్ రైళ్లు గుంటూరు, తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకతలివీ.. - ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. - ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. - కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. - డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415,కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720 -
డబుల్ డెక్కర్ ట్రైన్ వచ్చేసింది..
పంజాబ్ లోని కపుర్తా రైల్‌కోచ్ ఫ్యాక్టరీ నుంచి రాక అత్యాధునిక సౌకర్యాలతో రైలు రూపకల్పన ఒక బోగీలో 120 మంది కూర్చునే సౌకర్యం గంటకు 160కిలోమీటర్ల వేగం దక్షిణ మధ్య రైల్వేలోతొలి డబుల్ డెక్కర్ కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : హైదరాబాద్ నగరంలో గతంలో నడిపిన డబుల్ డెక్కర్ బస్సుల తరహాలో పట్టాలపై డబుల్ డెక్కర్ రైళ్లు పరుగెత్తనున్నాయి. 2014-15 రైల్వేబడ్జెట్‌లో రైల్వేమంత్రి మల్లికార్జున ఖర్గే దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఒక రైలు కాచిగూడ నుంచి గుంటూరుకు, మరొకటి కాచిగూడ నుంచి వయా కాజీపేట మీదుగా తిరుపతికి నడిపించనున్నట్లు అధికారుల ద్వారా తెలిసిం ది. బడ్జెట్లో ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కాజీపేట జంక్షన్‌కు రంగురంగుల డబుల్ డెక్కర్ ఏసీ రైలు రానే వచ్చింది. శనివారం సాయంత్రం చేరుకున్న ఈ రైలును పంజాబ్‌లోని కపుర్తాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారు చేశారు. కాజీపేట అధికారులు మూడో నంబర్ ప్లాట్ఫాంపక్కనగల రైల్వే యార్డులో పార్కింగ్ చేశారు. కాజీపేట స్టేషన్‌మేనేజర్ ఎం.ఓదేలు, ఏరియా ఆఫీసర్ బీఆర్.కుమార్ ఇతర సూపర్వైజర్లు వెళ్లి తనిఖీచేశారు. కొద్దిరోజుల్లోనే ఈ రైలును కాచిగూడలో రైల్వేమంత్రిచే ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న డబుల్ డెక్కర్‌ను ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేకతలు ఇవే.. ఈ రైలు ఇంజన్ ముందు, వెనక రెండు ఎస్ఎల్ఆర్లు ఉండగా 14 బోగీలు మొ త్తం ఏసీతో తయారు చేశారు. రైలు మొ త్తంలో 1680 మంది ప్రయాణికులు కూ ర్చునే సౌకర్యం ఉంది. ఒక డబుల్ డెక్కర్ కోచ్‌లో(కింద, పైన) కలిపి 120 మంది కూర్చుంటారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం నడిచే రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. ఇందులో బయోమెటిక్ టాయ్‌లెట్స్ సౌకర్యం ఉంది.