సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)-రోహాల మధ్య శనివారం నిర్వహించిన డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రయోగాత్మక పరుగు విజయవంతమైంది. త్వరలో రోహా నుంచి మడ్‌గావ్ వరకు ప్రయోగాత్మక పరుగును నిర్వహించనున్నారు. అది కూడా సఫలీకృతమైతే కొంకణ్ మార్గంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలును నడిపేందుకు మార్గం సుగమం కానుంది. గత కొన్నేళ్లుగా ఈ రైలు కోసం ఇటు ముంబైకర్లు, అటు కొంకణ్‌వాసులు ఎదురుచూస్తున్నారు. ప్రయోగాత్మక పరుగు విజయవంతమైన నేపథ్యంలో ఇక ఈ రైలు పట్టాలపై పరుగులు తీయడమే తరువాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ రైలుకు సంబంధించిన 10 బోగీలు ఇటీవల కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) యార్డుకు చేరుకున్నాయి. నిర్వహణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరికొన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. కాగా ప్రారంభంలో సీఎస్టీ నుంచి రోహా వరకు తాత్కాలికంగా నిర్దేశించిన వేగంతోనే నడపనున్నారు. ఇటీవల దీవా-సావంత్‌వాడి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వేగ నియంత్రణను తొలగిస్తారు. కాగా ప్రయోగాత్మక పరుగులో కొంకణ్ రైల్వే భద్రతా విభాగానికి సాంకేతిక సిబ్బంది, రైల్వే బోర్డు అధికారులు, ఇతర సాంకేతిక నిపుణు లు ప్రయాణించారు.
ఈ రైలులో ప్రయాణికుల బరువుకు సమానంగా ప్రతి బోగీలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు ఉంచారు. బోగీ, రైల్వే పట్టాల సామర్థ్యం తదితరాలను పరిశీలించా రు. మరికొద్దిరోజుల్లో రోహా నుంచి మడ్‌గావ్ వర కు ప్రయోగాత్మక పరుగు నిర్వహిస్తారు. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తని పక్షంలో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధం చేస్తా రు. ప్రయోగాత్మక పరుగును సొరంగ మార్గాలు, ప్రమాదకర మలుపుల్లో నిర్వహించారు. రైల్వే భద్ర తా కమిషనర్ ద్వారా తుది పరీక్షలు నిర్వహిస్తారు. భద్రతాపత్రం జారీ కాగానే సేవలకు సిద్ధం చేస్తారని సెంట్రల్ రైల్వే రీజినల్ కమిషనర్ ముకేశ్ నిగం చెప్పారు.
ప్రయోగాత్మక పరుగు విజయవంతం
Published Sun, May 18 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement