Mumbai - Goa
-
శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీ.. బౌలర్లకు చుక్కలు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు. శ్రేయస్‌తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.వేలంలో కాసుల వర్షం కురవనుందా?కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్‌బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్‌కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్‌బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
ముంబై-గోవాల మధ్య లాంచీ సేవలు
రూ. 868 కోట్ల ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న ప్రతిపాదనలు సాక్షి, ముంబై: ముంబై-గోవాల మధ్య జలరవాణ మార్గాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. కొద్ది రోజుల కిందట ఈ ప్రతిపాదన తెరమీదకు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది అటకెక్కింది. అయితే రోడ్డు మార్గం ద్వారా రాకపోకలు సాగించే ప్రజారవాణా సదుపాయాలపై ప్రయాణికుల భారం విపరీతంగా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించాలంటే ముంబై-గోవాల మధ్య లాంచి సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఆ దిశగా మళ్లీ సన్నాహాలు చేస్తోంది. సుమారు 500 మంది ప్రయాణించే సామర్థ్యంగల స్టీమర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముంబై-గోవా మధ్య స్టీమర్లను ప్రారంభిస్తే గణపతి పుళే, మాల్వణ్, వెంగుర్లా, తార్కలి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా గిట్టుబాటు అవుతాయి. అదే రోడ్డు మార్గం మీదుగా వెళ్లాలంటే వ్యయప్రయాసాలను భరించాల్సి వస్తోంది. ముంబైలోని భావుచా ధక్కా నుంచి నేరుల్ వయా జేఎన్పీటీ, అలాగే నారిమన్ పాయింట్ నుంచి జుహూ టెర్మినల్, మార్వే నుంచి బోరివలి ఇలా లాంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రయోజనకరంగా ఉటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు రూ.868 కోట్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల కిందట కొంకణ్ శక్తి, కొంకణ్ సేవక్ పేరుతో రెండు లాంచీలు ముంబై-గోవా మధ్య ప్రయాణించేవి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం దమానియా షిప్పింగ్ కంపెనీ కొన్ని నెలలపాటు హోవర్ క్రాఫ్ట్ సేవలు అందించింది. ఇవి కూడా మూతపడిపోయాయి. దీంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో లాంచీ సేవలను ప్రారంభించాలనే డిమాండ్లు పెరగడంతో అందుకు అవసరమైన టెండర్లను పిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సేవలు అందించే బాధ్యత మేరీ టైమ్ బోర్డుకు అప్పగించాలని యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. -
ప్రయోగాత్మక పరుగు విజయవంతం
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)-రోహాల మధ్య శనివారం నిర్వహించిన డబుల్ డెక్కర్ ఏసీ రైలు ప్రయోగాత్మక పరుగు విజయవంతమైంది. త్వరలో రోహా నుంచి మడ్గావ్ వరకు ప్రయోగాత్మక పరుగును నిర్వహించనున్నారు. అది కూడా సఫలీకృతమైతే కొంకణ్ మార్గంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలును నడిపేందుకు మార్గం సుగమం కానుంది. గత కొన్నేళ్లుగా ఈ రైలు కోసం ఇటు ముంబైకర్లు, అటు కొంకణ్వాసులు ఎదురుచూస్తున్నారు. ప్రయోగాత్మక పరుగు విజయవంతమైన నేపథ్యంలో ఇక ఈ రైలు పట్టాలపై పరుగులు తీయడమే తరువాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ రైలుకు సంబంధించిన 10 బోగీలు ఇటీవల కుర్లాలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) యార్డుకు చేరుకున్నాయి. నిర్వహణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. మరికొన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. కాగా ప్రారంభంలో సీఎస్టీ నుంచి రోహా వరకు తాత్కాలికంగా నిర్దేశించిన వేగంతోనే నడపనున్నారు. ఇటీవల దీవా-సావంత్వాడి ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వేగ నియంత్రణను తొలగిస్తారు. కాగా ప్రయోగాత్మక పరుగులో కొంకణ్ రైల్వే భద్రతా విభాగానికి సాంకేతిక సిబ్బంది, రైల్వే బోర్డు అధికారులు, ఇతర సాంకేతిక నిపుణు లు ప్రయాణించారు. ఈ రైలులో ప్రయాణికుల బరువుకు సమానంగా ప్రతి బోగీలో ఇసుక, రాళ్లతో కూడిన సంచులు ఉంచారు. బోగీ, రైల్వే పట్టాల సామర్థ్యం తదితరాలను పరిశీలించా రు. మరికొద్దిరోజుల్లో రోహా నుంచి మడ్గావ్ వర కు ప్రయోగాత్మక పరుగు నిర్వహిస్తారు. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తని పక్షంలో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధం చేస్తా రు. ప్రయోగాత్మక పరుగును సొరంగ మార్గాలు, ప్రమాదకర మలుపుల్లో నిర్వహించారు. రైల్వే భద్ర తా కమిషనర్ ద్వారా తుది పరీక్షలు నిర్వహిస్తారు. భద్రతాపత్రం జారీ కాగానే సేవలకు సిద్ధం చేస్తారని సెంట్రల్ రైల్వే రీజినల్ కమిషనర్ ముకేశ్ నిగం చెప్పారు.