ఐపీఎల్-2025 మెగా వేలానికి ఒక్క రోజు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ-2024లో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుత శతకంతో సత్తాచాటాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై సారథిగా బరిలోకి దిగిన అయ్యర్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 57 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 130 పరుగులుచేశాడు.
శ్రేయస్‌తోపాటు పృథ్వీషా(33), ములానీ(41) రాణించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు కూడా ఆఖరి వరకు పోరాడింది. లక్ష్య చేధనలో గోవా 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఫలితంగా 26 పరుగుల తేడాతో గోవా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
గోవా బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేశాయ్(52) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో రాయ్స్టన్ ద్యాస్, సూర్యన్ష్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ములానీ, శార్ధూల్ ఠాకూర్, మొహిత్ తలా వికెట్ సాధించారు.
వేలంలో కాసుల వర్షం కురవనుందా?
కాగా అయ్యర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా వేదికగా జరగనున్న వేలంలో అయ్యర్‌పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. కాగా మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ అయ్యర్‌ను వేలంలోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment