సయ్యద్ ముస్తాక్ అలీ-2022 ఫైనల్లో ముంబై జట్టు తొలి సారి అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా విదర్భతో జరిగిన సెమీఫైనల్‌లో 5 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కాగా ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు.
అతడితో పాటు ఓపెనర్ పృథ్వీ షా (21 బంతుల్లో 34) కూడా రాణించాడు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే, అక్షయ్ కర్నేవార్ తలా రెండు వికెట్లు సాధించగా.. లలిత్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. విదర్భ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ మూడు వికెట్లు, దేశ్‌పాండే, దుబే తలా రెండు వికెట్లు సాధించారు. మరో వైపు హిమాచల్ ప్రదేశ్ ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 13 పరుగులతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య ఫైనల్ శనివారం జరుగుతుంది.
చదవండి: కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment