SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు | Mumbai announces squad for Syed Mushtaq Ali Trophy | Sakshi
Sakshi News home page

SMT 2024: ముంబై జట్టు ప్రకటన.. పృథ్వీ షా, రహానేలకు చోటు

Published Mon, Nov 18 2024 7:59 AM | Last Updated on Mon, Nov 18 2024 8:53 AM

Mumbai announces squad for Syed Mushtaq Ali Trophy

దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 15 వరకు జరగనున్న ఈ ట్రోఫీ కోసం ముంబై క్రికెట్‌ సంఘం ఆదివారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. 

రంజీ ట్రోపీలో ముంబై జట్టుకు సారథ్యం వహించిన అజింక్యా రహానేతో పాటు... ఫిట్‌నెస్‌ లేమితో పాటు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి రంజీ జట్టులో చోటు కోల్పోయిన ఓపెనర్‌ పృథ్వీ షా కూడా ముస్తాక్‌ అలీ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం సాధించాలనుకుంటున్న శ్రేయస్‌ అయ్యర్‌ ప్రస్తుత రంజీ ట్రోఫీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

తాజా సీజన్‌లో అయ్యర్‌ 90.40 సగటుతో 452 పరుగులు సాధించాడు. అందులో ఒక డబుల్‌ సెంచరీ, మరో సెంచరీ ఉంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా–‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనుశ్‌ కోటియాన్, పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్, సిద్ధేశ్‌ లాడ్, యువ ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ ముంబై జట్టులో చోటు దక్కించుకున్నారు.  
ముంబై జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, జయ్‌ బిస్తా, అజింక్యా రహానే, సిద్ధేశ్‌ లాడ్, సూర్యాన్ష్‌ షెడ్గె, సాయిరాజ్‌ పాటిల్, హార్దిక్‌ తమోర్, ఆకాశ్‌ ఆనంద్, షమ్స్‌ ములానీ, హిమాన్షు సింగ్, తనుశ్‌ కోటియాన్, శార్దూల్‌ ఠాకూర్, మోహిత్‌ అవస్థి, రోస్టన్‌ డియాస్, జునేద్‌ ఖాన్‌.
చదవండి: కోహ్లిపై ఒత్తిడి పెంచండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement