![HMR MD N.V.S Reddy Replies Over Metro Incident At Khairatabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/19/Untitled-8.jpg.webp?itok=hgomDZ07)
సాక్షి, హైదరాబాద్ : అత్యంత రద్దీగా ఉన్న ఓ మెట్రోరైలు బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్) ఊడిపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో పలువురు పైకప్పునకు ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడి తమపై పడినట్లు కొందరు తెలిపారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో రైలును కొద్దిసేపు నిలిపినట్లు సమాచారం.అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. బోగీలోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలుస్తోంది. దీనిపై హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డిని వివరణ కోరగా..మెట్రో బోగీలో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment