ఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన అనంతరం ప్రస్తుతం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ఓ యువతి ఓ యువకున్ని చెంప చెల్లుమనిపించింది. ఏమైందో తెలియదు.. కానీ యువకున్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. మిగిలిన ప్రయాణికులు వారికి దూరంగా ఉండి చూస్తూ ఉండి పోయారు.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023
మెట్రోలో ప్రయాణికులందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉన్న ఓ యువకుని వైపు దూసుకొచ్చి... అతని చెంప చెల్లుమనిపించింది. బూతులు తిడుతూ మరల యువకునిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ఇదంతా చూస్తున్న జనాలు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా భావించి దూరంగా ఉండిపోయారు.
ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. వారిద్దరి మధ్యలోకి చొరవ తీసుకోనందుకు తోటి ప్రయాణికులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోలో ఇలా ప్రవర్తిస్తే అందరికి ఇబ్బంది కలగదా? అని మరికొందరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!
Comments
Please login to add a commentAdd a comment