మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు! | Bengaluru Woman Groped By A Man In Crowded Metro | Sakshi
Sakshi News home page

bangalore: మెట్రోలో యువతిపై లైంగిక వేధింపులు.. పట్టించుకోని ప్రయాణికులు!

Published Wed, Nov 22 2023 9:58 AM | Last Updated on Wed, Nov 22 2023 10:10 AM

molestation in bangalore metro woman was groped - Sakshi

ఐటీ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరులో.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఆ సమయంలో ఆమె సాయం కోసం కేకలు వేసినా తోటి ప్రయాణికులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు​కున్న నిందితుడు జనంలో కలిసిపోయి, తేలిగ్గా అదృశ్యమయ్యాడు. బాధితురాలి ఫ్రెండ్‌ ఈ హృదయ విదారక సంఘటనను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం రెడ్డిట్‌లో షేర్‌ చేశారు. నిందితునిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తన స్నేహితురాలు కళాశాలకు రోజూ బస్సులో వెళతారని, అయితే ఆమె సోమవారం (నవంబర్ 20) మెట్రోలో ప్రయాణించారన్నారు. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లోని మెట్రోలో జనం ఎక్కువగా ఉన్నారని, దీంతో తోపులాటలు జరిగాయి. కొద్దిసేపటి తర్వాత, నా స్నేహితురాలికి అసౌకర్యంగా అనిపించింది. ఎర్రటి చొక్కా ధరించిన వ్యక్తి ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. అతను ఆమెను అసభ్యంతా తాకడంతోపాటు గోర్లతో ఆమెను గుచ్చాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అయినా తోటి ప్రయాణికులెవరూ పట్టించుకోలేదు. ఇంతలో అతను పారిపోయాడని ఆ ఫ్రెండ్‌ పోస్ట్‌లో రాశారు.

ఈ పోస్ట్‌ చూసిన పలువురు యూజర్స్‌  స్పందిస్తూ , తమకు తోచిన సలహాలిస్తున్నారు. ఒక యూజర్‌ తాను మెట్రోలోనే పనిచేస్తున్నానని, మెట్రో అంతటా సీసీటీవీ నిఘాలో ఉన్నందున చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారన్నారు. ఈ వేధింపుల విషయమై స్టేషన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినా అతను సహాయం అందిస్తాడని పేర్కొన్నారు. 
ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల కోసం సైకత శిల్పి ప్రార్థనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement