ఈ రోజుల్లో హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు క్రియేటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది.
పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్ చేసిన క్యారమెల్ పాప్‌కార్న్‌తో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్ చేసిన కారమెల్ పాప్‌కార్న్ ప్యాకెట్‌తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్‌షిప్ క్యాంపెయిన్‌గా స్విగ్గీ పేర్కొంది.
సాహూ తన ట్విట్టర్ ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నోట్‌తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ లెటర్‌లో ఒక కవితతో పాటు ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్‌షిప్ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్!
The weirdest #FriendshipDay campaign ever! 😀 #Swiggy sent me a bitter gourd with the caramel popcorn packets I ordered yesterday.. pic.twitter.com/dc3I9Q1ItO
— Paushali Sahu 🎶 (@PaushaliSahu) August 7, 2023
Comments
Please login to add a commentAdd a comment