bitter
-
స్వీట్ పాప్‌కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే..
ఈ రోజుల్లో హోమ్ డెలివరీ సర్వీస్ అందిస్తున్న పలు ప్రైవేట్ కంపెనీలు క్రియేటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఇవి ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇటువంటి కోవలోకే వచ్చే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు చెందిన ఒక పోస్టు అందరినీ ఆకర్షిస్తోంది. బెంగళూరుకు చెందిన ఒక మహిళకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి డెలివరీ అయిన వస్తువులలో తాను ఆర్డర్ చేయని ఒక వస్తువు రావడంతో ఆమె కంగుతింది. పౌషాలీ సాహు అనే మహిళకు ఆమె ఆర్డర్ చేసిన క్యారమెల్ పాప్‌కార్న్‌తో పాటు సదరు ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఒక కాకరరాయ వచ్చింది. కాకరకాయను ఆర్డర్ చేయకుండానే, దానిని పంపడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనితో పాటు ఆమెకు ఒక పెద్ద నోట్ కూడా వచ్చింది. ఆమె స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ‘స్విగ్గీలో తాను ఆర్డర్ చేసిన కారమెల్ పాప్‌కార్న్ ప్యాకెట్‌తో పాటు ఒక కాకరకాయ వచ్చింది’ అని పేర్కొంది. దీనిని విచిత్రమైన ఫ్రెండ్షిప్ క్యాంపెయిన్‌గా స్విగ్గీ పేర్కొంది. సాహూ తన ట్విట్టర్ ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నోట్‌తోపాటు కాకరకాయ ఫొటోను కూడా షేర్ చేసింది. ఆ లెటర్లో ఒక కవితతో పాటు ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. ‘ఒక్కోసారి మనం వేటినైతే దూరం పెడుతుంటామో అవే మనకు అత్యంత అవసరమైనవి అవుతుంటాయి.. కాకర మాదిరిగా’ అని దానిలో రాసివుంది. అలాగే నిజమైన స్నేహితులు మనం చెడుదారిలో వెళ్లకుండా చూస్తారని, ఎప్పుడూ మన మంచినే కోరుకుంటారని, అయితే మంచి చేసే స్నేహితుల మాటలు ఒక్కోసారి చేదుగా ఉంటాయని’ దానిలో రాసివుంది. ‘ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మీరు కాకరతో సంబరాలు జరుపుకోండి. ఎందుకంటే అలాంటివారే మంచి స్నేహితులు’ అని స్విగ్గీ పేర్కొంది. ఈ పోస్టును చూసిన యూజర్లు ఇది అద్భుతమైన క్యాంపెయిన్ అని పేర్కొంటున్నారు. ఒక యూజర్ ‘నిజమైన స్నేహితులెప్పుడూ చేదుగానే ఉంటారని’ వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్! The weirdest #FriendshipDay campaign ever! 😀 #Swiggy sent me a bitter gourd with the caramel popcorn packets I ordered yesterday.. pic.twitter.com/dc3I9Q1ItO — Paushali Sahu 🎶 (@PaushaliSahu) August 7, 2023 -
నోట్ల రద్దుతో 'రసగుల్ల' మల్లగుల్లాలు
కోలకత్తా: బెంగాల్ అంటే స్వీట్లకు పెట్టింది పేరు. కానీ డీమానిటేజేషన్ ప్రభావంతో బెంగాల్ తీపి వంటకాలు చేదెక్కుతున్నాయి. ప్రధానంగా బెంగాలీ స్వీట్ గా పేరొందిన రసగుల్లా అమ్మకాలపై వేటు పడింది. రూ.500 నుంచి రూ .1,000 కరెన్సీ నోట్లను నిషేధిస్తూ కేంద్ర నిర్ణయం తమ స్వీట్ల అమ్మకాలపై భారీగా పడిందని పశ్చిమ బెంగాల్ స్వీట్ వర్తకం దారులు వాపోతున్నారు. ముఖ్యంగా కార్తీక పూజ సందర్భంగా ఏడాదికి సరిపడా ఆదాయం వచ్చే స్వీట్ల అమ్మకాలు భారీగా పడిపోవడం తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందన్నారు. స్థానిక వర్తకులు సమాచారం ప్రకారం ఇక్కడ ఏడాదికి లక్షకోట్ల రూపాయల స్వీట్ల వ్యాపారం జరుగుతుంది. పెద్ద నోట్ల రద్దుతో రోజుకి నాలుగు నుంచి పదివేలరూపాయల వరకు అమ్మకాలు పడిపోయాయని హౌరాకు చెందిన గంధేశ్వరీ స్వీట్స్ యజమాని ప్రదీప్ హాల్దర్ చెప్పారు. అలాగే రసగుల్లాను పరిచయం చేసిన ధిమాన్ దాస్ కంపెనీ కూడా ప్రస్తుతం తయారీని నిలిపివేసే స్థితికి వచ్చింది. ఎపుడూ భారీ డిమాండ్ ఉండే తమ రసగుల్లా , సందేష్ లకు ప్రస్తుతం డిమాండ్ 30శాతం పడిపోయందని కంపెనీ యజమాని కేసీ దాస్ తెలిపారు. దీంతో పురాతన స్వీట్ షాప్ లోఉత్పత్తిని ఒక రోజు నిలిపివేసినట్టు చెప్పారు. ముఖ్యంగా డెబిట్ కార్డు ఆప్షన్ లేని వీధి వ్యాపారులు భారీగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు చక్కెర లాంటి ఇతర ముడి పదార్థాలు అందించే విక్రయదారులు పాత నోట్లను అంగీకరించమని తెగేసి చెప్పడం మరింత ఆందోళనకరంగా పరిణమించిందని తెలిపారు. ఇటు పాత నోట్ల చలామణిలేక, అటు కొత్త నోట్లు అందుబాటులోకి ఇబ్బందులు పడుతున్నామన్నారు. అయితే కొంతమంది నమ్మకస్తులైన కస్టమర్లకు తరువాత చెల్లించే పద్ధతిలో స్వీట్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు రూ.100 ల స్వీట్స్ కోసం రూ. 2 వేల నోటు ఇవ్వడంతో చిల్లర కష్టాలు తప్పడంలేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. తమ వ్యాపార నిర్వహణ ఎలాగో అర్థం కావడంలేదన్నారు. కొత్త నోట్ల కొరతతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని వ్యాపారులు చెప్పారు. అయితే క్రెడిట్ కార్డు అమ్మకాలు బాగా పెరిగినా.. అందరికీ డెబిట్ క్రెడిట్ కార్డు చెల్లింపుల అవకాశం లేకపోవడంతో ముఖ్యంగా వీధి వ్యాపారులు బాగా నష్టపోతున్నట్టు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన 'ఆపరేషన్ బ్లాక్ మనీ' ని రాష్ట్రంలోని స్వీట్ వ్యాపారులు కొంతమంది ప్రశంసిస్తున్నారు. కొంతకాలం తమకు ఈ కష్టలు తప్పవు అంటూ సరిపెట్టుకోవడం విశేషం. -
ఉద్యోగులకు 'చేదు' పనిష్మెంట్..!
చైనాః ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడంకోసం కొన్ని కంపెనీలు షరతులు విధిస్తుంటాయి. అలవెన్సులు కట్ చేయడం, ఎక్కువ సమయం పనిచేయించడం ఇదేదీ కుదరకపోతే సస్సెండ్ చేయడం కూడా చూస్తుంటాం. కానీ ఓ చైనా కంపెనీ తమ ఉద్యోగులు టార్గెట్ ను చేరుకోలేకపోతే వింత శిక్ష విధిస్తోంది. అమ్మకాల్లో అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనివారికి సహోద్యోగుల ముందు 'చేదు' అనుభవాన్ని చవి చూపిస్తోంది. ఆధునిక నాగరికతను, అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న దేశంలో.. ఉద్యోగులకు ఇస్తున్న అనాగరిక శిక్షకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇప్పటిదాకా చరిత్రలో కనీ వినీ ఎరుగని శిక్షను ఛొన్క్గింన్గ్ ఆధారిత లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీ.. తమ ఉద్యోగులకు విధిస్తోంది. టార్గెట్స్ చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా కాకరకాయలు తినిపించే పనిష్మెంట్ ఇస్తోంది. ఉన్నతాధికారుల అంచనాల ప్రకారం వారాంతపు టార్గెట్లు చేరుకోలేకపోయిన వారితో బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించి తీవ్రంగా అవమాన పరుస్తోంది. ఒకవేళ తినేప్పుడు ఏమాత్రం కింద పడినా, చేదు భరించలేక ఉమ్మేసినా.. మరింత ఎక్కువగా తినాలన్న రూలు పెట్టింది. సరైన ఫలితాలను ఇవ్వలేని కార్మికులకు ఇటువంటి అవమానకర పనిష్మెంట్ ఇస్తోంది. ఈ చేదును భరించలేక ఉద్యోగులు ఎప్పటికప్పుడు అంచనాలను చేరుకుంటారన్న ఆలోచనతో కంపెనీ ఈ క్రూరమైన శిక్షను విధిస్తోంది. ఇంటర్నెట్ లో పోస్టు చేసిన ఫోటోలను బట్టి.. సుమారు 40 మంది ఉద్యోగులు బలవంతంగా ఈ కాకరకాయ శిక్షను అనుభవించినట్లు తెలుస్తోంది. ఆ చేదు కాకరకాయలను తినండం.. ముఖ్యంగా మింగడం ఎంతో కష్టంగా ఉందని శిక్షను అనుభవించినవారిలో ఓ యువతి స్థానిక విలేకరులకు ఫిర్యాదు చేసింది. తినేప్పుడు ఎక్కిళ్ళు, వాంతు వచ్చినా సరే ఉమ్మకుండా తినాల్సి వచ్చిందని మరో యువతి చెప్పింది. లెషాంగ్ డెకరేషన్స్ కార్పొరేషన్ కంపెనీకి చెందిన ఓ మహిళా ఉద్యోగి.. తమ సంస్థలో ఉద్యోగులపట్ల యాజమాన్యం, ఉన్నతాధికారులు చూపిస్తున్నదురాగతాలను వెలుగులోకి తెచ్చింది. ఇంతకు ముందు కూడా సంస్థ అధికారులు ఉద్యోగులతో గుంజీలు తీయించడం, కార్యాలయం చుట్టూ రెండుమూడుసార్లు పరిగెట్టించడం వంటివి చేసినట్లు తెలిపింది. తాజాగా వారాంతపు పనిష్మెంట్ లో భాగంగా కిలో 2.5 యువాన్లకు కొని మరీ చేదు కాకరకాయలను తినిపిస్తోందని పేర్కొంది. చేదు సమస్యను ఎదుర్కొంటున్న ఉద్యోగులు.. ఆ వివరాలను తెలుపుతూ ఫోటోలు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అసాధారణ శిక్ష... అధికారులు ఆశించిన దానికి భిన్నంగా కూడా ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా బలవంతంగా సహచరుల ముందు కాకరకాయలు తినిపించడంతో 50 శాతం ఉద్యోగులు సంస్థను విడిచి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగులకు సంస్థ ఇచ్చే చాలీచాలని జీతాలకు తోడు, అధికారులు పెట్టే అధిక ఒత్తిడి, ముఖ్యంగా సహోద్యోగుల ముందు అవమానించడాన్ని భరించలేకే సంస్థను విడిచి వెళ్ళేందుకు సిద్ధమౌతున్నట్లు సదరు మహిళా ఉద్యోగి స్థానిక విలేకర్లకు ఫిర్యాదు చేసింది. చైనా శ్రామిక చట్టం ఆర్టికల్ 88 ప్రకారం.. ఉద్యోగికి ఎటువంటి నష్టం సంభవించినా యాజమాన్యం అందుకు బాధ్యత వహించి, పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంపెనీలు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోనట్లుగా కనిపిస్తోంది. కార్మికుల కాళ్ళు, చేతులు కట్టి వీధుల్లో అందరి ముందూ నడిపించడం, సరస్సులచుట్టూ మోకాళ్ళపై నడిపించడం వంటి ఎన్నో అమానవీయ శిక్షలను కొన్ని సంవత్సరాలుగా కంపెనీల్లోని అధికారులు ఉద్యోగులకు విధిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారంటూ కార్మికులు వాపోతున్నారు. -
తింటే పులుపు... చూస్తే చుక్కలు!
సాధారణంగా ఎప్పుడూ చూసే పండ్లకు భిన్నంగా ‘స్టార్ ఫ్రూట్స్’ కొత్తగా అమ్మకానికి వచ్చాయి. మానుకోటకు చెందిన చిరువ్యాపారి ముత్యాల సంపత్‌కుమార్ సీజన్ల వారీగా వివిధ రకాల పండ్లను తీసుకువచ్చి అమ్ముతుంటారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల నుంచి స్టార్ ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఖమ్మంకు, అక్కడి నుంచి మానుకోటకు ఈ పండ్లను తీసుకురాగా, రూ.200కు కేజీ చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 20 పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లు చూడడానికి నక్షత్రం ఆకారం, ఆకుపచ్చని రంగులో ఉండగా.. తింటే వగరు, పులుపుగా ఉంటాయని సంపత్ తెలిపారు. వెరైటీగా ఉండడంతో స్టార్ ఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. - మహబూబాబాద్ రూరల్ -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు.