తింటే పులుపు... చూస్తే చుక్కలు!
సాధారణంగా ఎప్పుడూ చూసే పండ్లకు భిన్నంగా ‘స్టార్ ఫ్రూట్స్’ కొత్తగా అమ్మకానికి వచ్చాయి. మానుకోటకు చెందిన చిరువ్యాపారి ముత్యాల సంపత్‌కుమార్ సీజన్ల వారీగా వివిధ రకాల పండ్లను తీసుకువచ్చి అమ్ముతుంటారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల నుంచి స్టార్ ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి ఖమ్మంకు, అక్కడి నుంచి మానుకోటకు ఈ పండ్లను తీసుకురాగా, రూ.200కు కేజీ చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 20 పండ్లు వస్తున్నాయి.
ఈ పండ్లు చూడడానికి నక్షత్రం ఆకారం, ఆకుపచ్చని రంగులో ఉండగా.. తింటే వగరు, పులుపుగా ఉంటాయని సంపత్ తెలిపారు. వెరైటీగా ఉండడంతో స్టార్ ఫ్రూట్స్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
- మహబూబాబాద్ రూరల్